RRR హీరో ఎన్టీఆరే: తేల్చేసిన గ్రోక్ AI!
NTR: RRR సినిమాలో మెయిన్ హీరో ఎవరనే చర్చకు గ్రోక్ AI సమాధానమిచ్చింది. ఎన్టీఆరే మెయిన్ హీరో అని, రామ్ చరణ్ కీ రోల్ పోషించారని తెలిపింది.
NTR: RRR సినిమాలో మెయిన్ హీరో ఎవరనే చర్చకు గ్రోక్ AI సమాధానమిచ్చింది. ఎన్టీఆరే మెయిన్ హీరో అని, రామ్ చరణ్ కీ రోల్ పోషించారని తెలిపింది.
NTR: చాలా కాలం నుంచి ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానుల మధ్య ఓ పెద్ద డిబేట్ జరుగుతోంది. అదేమిటంటే..RRR లో ఎవరు మెయిన్ హీరో, ఎవరిని ఉద్దేశించి ఆ టైటిల్ పెట్టారు అనేది.
రామ్ చరణ్ సపోర్టర్స్ అంతా చరణ్ పాత్ర హైలెట్ అని, అందుకే ఆ టైటిల్ రామ్ చరణ్ కు చెందింది అంటున్నారు. అదే సమయంలో ఎన్టీఆర్ అభిమానులు అదేం లేదు తమ హీరోని ఉద్దేశించే ఈ టైటిల్ పెట్టారంటున్నారు. ఇది సోషల్ మీడియాలో రెగ్యులర్ గా జరిగే ఫ్యాన్ వార్. అయితే ఈ విషయమై గ్రోక్ (Grok) చాట్‌బాట్ సమాధానం ఇచ్చింది. ఎన్టీఆర్ ఈ సినిమాకు మెయిన్ హీరో అంది.
గ్రోక్ రిప్లై ఏమిటంటే.. " RRR లో కొమరం భీమ్ (ఎన్టీఆర్) మెయిన్ హీరో గా కనిపిస్తున్నారు. మల్లిని రక్షించటమే మిషన్ ని అతను విజయవంతంగా పూర్తి చేసాడు. అదే సమయంలో అల్లూరి సీతారామరాజు (రామ్ చరణ్) కీ కో లీడ్ గా కనిపిస్తారు.
ఇద్దరు కలిసి బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పొరాడినా , కొమురం భీమ్ లక్ష్యం మాత్రం మల్లిని ఆమె గూడెంకు చేర్చటమే. దానికి అల్లూరి లేయర్ డెప్త్ తీసుకొచ్చింది. దాదాపుగా ఇద్దరివీ సమానమైన పాత్రలే అయినా, భీమ్ పాత్ర ఆర్క్ ప్రధానంగా కథ నడిచింది.
రాజమౌళి ఇద్దరినీ బ్యాలెన్స్ చేసారు, ఒక పాత్రే గొప్పదని,మరొకరు సైడ్ క్యారక్టర్ అని లేబుల్ వెయ్యటం కష్టం. రాజు పాత్ర లో ఉన్న అంతర్గత సంఘర్షణ సినిమాకు ప్రత్యేక తీసుకొచ్చింది. ఇది ఇద్దరి హీరోల నేరేషన్ లో చెప్పిన సినిమా " అని తేల్చింది. అయితే ఇంత చెప్పినా ఎన్టీఆర్ మెయిన్ హీరో అనటం అభిమానులకు ఆనందం కలిగిస్తోంది.
ఇక మస్క్ నేతృత్వంలోని కృత్రిమ మేధ (AI) సంస్థ ‘ఎక్స్‌ఏఐ’ సిద్ధం చేసిన గ్రోక్ (Grok) చాట్‌బాట్ సేవలు ఇప్పటికే బాగా ప్రాచుర్యం పొందుతున్న సంగతి తెలిసిందే. చాట్‌జీపీటీకి పోటీగా వచ్చిన ఇది మెరుగైన సేవల్ని అందిస్తోంది.
సోషల్ మీడియా యాప్స్ ‘ఎక్స్’ (ఒకప్పుడు ట్విట్టర్) లో లేటెస్ట్ గా వచ్చిన గ్రోక్(GROK) ఏఐ ఫీచర్ తెలుగు యూత్ తో ఓ రేంజ్ లో ఆడుకుంటుంది అని చెప్పాలి. ఆంగ్లంలో అడిగితే ఆంగ్లంలో తెలుగులో అడిగితే తెలుగులో కొట్టినట్టుగా సమాధానం అందిస్తుంది.
దాంతో మనవాళ్లు రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు. ముఖ్యంగా సినిమాలకు సంభందించినవి ఎక్కువ అడుగుతున్నారు. ఏదైమైనా తెలుగు సినిమాని అభిమానించే యూత్ లో ఈ కొత్త ఏఐ మాత్రం ఒక్కసారిగా వైరల్ గా మారిపోయింది. హీరోల విషయంలో ఇచ్చిన రిప్లై లు చూసి సదరు హీరోల అభిమానులే షాకవుతున్నారు.