ఇక ఈమూవీ కథ విషయానికి వస్తే.. హీరో బాలు( వైష్ణవ్ తేజ్.. ) హీరోయిన్ చిత్ర (శ్రీ లీల) ఓ మల్టీ నేషనల్ కంపెనీకి సీఈవో.. బాలు ఆ ఆఫీసుకు ఇంటర్వ్యూకి వెళతాడు. ఇంటర్య్యూలో సెలెక్ట్ అవుతాడు. అయితే ఈ ఇంటర్వ్యూ చేసే క్రమంలో బాలు వ్యక్తిత్వం చిత్రకు నచ్చుతుంది. ఇద్దరూ కాల క్రమంలో ప్రేమలో పడతారు. ఆ విషయం తెలియడంతో చిత్ర తల్లీ తండ్రులు వీరిని ఎలాగైనా వేరు చేయాలనుకుంటారు.. వెంటనే చిత్రకు మరొకరిని ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంటున్నట్లు.. ఆమె బర్త్ డే పార్టీలో అందరి ముందు అనౌన్స్ చేస్తాడు తండ్రి.
అంతే కాదు.. ప్రేమ విషయంలో బాలుకు వార్నింగ్ ఇవ్వాలని చూస్తారు.. సరిగ్గా అదే టైమ్ లో..రాయలసీమ నుంచి ఎమ్మెల్యే మహాకాలేశ్శర్ రెడ్డి(సుమన్) అన్నయ్య(తనికెళ్ళ భరణి) వస్తారు. ఊహించని ట్విస్ట్ తో అంతా అయోమయంలో పడతారు. అప్పటి వరకూ ఉద్యోగం చేసుకుంటూ ఉన్న సాధారణ కుర్రాడు బాలుకి రాయలసీమకు సబంధం ఏంటీ..? బాలు అసలు పేరుఏంటి..? బ్యాక్ గ్రౌండ్ లో ఏం జరిగింది. ట్విస్ట్ మీద ట్విస్ట్ లు ఇచ్చిన ఈ కథలో క్లైమాక్స్ సంగతేంటి.. సినిమా చూసి తెలుసుకోవల్సిందే..?
ఇక సినిమా గురించి చూస్తే.. ఈమూవీ గురించి ఆడియన్స్ ముందు నుంచే ఓ అంచనాకు వచ్చారు..ఆ ఆ అంచనాలను నిజం చేసింది ఆదికేశవ మూవీ అని చెప్పవచ్చు. సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి .. అయిపోయే వరకూ... సినిమా చూసినట్టే ఉంటుంది.. ఎందుకంటే ఇటువంటి కథలు, కథనాలు తెలుగు ఆడియన్స్ కు కొత్తేమి కాదు. మాటలు, దర్శకత్వంలో కొత్తదనం లేదు. కాకపోతే దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి తన రైటింగ్ స్టైల్ తో ఆకట్టుకునే ప్రయత్నం మాత్రం చేశాడు. రచనలో కొన్ని చమక్కులు ఉన్నాయి. ముఖ్యంగా కామెడీలో స్పెషల్ మార్క్ ఉంది. దాంతో ఫాస్ట్ హాఫ్ అంతా కాస్త నవ్వులు పూశాయి. ఇక సెకండ్ హాఫ్ స్టోరీ సీమకు షిఫ్ట్ అవ్వడంతో.. రొటీన్ గా మారింది. దాంతో కాస్త బోరింగ్ మూమెంట్స్ వచ్చి చేరాయి.
#Aadikeshava
నటీనటుల విషయం చూస్తే.. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోమెటీరియల్ అని ఇంతకు ముందే నిరూపించుకున్నాడు. ఇక ఈసినిమాతో మాస్ హీరో అనిపించుకోవాలి అని ఆరాటం కనిపించింది. ఈ కథలకు అవసరమైన కటౌట్, క్వాలిటీస్ ఉన్నాయని చెప్పే ప్రయత్నం చేసినా .. ఇంకా ఇటువంటి సినిమాలు చేసేంత ఇమేన్ ను ఇంకా వైష్ణవ్ తేజ్ చిన్నగా బిల్డ్ చేసుకోవాల్సి ఉంది. ఇక శ్రీలీల ఎప్పటిలాగానే తన పని తాను చేసుకుంటూ పోయింది. సినిమాకు కావల్సిన గ్లామర్, క్యూట్ లుక్స్, సాంగ్స్, లవ్ స్టోరీ.. శ్రీలీల వరకూ ఆమె పాత్రకున్యాయం చేసింది. ఇతర పాత్రలు కూడా వారి పరిధి మేరకు నటించారు.
కాని ఇక్కడ చెప్పుకోవల్సిన విషయం ఏంటంటే.. మాస్ ఇమేజ్ కోసం వైష్ణవ్ ఈసినిమా చేశాడు అని ఫస్ట్ అనుకుంటున్న విషయం. కాని ఈ విషయాన్ని వైష్ణవ్ ఒప్పుకోలేదు. కాని యాక్షన్ సన్నివేశాలు మాత్రం ఈసినిమాలో బోయపాటి సినిమాలను గుర్తు చేశాయి. మరీ ముఖ్యంగా క్లైమాక్స్ ఫైట్‌లో మాస్ హీరోయిజం కాస్త ఎక్కువగా ఎలివేట్ చేసే ప్రయత్నం చేశారు. కాని అది అతిగా అనిపించింది.
ఇక ఈసినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పర్వాలేదు అనిపించాయి. . పాటల్లో స్టెప్పులు మాస్ జనాలు ఎంజాయ్ చేసే విధంగా ఉన్నాయి. కెమెరా వర్క్ నీట్ గా ఉంది. ఇక సినిమా అంతా కమర్షియల్ ఫ్లేవర్ కనిపించింది. ప్రొడక్షన్ వాల్యూస్ అద్భుతంగా ఉన్నాయి. నిర్మాతలు ఖర్చుకు వెనుకాడలేదని అర్థం అవుతోంది.
ఫైనల్ గా ఈమూవీ గురించి చెప్పాలంటే.. వైష్ణవ్ తేజ్ అనుకున్నట్టుగానే చేసిన ఊర మాస్ యాక్షన్ ఫిల్మ్ 'ఆదికేశవ'. మెగా మేనల్లుడి మాస్ అవతారం కొంత మందికి నచ్చవచ్చు.. మరికొందరికి నచ్చకపోవచ్చు. కాని కామెడి మాత్రం నవ్విస్తుంది. ఇక ఈ సీమ యాక్షన్ సినిమాలను ఇష్టపడే వారికి మాత్రం ఇది నచ్చుతుంది. ఒక సారి చూడదగ్గ సినిమా ఆదికేశవ. మెగా ఫ్యాన్స్ కు నచ్చుతుంది. కామన్ ఆడియన్స్ ఎలా ఆదరిస్తారు అనేది చూడాలి.