ప్రభాస్ హర్రర్-కామెడీ రాజా సాబ్ విడుదల తేదీ ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది, అయితే అభిమానులు ఎదురుచూస్తున్నారు. చిత్రానికి అదనపు షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ మరియు CGI వర్క్ అవసరం.
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ది రాజాసాబ్ సినిమా రిలీజ్ పై క్లారిటీ నిర్మాతలు ఇవ్వలేదు. ఈ హారర్ రొమాంటిక్ కామెడీ చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
హారర్ కామెడీ కావటం, ఈ జానర్ లో ప్రభాస్ ఫస్ట్ టైమ్ చేస్తుండడం ఆసక్తిని నెక్ట్స్ లెవిల్ కు తీసుకెళ్లింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం షూట్ ఇంకా ఎంత పెండింగ్ ఉంది, ఎప్పుడు రిలీజ్ కావచ్చు అనే విషయాలు ట్రేడ్ లో హాట్ టాపిక్ గా మారాయి.
25
Actor Prabhas starrer film The Raja Saab
Actor Prabhas starrer film The Raja Saabs update out ఈ ఏడాది ఏప్రిల్ 10వ తేదీన రిలీజ్ కావాల్సిన రాజా సాబ్ చిత్రం వాయిదా పడింది. రీసెంట్ గా సంక్రాంతి సందర్భంగా రివీల్ చేసిన పోస్టర్లో విడుదల తేదీన మేకర్స్ వెయ్యిలేదు. దీంతో ఈ చిత్రం వాయిదా పడిందని ఫ్యాన్స్ కు క్లారిటీ వచ్చింది. అయితే, ఈ చిత్రాన్ని జూలై 18వ తేదీన రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు వినిపిస్తోంది. అయితే రిలీజ్ డేట్ గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
35
The Raja Saab Prabas film updates out
ప్రస్తుతం హీరో ప్రభాస్ లేని సీన్లు షూట్ చేస్తున్నారు. సినిమాకు బ్యాలెన్స్ వర్క్ కనీసం ఇరవై రోజులు ఉందని వినిపిస్తోంది. ఈ ఇరవై రోజుల్లో పది రోజులు హీరో లేనివి, పది రోజులు హీరో ఉన్నవి చేయాలట. అంతేకాక కాస్త ప్యాచ్ వర్క్ ఉంటుంది. ఇవన్నీ కాకుండా పాటలు షూట్ చేయాల్సి ఉంది. ఎంత స్పీడుగా చేసినా రెండు నెలలు పడుతుందని అంటున్నారు.
45
The Raja Saab Prabhas film update out
షూట్ పూర్తయ్యాక పోస్ట్ ప్రొడక్షన్, సీజీ పనులు ఉండనే ఉంటాయి. కాబట్టి దసరా బరిలోకి దిగే అవకాశం ఉందని ఓ టాక్ నడుస్తోంది . ఈ ఏడాదికి ప్రభాస్ సినిమా ఇది ఒక్కటే. మరో ప్రక్క హను రాఘవపూడి ఫౌజీ సినిమా షూట్ ఇంకా ఇప్పుడే ప్రారంభమైంది. అది రిలీజ్‌కు కనీసం ఏడాది పడుతుంది. బాగా పెద్ద కథ అది, డిఫరెంట్ లొకేషన్లలో షూట్ చేయాల్సి ఉంది.
55
Prabhas, The Raja Saab, maruthi
ది రాజాసాబ్ చిత్రంలో ప్రభాస్ డ్యుయల్ రోల్స్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే రెండు లుక్‍లను మూవీ టీమ్ రివీల్ చేసింది. మోషన్ పోస్టర్లో డార్లింగ్ లుక్ డిఫెరెంట్‍గా ఉంది. మరో లుక్ స్టైలిష్‍గా కనిపిస్తోంది. ఈ సినిమాను హారర్ కామెడీగా తెరకెక్కిస్తున్నారు మారుతీ. ఈ చిత్రంలో మాళవిక మోహన్, నిధి అగర్వాల్ ఫీమేల్ లీడ్స్ చేస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో మాస్ ఐటమ్ పాటకు ప్రభాస్ డ్యాన్స్ ఉంటుందని ఇటీవలే మరింత హైప్ పెంచేశారు థమన్.