Vijay Deverakonda: విజయ దేవరకొండ కోసం ఎన్టీఆర్, రణబీర్, సూర్య

Published : Feb 09, 2025, 09:43 AM IST

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ నటిస్తున్న VD12 సినిమా టైటిల్ మరియు టీజర్ ఈ నెల 12న విడుదల కానుంది. ఈ టీజర్ కు  హీరో  సూర్య, ఎన్టీఆర్, రణబీర్ కపూర్ సహకరించనున్నారు. 

PREV
13
Vijay Deverakonda: విజయ దేవరకొండ కోసం ఎన్టీఆర్, రణబీర్, సూర్య
NTR, Ranbir Kapoor,Suriya for Vijay Deverakonda VD12 in telugu


విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda) కొత్త చిత్రం కోసం ప్రేక్షకులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా ఎలా ఉండబోతోంది, దాని టైటిల్ ఏమిటి?  స్టోరీ వరల్డ్  ఎలా ఉంటుందంటూ సోషల్ మీడియాలో రచ్చ జరుగుతోంది. మరికొంతమంది చిత్ర టీమ్ ని ట్యాగ్ చేస్తూ ప్రశ్నిస్తున్నారు.

అతి త్వరలోనే ఆ ప్రశ్నలకి జవాబు దొరకనుంది. ఈ నెల 12న  టైటిల్ ని ప్రకటించడంతోపాటు, టీజర్‌ని విడుదల చేయనున్నారు. అలాగే ఈ టీజర్ కు తమిళం నుంచి ఎస్ జే సూర్య, తెలుగు నుంచి ఎన్టీఆర్, హిందీ నుంచి రణబీర్ కపూర్ సహకరించనున్నారు. ఇంతకీ ఈ టీజర్ ని లాంచ్ చేస్తారా అంటే అదేమీ కాదు వాయిస్ ఓవర్ ఇవ్వనున్నట్లు సమాచారం.

23


 ఈ సినిమా టీజర్‌ విడుదల వివరాల్ని రీసెంట్ గా  ప్రకటించారు. నిశ్శబ్ద కిరీటం రాజు కోసం వేచి చూస్తోంది... అనే వాక్యాలతో కిరీటంతో కూడిన  ఓ పోస్టర్‌ని విడుదల చేసింది. పేరు, టీజర్‌ అందరం గర్వపడేలా ఉంటుందంటూ విజయ్‌ దేవరకొండ ఎక్స్‌లో పోస్ట్‌ని పంచుకున్నారు. పీరియాడిక్‌ కథతో రూపొందుతున్న చిత్రమిది. అనిరుధ్‌ రవిచందర్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం (VD12). విజయ్‌ దేవరకొండ సరసన భాగ్య శ్రీ బోర్సే నటిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.

33


'VD 12' సినిమాకు సామ్రాజ్యం అనే టైటిల్‌ను ఖరారు చేయబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. అటు కింగ్ డమ్ అనే పేరును కూడా పరిశీలిస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది. అయితే, విజయ్ అభిమానులు టైటిల్ రిలీజ్ చేయాలంటూ నిర్మాత నాగవంశీని సోషల్ మీడియా వేదికగా పలుమార్లు రిక్వెస్ట్ చేశారు.

ఈ క్రమంలోనే టైటిల్ ఇదేనంటూ రూమర్స్ వస్తున్నాయి. అయితే, ఇదంతా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మాత్రమేనని.. టైటిల్ గురించి అతి త్వరలో అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది. కాగా, ప్రస్తుతం ముగింపు దశలో ఉన్న ఈ సినిమా మే నెలాఖరున ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుస్తోంది.
 

Read more Photos on
click me!

Recommended Stories