వరలక్ష్మికి లైంగిక వేధింపులు: షాకింగ్ విషయాలు!
నటి వరలక్ష్మి శరత్ కుమార్ తనకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి డ్యాన్స్ షోలో వెల్లడించింది. చిన్నతనంలో బంధువులే తనను వేధించారని, తల్లిదండ్రులు పిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ నేర్పించాలని ఆమె కోరింది.
నటి వరలక్ష్మి శరత్ కుమార్ తనకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి డ్యాన్స్ షోలో వెల్లడించింది. చిన్నతనంలో బంధువులే తనను వేధించారని, తల్లిదండ్రులు పిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ నేర్పించాలని ఆమె కోరింది.
లైంగిక వేధింపులు విషయమై మీటూ వచ్చిన నాటి నుంచి ధైర్యంగా నటీమణులు తమకు ఎదరైన చేదు అనుభవాలను ఎన్నోసార్లు బయటపెడుతూ వస్తున్నారు. కాస్టింగ్ కౌచ్ పేరుతో వేధింపులకు గురయ్యామంటూ వారు చెప్పుకుని ఎమోషనల్ అయిపోయేవారు. తాజాగా వరలక్ష్మీ శరత్ కుమార్ కూడా తనకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకుంది.
సీనియర్ నటుడు శరత్‌కుమార్ కూతురైన వరలక్ష్మి ఓపక్క వెండితెరపై బిజీగా ఉంటూనే మరోపక్క బుల్లితెరపైనా సందడి చేస్తోంది. ఆ క్రమంలో డ్యాన్స్ జోడీ డ్యాన్స్ రీలోడెడ్ 3 (తమిళ) షోలో జడ్జిగా వ్యవహరిస్తోంది. తాజాగా ఈ షో నుంచి ఓ ప్రోమో రిలీజైంది.
అందులో ఓ కంటెస్టెంట్ అద్దం ముందు నిలబడి తనకు ఎదురైన చేదు అనుభవాన్ని బయటపెట్టింది. మన జీవితంలో టర్నింగ్ పాయింట్ వచ్చినప్పుడు కుటుంబమే మద్దతుగా నిలబడుతుందంటారు. కానీ నా జీవితంలో మాత్రం కుటుంబం, బంధువులెవరూ నాకు సాయంగా నిలబడలేదు. పైగా నన్ను తిడుతూ వేధించారు, టార్చర్ పెట్టారు అంటూ ఏడ్చేసింది.
అది విన్న వరలక్ష్మి.. నీ బాధ నేను అర్థం చేసుకోగలను. మా అమ్మానాన్న పనిలో బిజీగా ఉండటం వల్ల చిన్నప్పుడు నన్ను ఇంటి దగ్గరే వదిలేసి వెళ్లిపోయేవారు. నన్ను చూసుకోమని బంధువులకు అప్పజెప్పేవారు. అలా ఓసారి నా ఇంట్లోనే ఐదారుగురు మంది నాపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. అసభ్యంగా తాకారు.
నీదీ నాదీ ఒకే కథ.. అంటూ కంటెస్టెంట్‌ను పట్టుకుని ఒక్కసారిగా ఏడ్చేసింది. దయచేసి తల్లిదండ్రులు పిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ నేర్పించాలని వరలక్ష్మి కోరింది.. అలాగే నేను ఎప్పుడూ భయపడలేదు. ధైర్యంగా ముందుకు వెళ్లాను. మన హార్డ్ వర్క్ మనల్ని పైకి తీసుకొస్తుంది’ అంటూ చెప్పుకొచ్చింది.
ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అంత పెద్ద హీరో కూతురుకు కూడా వేధింపులు తప్పలేవా అంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.