ఎక్సపీరియన్స్ తో చెప్తున్నా :రాజమౌళితో చేయటంపై మహేష్ తో ఎన్టీఆర్ కామెడీ

First Published | Sep 19, 2024, 2:39 PM IST

రాజమౌళితో మహేష్ బాబు చేయబోయే సినిమా గురించిన ప్రసక్తి వచ్చింది. ఎన్టీఆర్ మామూలుగా ఉండదు రాజమౌళితో అన్నట్లు చెప్పుకొచ్చారు. 

NTR-Mahesh Babu


డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి- మహేష్ బాబు సినిమా గురించి అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. 'SSMB 29' వర్కింగ్ టైటిల్‌తో మొదలైన ఈ చిత్రం రాజమౌళి  కెరీర్ లోనే ప్రత్యేకంగా నిలిచేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి కూడా రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ రాశారు.

ఆస్కార్ విజేత ఎమ్ఎమ్ కీరవాణి సినిమాకి మ్యూజిక్ ఇస్తున్నారు. ఇక రాజమౌళితో సినిమా అంటేనే సంవత్సరాలు పాటు హార్డ్ వర్క్ ఉంటుంది. రాజమౌళితో సినిమా అంటే  పిప్పి తీస్తాడు అని చెప్పుకుంటారు. ఎన్టీఆర్ కూడా డైరక్ట్ గా మహేష్ తో అలాంటి మాటలే దాదాపు అన్నారు. స్వంత ఎక్సపీరియన్స్ తో చెప్తున్న మాటలు అన్నారు. ఎన్టీఆర్ ఏమన్నారో చూద్దాం. 



 యంగ్ టైగర్ ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో రూపొందించిన  ‘దేవర’. సినిమా మరి కొద్ది రోజుల్లో థియేటర్లలో సందడి చేయనుంది. హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా భారీ అంచనాల మధ్య నిర్మించిన ఈసినిమాలో బీటౌన్ బ్యూటీ జాన్వీ కపూర్  హీరోయిన్ గా నటించింది. ఆదిపురుష్ సినిమా తర్వాత దేవర చిత్రంలో మరోసారి విలన్ పాత్రలో కనిపించనున్నాడు బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్. ఇప్పటివరకు విడుదలైన టీజర్, ట్రైలర్ మూవీ పై ఎక్స్‏పెక్టేషన్స్ అమాంతం పెంచేశాయి. ముఖ్యంగా సముద్రంలో షార్క్‏పై ఎన్టీఆర్ సవారీ షాట్ అదిరిపోయిందంటున్నారు. దీంతో ఈ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు బిగ్ స్క్రీన్ పై చూసేద్ధామా అని ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

Junior NTR


సెప్టెంబర్ 27న విడుదల కానుంది. తెలుగుతోపాటు హిందీ, కన్నడ, మలయాళం, తమిళం భాషలలోనూ ఈ మూవీ రిలీజ్ కానున్న దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి ఓ క్రేజీ న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. అదేంటంటే.. దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్‏కు ముఖ్య అతిథిగా రావాలని మహేష్ బాబును డైరెక్టర్ కొరటాల శివ ఆహ్వానించారనే టాక్ వినిపిస్తుంది. ఈ విషయం గురించి ఇప్పటికే కొరటాల శివ, మహేష్ మధ్య చర్చలు కూడా జరిగాయని తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ దేవర ప్రీ రిలీజ్ వేడుకకు మహేష్ వస్తే మరింత హైప్ అయ్యే అవకాశం ఉంది. 


 ఈ నేపద్యంలో మహేష్, ఎన్టీఆర్ మధ్య గతంలో జరిగిన సంభాషణతో కూడిన ఓ వీడియో తిరిగి వైరల్ అవటం మొదలైంది. మీలో ఎవరు కోటీశ్వరుడు పోగ్రాం కు ఎన్టీఆర్ యాంకరింగ్ చేసినప్పుడు మహేష్ గెస్ట్ గా వచ్చారు. అప్పటి వీడియో ఇది. ఈ వీడియోలో రాజమౌళితో మహేష్ బాబు చేయబోయే సినిమా గురించిన ప్రసక్తి వచ్చింది. ఎన్టీఆర్ మామూలుగా ఉండదు రాజమౌళితో అన్నట్లు చెప్పుకొచ్చారు. 

బిగ్ బాస్ హౌజ్ నుంచి మూడో వారం ఎగ్జిట్ అయ్యేది ఎవరు?


జూనియర్ ఎన్టీఆర్‌తో తనకున్న అనుబంధం దృష్ట్యా ఈ షోకు వచ్చాడు మహేష్ బాబు. ఈ ఎపిసోడ్‌లో చాలా విషయాల గురించి చర్చించుకున్నారు మహేష్, తారక్  అలాగే తమ వ్యక్తిగత జీవితం గురించి చెప్పారు.  ఆ తర్వాత సూపర్ స్టార్‌ను గేమ్స్ గురించి ప్రశ్నించాడు

జూనియర్. మీరు ఏయే ఆటలు బాగా ఆడతారంటూ అడిగాడు. దానికంటే ముందు రాజమౌళి టాపిక్ కూడా వచ్చింది. ఈయన దర్శకత్వంలో నాలుగు సినిమాలు చేసాడు జూనియర్ ఎన్టీఆర్. స్టూడెంట్ నెం 1, సింహాద్రి, యమదొంగ తర్వాత  ట్రిపుల్ ఆర్‌లో నటించాడు. ఈ  నేపధ్యంలో తనకు రాజమౌళితో ఉన్న ఎక్సపీరియన్స్ తో ఓ మాట అన్నారు. 
 


రాజమౌళి దర్శకత్వంలో నటించడం అంటే సులువు కాదని చెప్పాడు జూనియర్. ఈ  షోలో రాజమౌళి గురించి చెబుతూ మహేష్ బాబును భయపెట్టే ప్రయత్నం చేశాడు జూనియర్ ఎన్టీఆర్. మీరు ఆటలు ఆడతారా అంటూ మహేష్ బాబును ప్రశ్నించాడు తారక్.

ఒకప్పుడు  క్రికెట్ ఆడేవాడినని కానీ.. ఇప్పుడు ఆడటం లేదని చెప్పాడు మహేష్ బాబు.   ఆ తర్వాత రబ్బర్ బాల్, టెన్నిస్ బాల్‌తో ఆడతానని క్రికెట్ బాల్ అంటే కష్టమని మహేష్ ఆట పట్టించాడు. అయితే అక్కడే తారక్ అసలు సెటైర్లు వేసాడు. రాజమౌళితో సినిమా చేయబోతున్నారుగా.. అన్ని ఆటలు ఆడిస్తాడులే మీతో అంటూ పంచ్ లు వేసాడు.

Latest Videos

click me!