చిరంజీవి గారి గురించి తెలుసుకున్నా, శ్రీజకు ఫోన్ చేశా.. వెన్నుపోటు పొడిచాడు

First Published May 7, 2020, 9:46 AM IST

మెగా ఫ్యామిలీ గురించి ఎవరు ఏం మాట్లాడినా ఇట్టే వైరల్ అయిపోతుంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ ఆట సందీప్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశాడు. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలో తనకు ఘోర అవమానం జరిగినట్లు సందీప్ పేర్కొన్నాడు.

మెగా ఫ్యామిలీ గురించి ఎవరు ఏం మాట్లాడినా ఇట్టే వైరల్ అయిపోతుంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ ఆట సందీప్తాజాగా ఓ ఇంటర్వ్యూలో సంచలనవ్యాఖ్యలు చేశాడు. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలో తనకు ఘోరఅవమానం జరిగినట్లుసందీప్పేర్కొన్నాడు. ఆ సంఘటననిసందీప్పూసగుచ్చినట్లు వివరించాడు.
undefined
నేను మెగా ఫ్యామిలీ అభిమానిని. మెగా హీరోలందరూ నాకు చాలా ఇష్టం. ఓసారిచిరంజీవి గారి బర్త్ డే సందర్భంగా గ్రాండ్ ఈవెంట్నిర్వహించారు. ఆ ఈవెంట్ లో పెర్ఫామ్ చేయాలనిఅనుకున్నా. అందరిలా సాదా సీదాగా కాదు. చిరంజీవి గారి గురించి ఎవరికీ తెలియని విషయాలు తెలియజేసేలాకొరియోగ్రఫీ ప్లాన్ చేసుకున్నా.
undefined
దాని కోసం చిరంజీవి గారి జీవిత చరిత్ర మొత్తం తెలుసుకున్నా. చిరంజీవి గారి లక్షలాది మంది అభిమానులకు ఆయన బర్త్ డే రోజున డాన్స్ రూపంలో ట్రీట్ ఇవ్వాలని భావించా. చిరంజీవిగారి బర్త్ డే దగ్గరకువస్తోంది. దీనితో చిరంజీవి అభిమాన సంఘం నాయకుడు స్వామినాయుడు గారిని వెళ్లి కలిశా.
undefined
చిరంజీవి గారి గురించి ప్రిపేర్ చేసిన కాన్సెప్ట్ ని వివరించా. బాగా లేట్ అయిపోయావమ్మా. ఇప్పటికే షెడ్యూల్ అంతా పూర్తి చేశాం. మళ్ళీ నీకోసం షెడ్యూల్ మార్చాలంటే కష్టం అని అన్నారు. దీనితో ఎలాగైనా చూడండి అని రిక్వస్ట్ చేశా. సరే చూద్దాంలే అని అన్నారు.
undefined
చివరి నిమిషంలో హ్యాండ్ ఇస్తారేమోననినా జాగ్రత్తలో నేనున్నా. చిరంజీవి గారి చిన్న కుమార్తె శ్రీజ భర్త కళ్యాణ్ దేవ్ నాకు బాగా క్లోజ్. నేను పెర్ఫామ్ చేయబోయే కాన్సెప్ట్ గురించి చెబుదామని ఆయనకు ఫోన్ చేశా. శ్రీజ మాట్లాడారు. ఆమెకు కాన్సెప్ట్ వివరించా. నా కాన్సెప్ట్ శ్రీజ గారికి బాగా నచ్చింది.
undefined
సందీప్మంచి కొరియోగ్రాఫర్.. అతడితో చేయిద్దాం అని శ్రీజ స్వామినాయుడుతో చెప్పారు. ఆయన కూడా ఒకే చేశారు. ఇక అంతా ఓకే అయింది. అదే ఈవెంట్ లో సత్యమాస్టర్ కూడా పెర్ఫామ్ చేస్తున్నారు. నా గురించి అతడికి తెలిసింది. ఈవెంట్ ప్రారంభం అయి మూడుగంటలుదాటిపోయింది. అయినా నాకు అవకాశం రాలేదు.
undefined
అప్పుడే అసలు విషయం తెలిసింది. ఈ ఈవెంట్ లో సందీప్ పెర్ఫామ్ చేస్తే మేము చేయం అని సత్యమాస్టర్ అన్నారట. అందుకే నాకు అవకాశం ఇవ్వలేదు., గతంలోనేను, సత్య మాస్టర్ పెర్ఫామ్ చేయగా.. రాంచరణ్ గారు నన్ను మెచ్చుకున్నారు. సత్య మాస్టర్ ని మెచ్చుకోలేదు.
undefined
ఆ విషయం మనసులో పెట్టుకుని ఉన్నట్లున్నాడు. ఈసారి కూడా తనని నేను ఎక్కడ డామినేట్ చేస్తానేమోననిఇలా వెన్నుపోటు పొడిచినట్లు సందీప్ సంచలన ఆరోపణలు చేశారు.
undefined
click me!