Tamil Nadu, ram charan, Game Changer ,#director shankar, #game changer, #Ram Charan
ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా భారీగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి సాంగ్స్, టీజర్ వచ్చి సినిమాపై అంచనాలు పెంచేసాయి. గేమ్ ఛేంజర్ సినిమా సంక్రాతికి జనవరి 10న రిలీజ్ కానుంది.
ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఇంట్రస్టింగ్ గా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఈ సినిమా ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు. అమెరికాలో ఫస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సైతం గ్రాండ్ గా చేసారు. మరో ప్రక్క ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఊపందుకుంది. తెలుగు రాష్ట్రాల్లో రామ్ చరణ్ కు ఉన్న క్రేజ్ తో బిజినెస్ మామూలుగా ఉండదు. మరి తమిళనాడులో శంకర్ క్రేజ్ తో బిజినెస్ ఎంత అవుతోందనే ఆసక్తి క్రియేట్ అయ్యింది.
గేమ్ ఛేంజర్ సినిమాను శంకర్ డైరెక్ట్ చేస్తున్నా ఈ కథ రాసింది మాత్రం తమిళ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు. అయితే ఈ సినిమాకు కొన్ని డైలాగ్స్ తమిళనాడులోని ఓ రాజకీయ నాయకుడితో రాయించారు. తమిళనాడులో మధురై ఎంపీగా ఉన్న వెంకటేశన్ గేమ్ ఛేంజర్ సినిమాకు తమిళ్ లో డైలాగ్స్ రాసారంట. సిపిఐ పార్టీకి చెందిన వెంకటేశన్ ప్రస్తుతం మధురై ఎంపీగా ఉన్నారు. దాంతో అక్కడ కూడా ఈ సినిమాకు మెల్లిమెల్లిగా బజ్ క్రియేట్ అవుతోంది.
తమిళనాడులో బిజినెస్ విషయానికి వస్తే... గేమ్ చేంజర్ మూవీ హక్కులను ఎస్‌వీసీ, ఆదిత్యరామ్ మూవీస్ సంస్థలు తమిళంలో విడుదల చేస్తున్నారు. తమిళంలో ఈ పొలిటికల్ థ్రిల్లర్ చిత్రం రైట్స్ 15కోట్లుకు వెళ్లాయని తెలుస్తోంది.
అంటే అక్కడ బ్రేక్ ఈవెన్ రావాలంటే 35కోట్లు గ్రాస్ రాబట్టాల్సి ఉంటుంది. శంకర్ బ్రాండ్ ఇమేజ్ కు ఇది పెద్ద కష్టమైన విషయం ఏమీ కాదు. రామ్ చరణ్ కు కూడా తమిళనాట మంచి ఫాలోయింగ్ ఉంది. తమిళనాడులో ఈ చిత్రానికి మంచి డబ్బులు తెచ్చిపెడుతుందని నమ్ముతున్నారు.
అయితే తమిళనాడులో ఇంకా ఎక్కువ రేటు పలికేదని అయితే తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ తన ప్రస్తుత 'విడాయమర్చి' సంక్రాంతి రేసులో ఉంది. ఆ సినిమాకే మాగ్జిమం స్క్రీన్స్ కేటాయిస్తారు. దాంతో తక్కువ రేటుకు సినిమా రైట్స్ వెళ్ళాయి. ఇక తమిళనాట పాజిటివ్ టాక్ కనుక వస్తే 50 Cr+ దాకా గ్రాస్ కలెక్ట్ చేసే అవకాసం ఉందని అక్కడ ట్రేడ్ అంచనా వేస్తోంది.
నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ.. ‘‘నా 21 ఏళ్ల సినీ ప్రయాణంలో నిర్మాతగా ‘గేమ్ చేంజర్’ నిర్మాతగా 50వ సినిమా. ఈ మూవీ షూటింగ్ పూర్తయ్యింది. మూడేళ్ల క్రితం శంకర్ ఈ సినిమా స్టోరీ లైన్ నాకు చెప్పగానే ఎగ్జయిట్ అయ్యాను. ఆదిత్యరామ్ నాకు మంచి స్నేహితుడు. ఆయన ఇది వరకే తెలుగు చిత్రాలను నిర్మించారు.
తర్వాత ఆయన చెన్నైలో రియల్ ఎస్టేట్ చేస్తూ బిజీగా ఉండిపోయారు. ఇటీవల ఆయన్ని కలిసినప్పుడు నేను గేమ్ చేంజర్ మూవీని చేస్తున్నానని చెప్పారు. ఆదిత్య రామ్ కూడా ఇన్‌స్పైర్ అయ్యి ఇద్దరం కలిసి చేద్దామని నిర్ణయించుకున్నాము. ఈ ట్రావెల్ కంటిన్యూ అవుతూనే ఉంది.ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ, అంజలి హీరోయిన్స్ గా నటించారు. ఎస్.జె.సూర్య మరో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. తమన్ అద్భుతమైన సాంగ్స్ అందించారు అన్నారు.
ఆదిత్య రామ్ మాట్లాడుతూ.. ‘నేను సినీ రంగం నుంచి గ్యాప్ తీసుకుని 10 యేళ్లు అవుతోంది. కానీ దిల్‌రాజుతో కలిసి ఈ సినిమా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నందుకు ఆనందగా ఉంది. ఆదిత్యరామ్ మూవీస్ బ్యానర్‌పై నాలుగు సినిమాలు చేశాను.
ప్రభాస్ తో ఏక్ నిరంజన్ సినిమా తర్వాత నిర్మాతగా బ్రేక్ తీసుకున్నానన్నారు. ఆ తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగు పెట్టేశాను. అందువల్ల బ్రేక్ వచ్చింది. ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమాతో మీ ముందుకు వస్తున్నాను. ఎస్‌వీసీతో కలిసి ఆదిత్యరామ్ మూవీస్ ఈ సినిమాను తమిళంలో విడుదల చేస్తున్నట్టు చెప్పారు. ఈ సినిమా హిందీలో కరణ్ జోహార్ ఏఏ ఫిల్మ్స్ నిర్మిస్తున్నారు.