యంగ్ బ్యూటీ సిరి హన్మంతు (Siri Hanumanth) సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా కనిపిస్తుంటారు. తన గురించి లేటెస్ట్ అప్డేట్స్ ను అందిస్తూ అభిమానులు, నెటిజన్లను మరింతగా ఆకట్టుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలో క్రేజీ పోస్టులు పెడుతుంటుంది.
బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోతో ఈ ముద్దుగుమ్మ మరింత క్రేజ్ దక్కించుకుంది. సీజన్ 5లో హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. 4th రన్నరప్ గా నిలిచింది. తన ఆటతో మరింత ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. బిగ్ బాస్ తర్వాత సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకుంటోంది.
షారుఖ్ ‘జవాన్’లోనూ మెరిసింది. ప్రస్తుతం ‘జబర్దస్త్’ యాంకర్ గా అవకాశం అందుకుంది. ఈ సందర్బంగా అదిరిపోయే అవుట్ ఫిట్లలో ఫొటోషూట్లు చేస్తోంది. తాజాగా లేటెస్ట్ ఫ్యాషన్ వేర్ లో మెరిసింది. మత్తెక్కించే ఫోజులతో మతులు పోగొట్టింది. ‘జబర్దస్త్’ కోసమే ఈ అవుట్ ఫిట్ అని చెప్పుకొచ్చింది.
వచ్చిన అవకాశాన్ని వినియోగించుకునేందుకు సిరి ప్రయత్నిస్తోంది. బుల్లితెరపైనా తనదైన యాంకరింగ్ తో ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో అదిరిపోయే అవుట్ ఫిట్లలో గ్లామర్ విందు కూడా చేస్తోంది. వరుస ఫొటోషూట్లతో మైమరిపిస్తోంది.
ఈ ముద్దుగుమ్మ న్యూస్ రీడర్ గా కెరీర్ ను ప్రారంభించింది. వై టీవీ, 99 టీవీ, టీ న్యూస్ వంటి ఛానెళ్లలో చాలా కాలం విధులు నిర్వహించింది. అక్కడి నుంచి సీరియల్స్ లో అవకాశాల కోసం ప్రయత్నించింది. ‘ఉయ్యాల జంపాల’ సీరియల్ లో తొలిసారిగా నటించింది.
అలా బుల్లితెరకు పరిచయం అయిన ఈ బ్యూటీ తన నటనతో ఆకట్టుకుంది. ఫలితంగా ‘ఎవరే నువ్వు మోహిని’, అగ్నిసాక్షి, సావిత్రమ్మ గారి అబ్బాయి వంటి సీరియల్స్ తో అలరించింది. అలాగే ఇద్దరి లోకం ఒకటే, ఓరేయ్ బుజ్జిగా వంటి సినిమాల్లోనూ నటించి మెప్పించింది. తర్వాత బిగ్ బాస్ లో ఛాన్స్ దక్కించుకున్న విషయం తెలిసిందే.