Adi Reddy: మళ్లీ బిగ్ బాస్ వచ్చేస్తోంది.. కేవలం రివ్యూలు చెప్పి.. నెలకు ఆదిరెడ్డి ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా?

Published : Jun 10, 2026, 05:02 PM IST

 Adi Reddy: బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 కి సిద్ధమౌతోంది. రీసెంట్ గా ప్రోమో కూడా రిలీజ్ చేశారు. బిగ్ బాస్ వస్తోంది అనగానే అందరికీ ముందు గుర్తుకు వచ్చేది రివ్యూవర్ ఆదిరెడ్డి. కేవలం బిగ్ బాస్ తోనే ఆదిరెడ్డి ప్రతినెలా ఎంత సంపాదిస్తాడో తెలుసా? 

PREV
13
బిగ్ బాస్ ఆదిరెడ్డి...

ప్రముఖ రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగులో ఇప్పటి వరకు దిగ్విజయంగా తొమ్మిది సీజన్లు పూర్తి చేసుకుంది. పదో సీజన్ రావడానికి సిద్ధమౌతోంది. ప్రతి సంవత్సరం బిగ్ బాస్ కి చాలా మంది వస్తూనే ఉంటారు. వారిలో ఒక్కరు మాత్రమే సీజన్ విన్నర్ అవుతారు. కామనర్ గా వచ్చి.. సెలబ్రెటీలుగా మారినవారు కూడా ఉన్నారు. అయితే.. ప్రతి ఏడాది సీజన్ మారుతోంది..విన్నర్ మారుతున్నారు.. ఆఖరికి హోస్ట్ కూడా మారారు. కానీ.. ఇన్నేళ్లుగా బిగ్ బాస్ రివ్వ్యూ అంటే మాత్రం ముందుగా గుర్తుకు వచ్చే పేరు మాత్రం ఆదిరెడ్డి.

బిగ్ బాస్ సీజన్ 1 మొదలైనప్పటి నుంచి రివ్యూలు ఇవ్వడం మొదలుపెట్టాడు. ఇప్పటికీ రివ్యూలు ఇస్తూనే ఉన్నాడు. ఈ రివ్యూలతో ఫేమస్ అయ్యి.. సీజన్ 6 లో ఏకంగా కంటెస్టెంట్ గా కూడా అడుగుపెట్టాడు. ఆ సీజన్ లో అతను విన్నర్ కాలేదు. టాప్ 3 లో నిలిచాడు. కానీ.. కంటెస్టెంట్ గా వెళ్లిన దానికంటే కూడా.. రివ్యూలు చెప్పే ఎక్కువ సంపాదిస్తున్నాడు.

23
సరదాగా మొదలుపెట్టి..

యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించొచ్చు.. రివ్యూలు చెప్పి ఫేమస్ అవుతాను అని కాకుండా.. బిగ్ బాస్ అంటే తనకు ఉన్న ఇష్టంతో.. ఈ పని మొదలుపెట్టాడు. కానీ..సరదాగా మొదలుపెట్టిన ఈ పనే అతనికి ఆదాయం తెచ్చి పెట్టడం మొదలుపెట్టింది. రివ్యూలు చెప్పడం వల్ల చాలా కొద్ది రోజుల్లోనే ఫేమస్ అయ్యాడు. మొదట్లో... బిగ్ బాస్ రివ్యూలు చెప్పే సమయంలో నెలకు రూ.70వేలు వచ్చేవి. అయితే.. బిగ్ బాస్ సీజన్ బాగుండి.. పీక్ లో ఉన్నప్పుడు తనకు ఒక నెల ఏకంగా రూ.39లక్షల ఆదాయం వచ్చింది అని.. ఆది రెడ్డి స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం. ఏళ్ల తరబడి..ఐటీ ఉద్యోగాలు, ఐఏఎస్, ఐపీస్ ఉద్యోగాలు చేసేవారికి కూడా ఇది సాధ్యం కాదు అనే చెప్పాలి. బిగ్ బాస్ నడిచిన మూడు నెలలు ఆదిరెడ్డి ఆదాయం ఇలానే ఉంటుంది.

ఒకప్పుడు బిగ్ బాస్ ఉన్నంత కాలం వీడియోలు చేసి... తర్వత కామ్ గా ఉండేవాడు. కానీ.. ఈ మధ్యకాలంలో బిగ్ బాస్ లేని సమయంలో కూడా రివ్యూ వీడియోలు చేయడం మొదలుపెట్టాడు. సమాజంలో జరుగుతున్న విషయాలపై తన అభిప్రాయం చెప్పడం.. స్టార్ హీరోల మూవీలకు రివ్యూలు చెప్పడం లాంటివి చేస్తూ ఉంటాడు. రీసెంట్ గా మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ కి కూడా రివ్యూలు ఇచ్చాడు ఇంత కాలం నుంచి బిగ్ బాస్ అప్ డేట్స్ ఇస్తూ రావడం వల్ల.. ఆ నిర్వాహకులతో కూడా ఆదిరెడ్డికి సత్సంబంధాలు బాగానే ఉన్నాయి. అందుకే.. ఎవరికీ తెలియని లీక్స్ కూడా ఇచ్చేస్తూ ఉంటాడు. దీంతో.. ఆ లీక్స్ తెలుసుకోవడానికి కూడా ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తూ.. ఆదిరెడ్డి రివ్యూలు చూస్తూ ఉంటారు. ప్రస్తుతం ఆదిరెడ్డికి 933 వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఎక్కువ మంది బిగ్ బాస్ అప్ డేట్స్ కోసమే ఆది రెడ్డిని ఫాలో అవుతూ ఉంటారు.

33
ఆది రెడ్డి సక్సెస్ మంత్రా..

బిగ్ బాస్ గురించి రివ్యూలు ఇచ్చేవాళ్లు చాలా మందే ఉన్నారు. కానీ.. ఎంత మంది పోటీ వచ్చినా ఆదిరెడ్డి మాత్రం వెనకపడలేదు. ఎందుకంటే.. అందరూ టీవీలో వచ్చిన ఎపిసోడ్ చూసి రివ్యూ ఇస్తే.. ఆదిరెడ్డి మాత్రం.. లైవ్ కూడా చూసి.. ఏ కంటెస్టెంట్ ఏం చేశాడు.. ఏం మాట్లాడాడు.. అన్నీ క్లియర్ గా చెబుతాడు. అంతేకాదు.. ప్రోమోలను.. ఆఖరికి హోస్ట్ చేసే తప్పులను కూడా ఎత్తి చూపిస్తాడు. అందుకే.. ఇప్పటికీ సక్సెస్ ఫుల్ గా తన రివ్యూలను కొనసాగిస్తున్నాడు. అంతేకాదు..షో మొదలైనప్పుడే.. ఎవరికి విన్నర్ అయ్యే అవకాశాలు ఉన్నాయో కూడా చెప్పేస్తాడు. ఆది రెడ్డి ఎవరిని సపోర్ట్ చేస్తే.. వాళ్లే విన్నర్ అవుతారు అనే నమ్మకం కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories