జానీ మాస్టర్ ని కావాలనే ఇరికించారా, నిజం ఏమిటి?

First Published | Sep 18, 2024, 11:20 AM IST

ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి డ్యాన్సర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా ఉన్నాడు. ఈ వివాదం తేలేవరకూ అతన్ని డ్యాన్సర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని,

choreographer Shaik Jani Basha aka jani master accused of sexually abusing woman


 ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల వ్యవహారం తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తీవ్ర దుమారాన్ని రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ వివాదంపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేయగా, టాలీవుడ్‌లోని లైంగిక వేధింపుల పరిష్కార కమిటీ కూడా తీవ్రంగా స్పందించింది.

కొరియోగ్రఫీ అసోసియేషన్ అధ్యక్షుడి బాధ్యతల నుంచి జానీ మాస్టర్‌ను తాత్కాలికంగా తప్పించాలని సిఫారసు చేసిన కమిటీ, పని ప్రదేశాల్లో మహిళలకు చలన చిత్ర పరిశ్రమ ధైర్యాన్ని ఇవ్వలేకపోతోందని ఆవేదన వ్యక్తం చేసింది. చిత్ర పరిశ్రమలో మహిళలు వేధింపులకు గురైతే ధైర్యంగా ఫిర్యాదు చేయవచ్చని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని కమిటీ స్పష్టం చేసింది. ఈ నేపధ్యంలో జానీ మాస్టర్ ని కొందరు ఫ్రేమ్ చేసి ఇరికించారనే ప్రచారం మొదలైంది.

Jani Master


జానీ మాస్టర్ గతంలో ఓ రాజకీయ పార్టీకు  వ్యతిరేకంగా మాట్లాడటం,అలాగే యూనియన్ లో గొడవలు, అసోసియేషన్ లో  కొన్ని విభేధాలుతో ఆయన్ని ఫ్రేమ్ చేసి లాక్ చేసారని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఈ విషయమై మీడియా వ్యక్తులు కొందరు దర్శక,నిర్మాత  తమ్మారెడ్డి భరద్వాజ ని అడగగా అలాంటిదేమీ జరగదు,

అయినా పొలిటికల్ పార్టీలు గొడవ మనకు సంభందం లేదు.  ఈ పర్టిక్యులర్ కేసు మీద కాదు గతంలో చాలా మందిపై ఇలాంటి వివాదాలు ఉన్నాయి, కొన్ని బయిటకు వచ్చాయి, కొన్ని రాలేదు, ఇప్పుడు బయిటకు వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాం. అప్పుడు మీరు అంటున్న పార్టీ లేదు కదా  అన్నారు.  


Jani Master


 ఫిల్మ్ ఛాంబర్ తరుపున నిర్మాత  కేఎల్‌ దామోదర్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ– ‘‘ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి డ్యాన్సర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా ఉన్నాడు. ఈ వివాదం తేలేవరకూ అతన్ని డ్యాన్సర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని, అసోసియేషన్‌ కార్యక్రమాల్లో పాల్గొనకూడదని ఫెడరేషన్‌కు చెప్పాం΄అన్నారు. 

Jani Master


అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న విషయంపై ఇంటర్నల్‌ రిపోర్ట్‌ వచ్చాక నిర్ణ యిస్తాం. చాంబర్‌ కార్యాలయంలో ఓ కంప్లైట్‌ బాక్స్‌ ఉంది. ఎవరైనా ఫిర్యాదులు చేయవచ్చు. ఫోన్‌కాల్, మెయిల్, పోస్ట్‌ సౌకర్యాలు కూడా ఉన్నాయి. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. ఇది ఎప్పట్నుంచో ఉంది. అలాగే ఇండస్ట్రీలో ఉమెన్‌ సపోర్ట్‌ టీమ్‌ కూడా ఉంది. ఈ విషయం కొంతమందికి తెలియకపోవచ్చు. ప్రస్తుత వివాదం ముగిసిపోగానే ఈ టీమ్‌ గురించి అన్ని అసోసియేషన్‌లకు అవగాహన కల్పిస్తాం’’ అని అన్నారు.

Jani Master


 లైంగిక వేధింపుల పరిష్కార ప్యానెల్‌ చైర్‌పర్సన్‌ ఝాన్సీ మాట్లాడుతూ– ‘‘శ్రీరెడ్డి ఇష్యూ తర్వాత ఓ కమిటీని ఫామ్‌ చేశాం. ఇతర ఇండస్ట్రీస్‌లో జరగుతున్న సెక్సువల్‌ హెరాస్‌మెంట్‌ ఇక్కడ కూడా జరుగుతోంది. ఇండస్ట్రీకి చెందిన ఇద్దరు కొరియోగ్రాఫర్స్‌ మధ్య నెలకొన్న వివాదం ఇది. మేం ఇద్దరి స్టేట్‌మెంట్స్‌ను రికార్డ్‌ చేశాం. అయితే ఆమె స్టేట్‌మెంట్‌ రికార్డు చేసే సమయంలో తెలిసింది... కేసు చాలా సీరియస్‌ అని. 


లీగల్‌ సపోర్ట్‌ కూడా ఆ అమ్మాయికి అవసరం అని అర్థమైంది. మా పరిధిలో మేం చేయాల్సినది ఆమెకు చేశాం. బాధితురాలిగా చెప్పబడిన అమ్మాయి మైనర్‌గా ఉన్నప్పట్నుంచే ఇండస్ట్రీలో పని చేస్తోంది. అయితే మైనర్‌గా ఇండస్ట్రీలో ఆమెకు చోటు కల్పించిన విధానం  ప్రొటోకాల్‌ ప్రకారంగానే జరిగిందా? లేదా అనే విషయంపై కూడా ఎంక్వయిరీ జరుగుతోంది. మా ప్రస్తుత గైడ్‌లైన్స్‌ ప్రకారం 90 రోజుల్లో కేసును పరిష్కరించాలి. కానీ అంతకుముందే ముగించాలని మేం అనుకుంటున్నాం. 


ఎంక్వయిరీ తర్వాత మా రిపోర్ట్‌ చెబుతాం. ఎలాంటి చర్యలు తీసుకుంటామో చెబుతాం. ఇండస్ట్రీలోని వారంతా ఈ ఇష్యూపై బయటకు మాట్లడకపోయినా అంతర్గతంగా చర్చిస్తున్నారు. ఆమెకు సపోర్ట్‌గా ఉంటామని ఓ పెద్ద హీరో తన మేనేజర్‌తో చెప్పించారు. దర్శకులు– నిర్మాతలు స్పందిస్తున్నారు.

ఇండస్ట్రీలో టాలెంట్‌కు వర్క్‌ ఉంటుంది.  ఒకవేళ ఫేక్‌ కంప్లైట్స్‌ వస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలని కూడా ప్రత్యేక సెక్షన్‌ ఉంది. ఇండస్ట్రీలోని మహిళల రక్షణకు సంబంధించి ప్రభుత్వం తరఫు నుంచి సరైన గైడ్‌లైన్స్‌ లేవు. 
 


అలాగే ‘వాయిస్‌ ఆఫ్‌ ఉమెన్‌’ గురించి సమంతగారు సోషల్‌ మీడియాలో స్పందించారు. కానీ ‘వాయిస్‌ ఆఫ్‌ ఉమెన్‌’ అనేది ఇండస్ట్రీ నుంచి సెపరేట్‌ కాదు. దీనికి సంబంధించి ప్రభుత్వంతో చర్చలు జరుగుతూనే ఉన్నాయి. బయటకు రాలేదు అంతే. సరైన సమయంలో పెద్దలు మాట్లాడతారు. అలాగే ఈ కేసుకు సంబంధించి బాధితురాలి ఫేస్‌ను మీడియా బయటపెట్టకూడదని కోరుతున్నాం’’ అని పేర్కొన్నారు.

Latest Videos

click me!