Published : May 07, 2020, 01:03 PM ISTUpdated : May 07, 2020, 01:16 PM IST
వైజాగ్‌లో జరిగిన గ్యాస్ లీక్ వ్యవహారంతో దేశం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. వైజాగ్ పరిసర ప్రాంతంలోని ఎల్జీ పాలిమర్స్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదం చుట్టు పక్కల గ్రామల ప్రజల పరిస్థితిని అగమ్యగోచరంగా మార్చేసింది. విష వాయువును పీల్చి వందలాది మంది అనారోగ్యం పాలుకాగా పలువురు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనపై టాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు, ఎన్టీఆర్, నాని, సుధీర్ బాబు లాంటి హీరోలతో పాటు రకుల్ ప్రీత్ సింగ్, తమన్నా, ప్రణీత లాంటి హీరోయిన్లు కూడా ఈ విషయంపై స్పందించారు.