Allu arjun: ‘అలవైకుంఠపురములో’Netflix నుంచి తీసేస్తున్నారు

Published : Feb 26, 2025, 04:03 PM IST

 Allu arjun: అల్లు అర్జున్ నటించిన 'అల వైకుంఠపురములో' సినిమా నెట్‌ఫ్లిక్స్ నుండి తొలగించబడుతోంది. ఫిబ్రవరి 27 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. సన్ నెక్స్ట్ ఓటీటీలో చూడవచ్చు.

PREV
13
 Allu arjun: ‘అలవైకుంఠపురములో’Netflix నుంచి తీసేస్తున్నారు
Allu arjun Ala Vaikunthapurramulo Exits Netflix in telugu


Allu arjun: 2020 సంవత్సరంలో ‘అలవైకుంఠ పురములో’ ఓ సంచలనమే సృష్టించింది. ఈ సినిమా పాటలు దేశాల సరిహద్దులు దాటి తెలుగు రాని విదేశీయులతోనూ స్టెప్పులేయించాయి. స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ రికార్డులు బద్దలు కొట్టింది.

కరోనా ప్రభావంతో థియేటర్లన్నీ మూతపడ్డా బన్నీ సినిమా మాత్రం రికార్డులు తిరగరాసింది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో  సౌత్ లో అత్యధికంగా చూసిన సినిమాల్లో టాప్‌-10 చిత్రాలను ఆ సంస్థ ప్రకటించింది. అయితే నెట్ ప్లిక్స్ నుంచి ఈ సినిమా తీసేస్తున్నారనే వార్త బయిటకు వచ్చి షాక్ ఇచ్చింది. 

23
Allu arjun Ala Vaikunthapurramulo Exits Netflix in telugu


పిభ్రవరి  నెల 27 వరకూ మాత్రమే 'నెట్ ఫ్లిక్స్'లో అల వైకుంఠపురంలో సినిమా అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత అందులో ఉండే అవకాశం లేదు.  ఎగ్రిమెంట్ ప్రకారం ఈ సినిమాని నెట్  ప్లిక్స్ నుంచి తీసేస్తున్నారు. నెట్ ఫ్లిక్స్ నుంచి ఈ సినిమాను తొలగించినా సన్ నెక్స్ట్‌ (Sun NXT) ఓటీటీలో ఈ సినిమా అందుబాటులో ఉంటుంది.

బన్నీ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ఈ సినిమా ఇప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.  ‘అలవైకుంఠపురములో’. బన్నీ సరసన పూజా హెగ్డే నటించింది. టబు, సుశాంత్‌, సునీల్‌, నివేదా పేతురాజ్‌ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు.

తమన్‌ సంగీతం అందించారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా మంచి వసూళ్లు రాబట్టడంతో పాటు మ్యూజికల్‌ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై రాధాకృష్ణ నిర్మించారు. 
 

33
Allu arjun Ala Vaikunthapurramulo Exits Netflix in telugu


అల్లు అర్జున్‌-తివిక్రమ్‌ కాంబినేషన్‌ అనగానే మనకు ‘జులాయి’, ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ చిత్రాలే గుర్తుకొస్తాయి. ఈ రెండూ బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకున్నాయి. అలా ముచ్చటగా మూడోసారి వీరి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘అల వైకుంఠపురములో..’

 ఒక సరదా సినిమా చేయాలన్న ఉద్దేశంతో చాలా రోజులు వెయిట్‌ చేశానని, అందుకే గ్యాప్‌ వచ్చిందని బన్ని చెప్పారు. అంత  గ్యాప్‌ తర్వాత వచ్చిన ఈ సినిమా  అదిరిపోయింది. గత రెండు చిత్రాలని మించి  బన్ని-త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌ మేజిక్‌ చేసింది. యువతను ఓ ఊపు ఊపేసిన ‘సామజవరగమన’, ‘రాములో.. రాములా’ వెండితెరపై  ఓ రేంజిలో  అలరించాయి. బన్ని ఆ యేడాది సంక్రాంతి పోటీలో గెలిచారు. 

Read more Photos on
click me!

Recommended Stories