తమన్నా నుంచి అనుష్క వరకు.. వీళ్ళ ఓవర్ యాక్షన్ భరించడం కష్టం

First Published Apr 6, 2020, 11:54 AM IST

హీరోల తర్వాత ప్రేక్షకులు ఫోకస్ పెట్టేది హీరోయిన్ నటనపైనే. అలాంటి హీరోయిన్ల పాత్రలు వెండితెరపై బాగా పండాలి. లేకుంటే తేడా కొడుతుంది. కింద పేర్కొన్న కొన్ని చిత్రాల్లో హీరోయిన్ల నటన ఓవర్ యాక్షన్ అనిపించక మానదు. 

జెనీలియా: జెనీలియా రామ్ చరణ్ కు జోడిగా ఆరెంజ్ చిత్రంలో నటించించింది. ఆరెంజ్ మూవీకి మైనస్ గా మారిన అంశాలలో జెనీలియా పాత్ర ఒకటి. జెనీలియా రోల్ ని దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ సరిగా తీర్చి దిద్దలేదు. సినిమా మొత్తం జెనీలియా నటన ఓవరాక్షన్ అనిపిస్తుంది.
undefined
అనిత: యంగ్ హీరోయిన్ అనిత నటించిన తెలుగు మూవీ మరో చరిత్ర. వరుణ్ సందేశ్ హీరో. ఈ చిత్రంలో అనిత పాత్ర ప్రేక్షకులకు విసుగు తెప్పించే విధంగా ఉంటుంది.
undefined
రక్షిత : హీరోయిన్ రక్షిత టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగింది. ఇడియట్, శివమణి లాంటి విజయవంతమైన చిత్రాల్లో రక్షిత నటించింది. కానీ రక్షిత మహేష్ సరసన నటించిన నిజం చిత్రంలో మాత్రం ఓవరాక్షన్ చేసింది.
undefined
సింధు మీనన్ : కృష్ణ వంశీ తెరకెక్కించిన చందమామ చిత్రంలో సింధు మీనన్ ఓ హీరోయిన్ గా నటించింది. సింధు మీనన్ పాత్ర కాస్త అతి అయినట్లు అనిపిస్తుంది ఈ చిత్రంలో.
undefined
తమన్నా: యువతలో మిల్కీ బ్యూటీగా తమన్నాకు యువతలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ కొన్ని చిత్రాల్లో తమన్నా నటన విమర్శలకు గురైంది. ముఖ్యంగా రెబల్ చిత్రంలో తమన్నా ఓవరాక్షన్ ప్రేక్షకులకు చికాకు పుట్టించే విధంగా ఉంటుంది.
undefined
నేహా శర్మ: నేహా శర్మ చిరుత లాంటి సూపర్ హిట్ చిత్రంలో రామ్ చరణ్ తో రొమాన్స్ చేసింది. ఈ చిత్రంలో నేహా చేత దర్శకుడు పూరి జగన్నాథ్ ఓవర్ యాక్షన్ చేయించాడు.
undefined
అనుష్క శెట్టి: అనుష్క నటనకు వంకరలు పెట్టలేం. కానీ డాన్ చిత్రంలో అనుష్క చేసే ఓవర్ యాక్టింగ్ ప్రేక్షకులకు విసుగు తెప్పించింది.
undefined
ఆసిన్ : సౌత్ లో ఓ వెలుగు వెలిగింది తమిళ బ్యూటీ ఆసిన్. కానీ దశావతారం చిత్రంలో ఆసిన్ చేసే అతి అంతా ఇంతా కాదు.
undefined
రకుల్ ప్రీత్ సింగ్ : స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ బ్రూస్ లీ, మన్మథుడు 2 లాంటి చిత్రాల్లో ఓవరాక్షన్ చేసింది.
undefined
రష్మిక మందన: ప్రస్తుతం సౌత్ లో రోజు రోజుకు  పెంచుకుంటోన్న హీరోయిన్ రష్మిక. రష్మిక సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రం ఘనవిజయం సాధించింది. కానీ రష్మిక పాత్రపై విమర్శలు వచ్చాయి. అందుకు కారణం రష్మిక పాత్ర అతిగా అనిపించడమే.
undefined
click me!