ఈ వారం ఓటీటీ ప్రియులకు పండగే.. ప్రియాంక చోప్రా, కమల్ హాసన్, కీర్తి సురేష్ చిత్రాలు వచ్చేస్తున్నాయి

Published : Jun 30, 2025, 09:51 AM IST

ఈ వారం (జూన్ 30, 2025 – జూలై 6, 2025) ఓటీటీ అభిమానుల కోసం పసందైన సినిమాలు, వెబ్ సిరీస్ ల విందు సిద్ధం అవుతోంది.

PREV
17
ఈ వారం ఓటీటీ రిలీజ్‌లు

ఈ వారం (జూన్ 30, 2025 – జూలై 6, 2025) ఓటీటీ అభిమానుల కోసం పసందైన సినిమాలు, వెబ్ సిరీస్ ల విందు సిద్ధం అవుతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ అయిన నెట్‌ఫ్లిక్స్, జియోహాట్‌స్టార్, ప్రైమ్ వీడియో,జీ 5( ZEE5), సోనీ లివ్‌లలో 10 కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు విడుదల కానున్నాయి. హారర్, డ్రామా, పిరియాడికల్, థ్రిల్లర్స్‌ ఇలా విభిన్న జోనర్లకు చెందిన చిత్రాలు ఓటీటీ వేదికపై సందడి చేయబోతున్నాయి. ఆ చిత్రాలు, వెబ్ సిరీస్ ల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

27
జియో హాట్ స్టార్(JioHotstar) రిలీజ్‌లు

కంపానియన్ (Companion) – జూన్ 30

ఓ ప్రశాంత వీకెండ్ ట్రిప్ ఎలా డిజాస్టర్ గా మారింది అనే అంశాలు ఈ చిత్రంలో ఉత్కంఠభరితంగా చూపించారు. సైంటిఫిక్ ఫిక్షనల్ థ్రిల్లర్ గా ఈ చిత్రం రూపొందింది. 

గుడ్ వైఫ్ (Good Wife) – జూలై 4

న్యాయవాదిగా ఉన్న తరుణికా గృహిణిగా మారిన తర్వాత తన కుటుంబంపై వచ్చిన స్కాండల్‌తో ఊహించని జీవితాన్ని ఎదుర్కొంటుంది. ఆమె కుటుంబాన్ని మీడియా, చట్టం నుంచి ఎలా కాపాడుతుంది అనేదే ప్రధానాంశం. ఈ వెబ్ సిరీస్ లో ప్రియమణి ప్రధాన పాత్రలో నటించారు. 

37
జీ 5(ZEE5) రిలీజ్‌లు

తుమ్ సి తుమ్ తక్ (Tum Se Tum Tak) – జూన్ 30

సామాజిక నిబంధనలకు వ్యతిరేకంగా ప్రేమించిన అనూ, ఆర్యవర్థన్ ప్రేమలోని అడ్డంకులను ఎదుర్కొంటారు. వయస్సు, కుటుంబ వ్యతిరేకతలను అధిగమిస్తూ వారి ప్రయాణం సాగుతుంది. జీ 5లో ఈ టీవీ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. 

కాళీధర్ లాపత (Kaalidhar Laapata) – జూలై 4

అభిషేక్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ ఎమోషనల్ చిత్రం జీ 5లో జూలై 4న రిలీజ్ అవుతోంది. అభిషేక్ బచ్చన్ నటుడిగా 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ చిత్రం రిలీజ్ అవుతోంది. 

47
ప్రైమ్ వీడియో (Prime Video) రిలీజ్‌లు

హెడ్స్ ఆఫ్ స్టేట్ (Heads of State) – జూలై 2

అమెరికా అధ్యక్షుడి (Idris Elba), బ్రిటన్ ప్రధానమంత్రి (John Cena) మధ్య రాజకీయ విభేదాలు ఉన్నా, ప్రపంచాన్ని బెదిరిస్తున్న శత్రువు నుంచి రక్షించేందుకు వీరిద్దరూ కలుసుకుంటారు. వారితో కలిసి ప్రియాంక చోప్రా కూడా కీలకమైన MI6 ఏజెంట్‌గా కనిపిస్తుంది. ఈ థ్రిల్లర్ మూవీ జూలై 2న ప్రైమ్ వీడియోలో రిలీజ్ అవుతోంది. 

ఉప్పు కప్పు రంబు (Uppu Kappu Rambu) – జూలై 4

తెలుగు గ్రామం చిట్టి జయపురంలో 1990ల్లో శ్మశాన స్థలానికి సంబంధించిన సమస్యలు చోటుచేసుకుంటాయి. అపూర్వ అనే కొత్త నాయకురాలు, చింత అనే శ్మశాన కాపలాదారు కలిసి దీన్ని ఎలా పరిష్కరించారు అనేదే కథాంశం. గ్రామీణ నేపథ్యంలో ఫన్ చిత్రంగా రూపొందిన ఈ మూవీలో హీరో సుహాస్, కీర్తి సురేష్ ప్రధాన పాత్రల్లో నటించారు. 

57
నెట్ ఫ్లిక్స్ (Netflix) రిలీజ్‌లు

ది ఓల్డ్ గార్డ్ 2(The Old Guard 2) – జూలై 2

యోధురాలిగా చార్లీజ్ థెరాన్ మళ్లీ తిరిగి వస్తుంది. బుకర్ ద్రోహం చేసిన తర్వాత వెలివేయబడతాడు. ఉత్కంఠ భరిత సన్నివేశాలతో సూపర్ హీరో చిత్రంగా రూపొందిన ఈ మూవీ జూలై 2న ఓటీటీ లోకి రానుంది. 

ది సాండ్ మాన్ సీజన్ 2(The Sandman Season 2 Volume 1) – జూలై 3

అడుగడుగునా ఉత్కంఠ రేకెత్తించే సన్నివేశాలతో ది సాండ్ మాన్ సీజన్ 2 ఉంటుంది. ఫ్యాంటసీ, మిస్టరీ కలగలిపిన ఈ సిరీస్ జూలై 3న ప్రేక్షకులకు వినోదం అందించబోతోంది.

థగ్ లైఫ్(Thug Life) – జూలై 3

కమల్ హాసన్, త్రిష, అభిరామి, శింబు ప్రధాన పాత్రల్లో నటించిన థగ్ లైఫ్ చిత్రం జూలై 3న ఓటీటీలో రిలీజ్ అవుతోంది. మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం థియేటర్స్ లో డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే.  

67
సోని లివ్ (Sony LIV) రిలీజ్‌లు

ది హంట్‌: ది రాజీవ్‌ గాంధీ అసాసినేషన్‌ కేస్‌ – జూలై 4

అనిరుద్ధ మిత్రా రచించిన ‘90 డేస్’ పుస్తకాన్ని ఆధారంగా చేసుకుని రూపొందిన ఈ వెబ్ సిరీస్ రాజీవ్ గాంధీ హత్య వెనుకున్న కుట్రను వెలికితీసేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం చేసిన ప్రయత్నాలను చూపుతుంది. శివరాసన్ అనే మాస్టర్‌మైండ్‌ను పట్టుకునేందుకు న్యాయం కోసం జరిపిన సంఘర్షణను ఆసక్తికరంగా చూపిస్తుంది.

77
థియేటర్ లో రిలీజ్ అయ్యే చిత్రాలు

ఇక ఈ వారం థియేటర్స్ లో కూడా అలరించేందుకు కొన్ని చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. 

తమ్ముడు : నితిన్, సప్తమి గౌడ, లయ, వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రల్లో నటించిన తమ్ముడు చిత్రం జూలై 4న థియేటర్స్ లో రిలీజ్ అవుతోంది. ఈ చిత్రానికి వకీల్ సాబ్ ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకుడు కాగా.. దిల్ రాజు నిర్మించారు. 

3 బి హెచ్ కె : సిద్దార్థ్ నటించిన ఈ చిత్రం శ్రీ గణేష్ దర్శకత్వంలో రూపొందింది. ఈ మూవీ కూడా జూలై 4న థియేటర్స్ లో రిలీజ్ అవుతోంది. 

Read more Photos on
click me!

Recommended Stories