అమెరికాలో పుట్టి పెరిగిన అను ఇమ్మాన్యుయేల్ (Anu Emmanuel) నేరుగా తెలుగు చిత్రాలతోనే హీరోయిన్ గా మారింది. నేచురల్ స్టార్ నాని సరసన ‘మజ్ను’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన విషయం తెలిసిందే. తొలిచిత్రంతోనే ఆడియెన్స్ ను ఫిదా చేసింది.
ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో Agnyaathavaasi, బన్నీతో ‘నాపేరు పూర్య నా ఇల్లు ఇండియా’ చిత్రాలతో అలరించింది. చివరిగా ‘ఊర్వశీవో రాక్షసివో’, ‘రావణసుర’తో ఆకట్టుకుంది. కానీ ఈ సినిమాలు పెద్దగా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి.
ప్రస్తుతం మాత్రం ఈ ముద్దుగుమ్మ ‘జపాన్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తమిళ స్టార్ కార్తీ ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రం నవంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మూవీ ప్రమోషన్స్ ను యూనిట్ జోరుగా నిర్వహిస్తోంది.
ఇప్పటికే ట్రైలర్ లాంచ్ ఈవెంట్, తదితర కార్యక్రమాలను నిర్వహిస్తూ సినిమాను బాగా ప్రమోట్ చేస్తున్నారు. మరోవైపు హీరోయిన్ గా అను ఇమ్మాన్యుయేల్ కూడా తన సినిమాను ప్రమోట్ చేసుకునేందుకు వరుసగా ఫొటోషూట్లు చేస్తూ వస్తోంది.
ఈ సందర్భంగా తాజాగా చీరకట్టులో మెరిసింది. రెడ్ బార్డర్ గల పింక్ శారీలో బ్యూటీఫుల్ లుక్ ను సొంతం చేసుకుంది. స్లీవ్ లెస్ బ్లౌజ్ లో గ్లామర్ మెరుపులతో మైమరిపించింది. తన క్యూట్ ఫోజులతో కట్టిపడేసింది. అను చీరకట్టు సొగసుకు అభిమానులు ఫిదా అవుతున్నారు.
వరుసగా చీరకట్టులో ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. బ్యూటీఫుల్ ఫొటోలను పంచుకుంటూ తనవైపు తిప్పుకుంటోంది. మరింత క్రేజ్ దక్కించుకునేందుకు ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ‘జపాన్’పైనే ఆశలు పెట్టుకుంది.