Janhvi Kapoor: శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్‌లో నటించనుంది. ఈ వెబ్ సిరీస్ పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనుంది మరియు మహిళా ప్రాధాన్య కథాంశంతో ఉంటుంది.
అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా పరిశ్రమలోకి అడుగుపెట్టిన జాన్వీ కపూర్ ప్రస్థానం బాగానే సాగుతోంది. మొదటి సినిమా ధడ్కన్ సూపర్ హిట్‌గా నిలిచి 100 కోట్లు వసూళ్లను తీసుకువచ్చింది.
రీసెంట్ గా తెలుగు లో దేవరతో పరిచయమైన శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ సౌత్ లో తనకు వస్తున్న ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటోంది. తెలుగు,తమిళ భాషల్లో ఇప్పుడు ఆమె వరస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. తాజా వార్త ఏమిటంటే జాన్వీ కపూర్ నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్‌లో కనిపించటానికి సిద్దపడుతోంది.
23
Janhvi Kapoor Netflix web series details
ప్రస్తుతం, జాహ్నవి రామ్ చరణ్ తో కలిసి బుచ్చి బాబు సినిమా చేస్తోంది. ఈ నటికి తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది , అలాగే శ్రీదేవి కుమార్తె గా తమిళంలోనూ క్రేజ్ ఉంది. ఈ క్రమంలో ఆమె నెట్‌ఫ్లిక్స్ కోసం హీరోయిన్ ఓరియెంటెడ్ పాన్ ఇండియా వెబ్ సిరీస్‌పై సంతకం చేసింది. ఇది మహిళలను కేంద్రంగా నడిచే కథ అని చెప్తున్నారు.
దీనిని ఒక తమిళ దర్శకుడు దర్శకత్వం వహిస్తున్నారు. ఆ తమిళ దర్శకుడు పేరు Sarkunam. పా రంజిత్ కు చెందిన నీలం ప్రొడక్షన్స్ లో ఈ వెబ్ సీరిస్ రూపొందనుంది. షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది.
33
Janhvi Kapoor Netflix web series details
మరో ప్రక్క ఘోస్ట్ స్టోరీస్ అంటూ భయపెట్టేందుకు వస్తోన్నట్టు జాన్వీ కపూర్ తెలిపింది. కొత్త ఏడాది ప్రారంభంలో వెన్నులో వణుకు పుట్టించేందుకు వస్తోన్నట్లు ప్రకటించింది.
లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్‌లానే.. నాలుగు విభిన్న కథలతో ఈ చిత్రం తెరకెక్కినట్టు తెలుస్తోంది. తానెంతగానో అభిమానించే జోయా అక్తర్ డైరెక్టర్ కావడం వల్లే ఈ వెబ్ సిరీస్‌కు ఒప్పుకున్నానని సోషల్ మీడియాలో జాన్వీ స్వయంగా వెల్లడించింది. ఒక్కపక్క సినిమాల్లో హీరోయిన్‌గా చేస్తూనే మరో పక్క ఈ వెబ్ సరిస్‌లో నటిస్తానంటోంది ఈ యంగ్ బ్యూటీ.