సాధారణంగా కపుల్స్ లో అబ్బాయి వయసు ఎక్కువ, అమ్మాయి వయసు తక్కువ ఉండడం సహజం. అయితే కొంతమంది తమకంటే వయసులో పెద్దవారైన అమ్మాయిలను పెళ్లి చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. ఇది ఇలా ఉండగా.. సినిమాల విషయానికొచ్చేసరికి హీరోలు తమకంటే వయసులో చిన్నవారైన హీరోయిన్లతోనే ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేస్తుంటారు. కానీ కొన్ని సార్లు మాత్రం మన హీరోలు వాళ్లకంటే వయసులో పెద్దవారైన హీరోయిన్లతో సినిమాలు చేశారు. వారెవరో ఇప్పుడు చూద్దాం!
రామ్ చరణ్ బాలీవుడ్ సినిమా 'తుఫాన్' కోసం ప్రియాంకా చోప్రాతో కలిసి పని చేశారు. రామ్ చరణ్ 1985లో పుడితే.. ప్రియాంకా 1982లో పుట్టింది. చరణ్ కంటే ప్రియాంక మూడేళ్లు పెద్దది.
ఎన్టీఆర్ తన కెరీర్ లో చాలా మంది హీరోయిన్లతో కలిసి నటించారు. ఈ క్రమంలో తనకంటే వయసులో పెద్ద వారైనా హీరోయిన్లతో నటించారు. 'ఆది' సినిమాలో జూనియర్ ఎన్టీఆర్, కీర్తి చావ్లాతో కలిసి రొమాన్స్ చేశారు. ఎన్టీఆర్ కంటే కీర్తి వయసులో రెండేళ్లు పెద్దది.
సింహాద్రి, సాంబ : ఎన్టీఆర్-మే 20, 1983, భూమిక చావ్లా- ఆగష్టు 21, 1978
నరసింహుడు: ఎన్టీఆర్-మే 20, 1983, అమిషా పటేల్ - జూన్ 9, 1976, సమీరా రెడ్డి - డిసెంబర్ 14, 1980
వంశీ: మహేష్ బాబు - ఆగస్టు 9, 1975, నమ్రత శిరోద్కర్ - జనవరి 22, 1972
నా అల్లుడు : ఎన్టీఆర్-మే 20, 1983, శ్రీయ సరన్ - సెప్టెంబర్ 11, 1982
టక్కరి దొంగ - మహేష్ బాబు - ఆగస్టు 9, 1975, లిసా రాణి రే - ఏప్రిల్ 4, 1972
దేవదాసు: రామ్ - మే 15, 1988, ఇలియానా - నవంబర్ 1, 1986
రెడీ: రామ్ - మే 15, 1988, జెనెలియా డిసౌజా - ఆగస్టు 5, 1987
గణేష్: రామ్ - మే 15, 1988, కాజల్ అగర్వాల్ - జూన్ 19, 1985
అల్లుడు సీను: బెల్లంకొండ శ్రీనివాస్ - జనవరి 3, 1993, సమంత - ఏప్రిల్ 28, 1987
జయ జానకి నాయక: బెల్లంకొండ శ్రీనివాస్ - జనవరి 3, 1993, రకుల్ ప్రీత్ - అక్టోబర్ 10, 1990
కవచం, సీత: బెల్లంకొండ శ్రీనివాస్ - జనవరి 3, 1993, కాజల్ అగర్వాల్ - జూన్ 19, 1985
గమ్యం: శర్వానంద్ - మార్చి 6, 1984, కమలీనీ ముఖర్జీ - మార్చి 4, 1980
స్నేహితుడు: నాని - ఫిబ్రవరి 24, 1984, మాధవీలత - అక్టోబర్ 2, 1982
అఖిల్ 4వ ప్రాజెక్ట్: అక్కినేని అఖిల్ - ఏప్రిల్ 8, 1994, పూజా హెగ్డే - అక్టోబర్ 13, 1990