అల్లు అర్జున్‌ అరెస్ట్‌పై మరోసారి సీఎం రేవంత్‌ రెడ్డి కామెంట్స్

Published : Jan 23, 2025, 08:29 AM IST

పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ ఘటనకు అల్లు అర్జున్ పరోక్షంగా బాధ్యుడని ఆయన వ్యాఖ్యానించారు. బాధిత కుటుంబాన్ని పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు.

PREV
15
  అల్లు అర్జున్‌ అరెస్ట్‌పై మరోసారి సీఎం రేవంత్‌ రెడ్డి కామెంట్స్
CM Revanth Reddy, allu arjun, arrest

‘పుష్ప2’ విడుదల సందర్భంగా సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన జరిగి నెల దాటినా ఇప్పటికీ మీడియాలో హాట్ టాపిక్ గానే ఉంది. ఆ సమయంలో అల్లు అర్జున్‌ (Allu Arjun) అరెస్టయి ఆ తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు. తొక్కిసలాట ఘటన, తదనంతర పరిణామాలు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. 

25


ఈ వ్యవహారంపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీ వేదికగానే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తాజాగా దావోస్‌ పర్యటనలో ఉన్న ఆయన ఆంగ్ల మీడియా ప్రతినిధి అడిగిన  ప్రశ్నకు రేవంత్‌ రెడ్డి మరోసారి స్పందించారు.తొక్కిసలాట ఘటనకు అల్లు అర్జున్‌ నేరుగా బాధ్యుడు కాదు కదా అని ప్రశ్నించగా సమాధానమిచ్చారు. 
 

35
Allu Arjun, #Pushpa2Reloaded, Pushpa2, sukumar


 
రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... ‘‘రెండు రోజుల ముందు అనుమతి కోసం వస్తే.. పోలీసులు నిరాకరించారు. అయినా థియేటర్‌ వద్దకు అల్లు అర్జున్‌ వచ్చారు. ఈ క్రమంలో భారీగా అభిమానులు తరలిరావడంతో ఆయనతో వచ్చిన సెక్యురిటీ సిబ్బంది అక్కడున్న వారిని తోసేశారు.

ఆ తొక్కిసలాటలో ఒకరు చనిపోయారు. ఒక మనిషి చనిపోవడమన్నది ఆయన చేతుల్లో లేకపోవచ్చు. అయితే ఆ  మహిళ చనిపోతే, 10-12 రోజులు బాధిత కుటుంబాన్ని పట్టించుకోలేదు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోయింది’’ అని అన్నారు.

45


సంఘటన వివరాల్లోకి వెళితే... డిసెంబరు 4వ తేదీన పుష్ప-2 బెనిఫిట్​ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్​ రోడ్​లోని సంధ్య థియేటర్​ వద్దకు రాత్రి సమయంలో హీరో అల్లు అర్జున్​ వచ్చారు. ఈ సందర్భంగా తమ అభిమాన హీరోను చూసేందుకు జనం ఎగబడ్డారు. ఈ క్రమంలో కాస్త తోపులాట జరిగింది. అభిమానులను నియంత్రించేందుకు పోలీసులు వారిని చెదరగొట్టారు. 
 

55
pushpa 2


దీంతో అక్కడ తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ తొక్కిసలాటలో తల్లి రేవతి, ఆమె కుమారుడు కిందపడిపోయారు. ఈ క్రమంలో వారిని పోలీసులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రేవతి మృతి చెందగా, కుమారుడు శ్రీతేజ్ ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ కేసులో ఇప్పటికే సుమారు 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories