Ravi teja, Gopichand, varunteja, sri vishnu
2024 వ సంవత్సరం మరికొద్ది గంటల్లో వెళ్లిపోతోంది. ఈ నేపధ్యంలో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ప్లస్ లు మైనస్ లు అందరూ గుర్తు చేసుకుంటున్నారు. అదే విధంగా ఈ సంవత్సరం తెలుగు పరిశ్రమ వెలుగు జిలుగులు సైతం ఇండస్ట్రీ లెక్కలేస్తోంది.
ఈ క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమా వెలుగుతున్న తీరు, ప్యాన్ ఇండియా సినిమాల జోరుతో పాటు ఈ యేడ్ డబుల్ డిజాస్టర్స్ ఇచ్చిన హీరోలను ఇండస్ట్రీ ఆసక్తిగా గుర్తు చేసుకుంటోంది. ఆ హీరోలు ఎవరో చూద్దాం.
రవితేజ
గత కొద్ది సంవత్సరాలుగా రవితేజ కెరీర్ పరంగా ఛాలెంజ్ ని ఎదుర్కొంటున్నారు. ఒక్క హిట్ వస్తే నాలుగు ప్లాఫ్ లు అన్న ధోరణి నడుస్తోంది. ఈ క్రమంలో 2024లోనూ రెండు పెద్ద సినిమాలు చేసాడు రవితేజ. అవి రెండు డిజాస్టర్స్ అయ్యాయి. ఆ సినిమాలు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన ఈగల్, హరీశ్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన మిస్టర్ బచ్చన్ . ఈ రెండు సినిమాలు మినిమం రికవరీ కూడా భాక్సాఫీస్ దగ్గర సాధించలేక చతికలపడ్డాయి.
గోపిచంద్
ఇక ఎంతో కాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరో ఎవరూ అంటే గోపిచంద్ అని చెప్పాలి. సరైన సక్సెస్ దొరక్క అల్లాడిపోతున్న గోపీచంద్ ఓ పూర్తి యాక్షన్ చిత్రం, మరో యాక్షన్ కామెడీ చిత్రం చేసారు. కన్నడ దర్శకుడుతో రూపొందించిన డివోషనల్ యాక్షన్ చిత్రం భీమ భాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయ్యింది. అలాగే తన కెరీర్ లో ఎన్నో కామెడీ సినిమాలు అందించిన శ్రీను వైట్ల దర్శకత్వంలో చేసిన విశ్వం సైతం వర్కవుట్ కాలేదు. ఇద్దరు దర్శకులు కలిసి గోపిచంద్ ని మరోసారి ఫ్లాఫ్ ల ఊబిలోకి తోసేసారు.
వరుణ్ తేజ్
మెగా వారసుడు వరుణ్ తేజ్ సక్సెస్ చూసి చాలా ఏళ్లు అయ్యింది. ఈ క్రమంలో 2024లో రెండు ప్యాన్ ఇండియా భారి బడ్జెట్ సినిమాలతో మన ముందుకు వచ్చాడు. ఆ రెండు సినిమాలు భాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. అందులో ఒకటి ఆపరేషన్ వాలెంటైన్, మట్కా చిత్రం. ఆపరేషన్ వాలెంటైన్ చిత్రం మొదటి నుంచి తేడా అనిపించింది. కానీ మట్కా మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. దాదాపు 70 కోట్లుతో తీసిన ఈ చిత్రం 10 కోట్లు కూడా రికవరీ చేయలేకపోయింది.
విశ్వక్సేన్
ఇక ఈ 2024 యంగ్ హీరో విశ్వక్సేన్ కు కూడా కలిసి రాలేదు. ఈ సంవత్సరం ప్రారంభంలో గామి సినిమాతో పలకరించాడు. ఈ సినిమాకు రివ్యూలు బాగానే వచ్చినా ఈ చిత్రం భాక్సాఫీస్ పరంగా డిజాస్టర్ అయ్యింమది. ఆ తర్వాత గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మెకానిక్ రాఖీ చిత్రాలు చేస్తే ఆ రెండు సినిమాలు కూడా అసలు ఆడలేదు. కమర్షియల్ గా ఈ మూడు సినిమాలు నిర్మాతలు నష్టం కలిగించాయి.
శ్రీ విష్ణు
హీరోగా శ్రీవిష్ణుకు ప్రత్యేకమైన ఆడియన్స్ ఉన్నారు. అతని సినిమాకు మినిమం గ్యారెంటి అని లాస్ట్ ఇయర్ వచ్చిన సామజవరగమన ప్రూవ్ చేసింది. అయితే 2024 అతనికి కలిసి రాలేదు. ఈ సంవత్సరం చేసిన ఓం భీమ్ బుష్, స్వాగ్ చిత్రాలు రెండు భాక్సాఫీస్ డిజాస్టర్ అయ్యింది. ఓపినింగ్స్ పరంగా బాగానే తెచ్చుకున్న ఈ రెండు సినిమాలు అతన్ని కెరీర్ పరంగా వెనక్కి తోసేసాయి.
అల్లరి నరేష్
కామెడీ సినిమాలు వదిలేసి సీరియస్ యాక్షన్ సినిమాలు చేస్తున్న అల్లరి నరేష్ కు 2024 కలిసి రాలేదు. తన పాత పంధాలోకి వెళ్లి చేసిన కామెడీ సినిమా ఆ ఒక్కటీ అడక్కు సినిమా, సీరియస్ ఫిల్మ్ బచ్చల మల్లి ఈ రెండు సినిమాలు భాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నమోదు అయ్యాయి. కొత్త సంవత్సరంలో అయినా నరేష్ తిరిగి ఫామ్ లోకి రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.