Folk Song: ఎన్నేళ్లైనా సరే ఈ ఫోక్ సాంగ్ కు ఉండే క్రేజ్ అస్సలు తగ్గదు. పాట రిలీజ్ అయి ఏడేళ్లైనా సరే..ఎప్పుడు ఈ పాట వినిపించినా పూనకాలు లోడింగ్ అవ్వాల్సిందే.
ఇప్పుడంటే రోజుకో ఫోక్ సాంగ్ పుట్టుకొస్తుంది గానీ..పదేళ్ల క్రితం వచ్చిన ఫోక్ సాంగ్స్ కి మామూలు క్రేజ్ లేదు. అప్పట్లో తెలంగాణలో ఎక్కడ చూసినా, ఏ బరాత్ లో అయినా ఈ పాటలే ఉండేవి. పాట ప్లే అయితే చాలు...డాన్స్ రాని వారు కూడా ఆ రిథమ్ కు కాళ్లు కదపాల్సిందే. ఒక మాటలో చెప్పాలంటే పూనకాలు లోడింగ్.
24
చలో చలో కమలమ్మ సాంగ్
అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది..జాను లిరి, తన మాజీ భర్త చేసిన చలో చలో కమలమ్మ సాంగ్. ఆ పాటలో వాళ్లు చేసిన డాన్స్...ఊర మాస్ అసలు. వాళ్లిద్దరు డాన్స్ చేస్తుంటే ఆ పాట విన్నవాళ్లకు బాడీలో రిథమ్ క్రియేట్ అయ్యిందని చెప్పడంలో ఏ మాత్రం తప్పులేదు. ఆ మ్యూజిక్, ఆ డాన్స్...అబ్బో మామూలు గ్రేస్ లేదు.
34
బావా, మరదళ్ల సరసాల పాట
చలో చలో కమలమ్మ వయ్యారి చలో కమలమ్మ హలో హలో భావయ్య నా అందమంతా నీదయ్యా....ఈ పాట మీరెప్పుడైనా విన్నారా? బావా, మరదళ్ల సరసాలకు సంబంధించి ఈ పాట సాగుతుంది. జానపద సాహిత్యం, పల్లెల్లో బావా, మరదళ్ల గిల్లిగజ్జాలు..ఈ పాటలో చక్కగా చూపించారు.
తెలంగాణ ఫోక్ సాంగ్స్ అంటే అప్పట్లో జానులిరినే గుర్తొస్తుంది. ఆమె పాటలకు, ఆమె డాన్స్ కు భారీగానే అభిమానులు ఉన్నారు. శెనిగచేన్ల నిలబడి, గుట్ట గుట్టా తిరిగేటోడా, కమలాపురం రోడ్డాట, ఆడనెమలి, వన్నెలాడి, టిక్కులాడి, పొడిపొడి వాన...ఈ పాటలతో జానుకు మంచి క్రేజ్ వచ్చింది. ఆమె డాన్స్ వల్ల పెద్ద పెద్ద షోస్ ల్లో అవకాశం వచ్చింది. ఇప్పుడంటే ఫోక్ సాంగ్స్ హెవీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. సినిమా బడ్జెట్ ల కంటే వీటికే ఎక్కువ అయిపోతుంది. కానీ ఈ జానులిరి చలో చలో కమలమ్మ పాటకు హెవీ క్యాస్ట్యూమ్ కూడా లేదు. సింపుల్‍గా, ముగ్గురు, నలుగురు డాన్సర్లతో ఈ పాట రూపొందించారు. ఎక్కడా వల్గారిటీ ఉండదు. ఒకసారి జానులిరి చేసిన ఈ చలో చలో కమలమ్మ వయ్యారి చలో కమలమ్మ పాట విని ఎంజాయ్ చేయండి.