2024లో టాలీవుడ్ బాక్సాఫీస్‌ను ఏలిన టాప్ 5 స్టార్స్

Published : Dec 29, 2024, 08:12 AM IST

2024లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 5 స్టార్స్ ఎవరో తెలుసుకోండి. పుష్ప 2, కల్కి 2898 AD, దేవర వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో ఈ స్టార్స్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటారు.

PREV
16
2024లో టాలీవుడ్  బాక్సాఫీస్‌ను ఏలిన టాప్ 5 స్టార్స్
allu arjun, tollywood, ntr, prabhas, mahesh babu


రీసెంట్ గా  తెలుగు సినిమా  పాన్ ఇండియా స్దాయిలో సక్సెస్ సాధిస్తోంది. ఈ స్దాయికి తెలుగు సినిమాని తీసుకెళ్లేందుకు పెద్ద స్టార్స్, డైరక్టర్స్, నిర్మాతలు చాలా మంది కష్టపడ్డారు. అయితే ప్రతీ ఒక్కరికీ ప్యాన్ ఇండియా విజయం దక్కలేదు. కొద్ది మంది హీరోలు మాత్రమే భాక్సాఫీస్ దగ్గర జెండా ఎగరేసారు.

2024 మరికొద్ది రోజుల్లో బై చెప్తున్న ఈ సమయంలో ఏషియా నెట్ తెలుగు భాక్సాఫీస్ కలెక్షన్స్ ని లెక్కేస్తూ  ఈ సంవత్సరం భాక్సాఫీస్ దగ్గర సూపర్  హిట్‌లను అందించిన టాప్ ఫైవ్ స్టార్స్ ను  ఎంపిక చేసింది. ఇంట్రస్టింగ్  విషయం ఏమిటంటే, వీళ్లంతా మన తెలుగు సినిమాకు జాతీయ స్దాయిలో క్రేజ్ తెచ్చి పెట్టిన  వారే.   

26
pawan kalyan, allu arjun, og movie


 
అల్లు అర్జున్

ఇప్పుడు ఎక్కడ విన్నా అల్లు అర్జున్ గురించిన వార్తలే. పుష్ప 2 తో ప్యాన్ ఇండియా సక్సెస్  తెచ్చుకున్న అల్లు అర్జున్ 2024లో అత్యథిక కలెక్షన్స్ సాధించిన హీరోగా తన ప్రస్దానం కొనసాగిస్తున్నారు.  2024లో పుష్ప 2: ది రూల్‌లో పుష్ప రాజ్ పాత్రను మరోసారి పోషించాడు. 2024లో ఒకే ఒక్క విడుదల ఉన్నప్పటికీ, అల్లు అర్జున్ మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. హిందీలోనే రూ. 700 కోట్లకుపైగా (నెట్‌) కలెక్షన్స్‌ రాబట్టిన ఈ సినిమా కొన్ని రోజుల నుంచి అక్కడ త్రీడీ వెర్షన్‌లోనూ ప్రదర్శితమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలతో సహా మొదటి 22 రోజుల్లో రూ. 1719.5 కోట్లకు పైగా వసూలు చేసింది
 

36


ప్రభాస్

ప్ర‌భాస్ క‌ల్కి 2898 ఏడీ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద అద‌ర‌గొట్టింది. ఇండియ‌న్ సినిమా చ‌రిత్ర‌లో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన ఏడో మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది. దాదాపు 600 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ మూవీ థియేట‌ర్ల‌లో ఏకంగా 1054 కోట్ల వ‌ర‌కు వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. 2024 ఏడాదిలో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ సాధించిన ఇండియ‌న్ మూవీగా నిలిచింది.

ఫుల్ థియేట్రిక‌ల్ ర‌న్‌లో తెలుగు రాష్ట్రాల్లో క‌ల్కి 2898 ఏడీ మూవీ 300 కోట్ల‌కుపైగా గ్రాస్‌ను, 182 కోట్ల వ‌ర‌కు షేర్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. క‌ర్ణాట‌క‌లో 77 కోట్లు, త‌మిళ‌నాడులో 45 కోట్లు, కేర‌ళ‌లో 33 కోట్ల వ‌ర‌కు క‌ల్కి మూవీ క‌లెక్ష‌న్స్ ద‌క్కించుకుంది. ఓవ‌ర్‌సీస్‌లో క‌ల్కి మూవీ గ‌త టాలీవుడ్ మూవీ రికార్డులు మొత్తం చెరిపివేసింది. 260 కోట్ల వ‌ర‌కు గ్రాస్‌ను 120 కోట్ల వ‌ర‌కు షేర్ క‌లెక్ష‌న్స్ సొంతం చేసుకున్న‌ది.

46


ఎన్టీఆర్

 ఎన్టీఆర్ దేవ‌ర మూవీ 2024 ఏడాదిలో టాలీవుడ్‌లో నిర్మాత‌ల‌కు అత్య‌ధిక లాభాల‌ను తెచ్చిపెట్టిన సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీ వ‌ర‌ల్డ్ వైడ్‌గా 450 కోట్ల వ‌ర‌కు గ్రాస్ క‌లెక్ష‌న్స్‌ రాబ‌ట్టింది. 260 కోట్ల వ‌ర‌కు షేర్ క‌లెక్ష‌న్స్ సొంతం చేసుకున్న‌ది. దాదాపు 184 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ఈ మూవీ రిలీజైంది. నిర్మాత‌ల‌కు 74 కోట్ల వ‌ర‌కు లాభాల‌ను తెచ్చిపెట్టిన‌ట్లు స‌మాచారం. తెలుగు రాష్ట్రాల్లో 240 కోట్ల వ‌ర‌కు గ్రాస్ క‌లెక్ష‌న్స్‌...162 కోట్ల వ‌ర‌కు షేర్ క‌లెక్ష‌న్స్ ద‌క్కించుకున్న‌ట్లు తెలిసింది.

56


తేజ సజ్జా

తేజ సజ్జ (Teja Sajja) , ప్రశాంత్ వర్మ (Prashanth Varma) కాంబినేషన్లో రూపొందిన ‘హనుమాన్’ (Hanu Man) మూవీ జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జనవరి 11న వేసిన ప్రీమియర్ షోలతో బ్లాక్ బస్టర్ టాక్ ను సంపాదించుకున్న ఈ మూవీ ఆ తర్వాత షోలు, స్క్రీన్స్ పెంచుకుంటూ భారీ కలెక్షన్స్ ను నమోదు చేసింది.

రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా తర్వాత బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టించింది. ‘హనుమాన్’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.28.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.28.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఫుల్ రన్లో ఈ సినిమా రూ.154.68 కోట్ల షేర్ ను రాబట్టి… బయ్యర్స్ కి రూ.126.18 కోట్ల లాభాలు అందించి ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది

66


మహేష్ బాబు

సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో తెరకెక్కిన మూవీ 'గుంటూరు కారం'. ఈ సినిమా సంక్రాంతి కానుకగా హనుమాన్ సినిమాతో పోటీగా విడుదలై డివైడ్ టాక్‌తో దాదాపు బాక్సాఫీస్ దగ్గర 90 శాతం రికవరీ సాధించింది.  ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ క్లోజింగ్ వసూళ్ల విషయానికొస్తే..ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా  రూ. 111 కోట్ల షేర్.. (రూ. 184.5 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టింది.

Read more Photos on
click me!

Recommended Stories