Chhaava: విక్కీ కౌశల్ 'ఛావా' OTT రిలీజ్, తెలుగులో ఎప్పుడు?

Published : Feb 18, 2025, 08:27 AM IST

విక్కీ కౌశల్ మరియు రష్మిక నటించిన 'ఛావా' సినిమా త్వరలోనే తెలుగులో OTT వేదికగా విడుదల కానుంది. నెట్‌ఫ్లిక్స్ ఈ చిత్రం యొక్క డిజిటల్ హక్కులను దక్కించుకుంది. 

PREV
13
Chhaava: విక్కీ కౌశల్ 'ఛావా' OTT రిలీజ్,  తెలుగులో ఎప్పుడు?
Vicky Kaushal Chhaava OTT partner and release details in telugu


 Chhaava: ఇప్పుడు ఎక్కడ విన్నా  ‘ఛావా’ సినిమా విశేషాలే.  నటుడు విక్కీ కౌశల్‌ (Vicky Kaushal), రష్మిక కాంబినేషన్ లో రూపొందిన ఈ చిత్ర ఘన విజయం సాధించింది.  మరాఠా రాజు ఛత్రపతి శంభాజీ మహారాజ్‌ జీవిత కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన  ఈ సినిమా కేవలం హిందీలోనే రిలీజైంది. అయితే తెలుగు వారినీ త్వరలోనే పలకరించనుందని తెలుస్తోంది.

అయితే థియేటర్ వెర్షన్ కాదు. ఓటిటిలో  సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ డబ్బింగ్ చేసి రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తోంది. అయితే ఇక్కడ బిజినెస్ బాగా నడుస్తుందనుకుంటే తెలుగు డబ్బింగ్ వెర్షన్ ని సైతం రిలీజ్ చేసే ఆలోచనలో టీమ్  ఉన్నట్లు ట్రేడ్ అంటోంది. అది ఎలా ఓటిటిలో తెలుగు వెర్షన్ వస్తుంది కాబట్టి...ఓటిటి రిలీజ్ డేట్ ఎప్పుడో చూద్దాం.

23
Vicky Kaushal Chhaava OTT partner and release details in telugu

 ‘ఛావా’ సినిమాకు ఉన్న డిమాండ్‌ దృష్టిలో పెట్టుకొని డిజిటల్‌ రైట్స్‌ని భారీ ధరకే అమ్ముడయ్యాయి.  ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ ఈ రైట్స్ ని కొనుగోలు చేసింది. యావరేజ్‌ టాక్‌ వస్తే నెల రోజుల్లో ఓటీటీలో రిలీజ్‌ చేయాలని ఎగ్రిమెంట్ చేసుకున్నారట. కానీ ఊహించని విధంగా భారీ హిట్‌ టాక్‌ రావడంతో ఓటీటీ రిలీజ్‌ని పోస్ట్‌పోన్‌ చేసినట్లు తెలుస్తోంది.  

ఎనిమిది వారాల తర్వాత ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అయ్యే అవకాశం ఉందని బాలీవుడ్‌ మీడియా పేర్కొంది. అంటే ఏప్రిల్‌ మూడో వారంలో ఈ సినిమా ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ సినిమాని ఈ లోగా సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ లలోకి డబ్బింగ్ చేసి విడుదల చేయబోతున్నారట. 
 

33
Vicky Kaushal Chhaava OTT partner and release details in telugu

ఛావా కథేంటి


 ఛత్రపతి శివాజీ మరణం తర్వాత కథ మొదలవుతుది. ఆయన మరణంతో  మరాఠా సామ్రాజ్యం బలహీనపడిందని, ఇక ఆ ప్రాంతాన్ని దక్కించుకోవడం.. పాలించడం సులభమవుతుందని మొగల్‌ చక్రవర్తి ఔరంగజేబు (అక్షయ్‌ ఖన్నా) భావిస్తాడు. అయితే, వారి ఆలోచనలకు అడ్డంగా మారతాడు ఛత్రపతి శంభాజీ మహారాజ్‌ (విక్కీ కౌశల్‌). ప్రజల నుంచి దిల్లీ చక్రవర్తులు దోచుకుని దాచిన కోశాగారంపై దాడి చేస్తాడు. ఈ విషయం ఔరంగజేబుకు చేరుతుంది.

దక్కన్‌లో బలం పుంజుకుంటున్న శంభాజీని కట్టడి చేసేందుకు తానే స్వయంగా సైన్యంతో రంగంలోకి దిగుతాడు. శక్తిమంతమైన మొగల్‌ సేనను శంభాజీ ఎలా ఎదుర్కొన్నాడు? ఈ క్రమంలో అతడికి ఎదురైన పరిస్థితులు ఏంటి? శత్రుసైన్యంతో చేతులు కలిపి స్వామి ద్రోహం చేసిందెవరు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Read more Photos on
click me!

Recommended Stories