'గేమ్ ఛేంజర్' కోసం దిల్ రాజు కొత్త ప్రమోషన్ స్ట్రాటజీ? , షాకింగే

First Published | Oct 18, 2024, 3:42 PM IST


పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ తో సాగే రివేంజ్ స్టోరీ అని,శంకర్ మార్కు ఎలిమెంట్స్ తో సినిమా నడుస్తుందని కాబట్టి ఖచ్చితంగా సూపర్ హిట్ అయ్యే ఫార్ములా స్టోరీ అని చెప్తున్నారు. 

#Shankar, #GameChanger, #RamCharan, #KiaraAdvani

 
ఏ సినిమాకు అయినా ప్రమోషన్స్ అవసరం. ప్రమోషన్స్ సరిగ్గా లేకపోతే సినిమాలు వర్కవుట్ కావటం లేదు. ముఖ్యంగా భారీ సినిమాలకు సరపడ బజ్ క్రియేట్ కావాలంటే సినిమాలకు కొత్త తరహా ప్రమోషన్స్ అవసరం. అదే నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. సోషల్ మీడియా ఇన్పూలియన్స్ లుని పిలిచి సినిమాలు చూపించి పోస్ట్ లు పెట్టించటం వంటివి ఈ కోవకు చెందినవే.

అయితే దిల్ రాజు ఇప్పుడు ఓ కొత్త ప్రమోషన్ స్ట్రాటజీ ప్లే చేయబోతున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఫస్ట్ టైమ్ ఇలాంటి స్ట్రాటజీ అని క్లిక్ అయితే చాలా మంది అనుసరిస్తారని అంటున్నారు. ఆ స్ట్రాటజీ ఏమిటి...

#Shankar, #GameChanger, #RamCharan, #KiaraAdvani


గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram charan) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్(Game changer) పై ఏ రేంజిలో అంచనాలు ఉన్నాయో తెలిసిందే. తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్(Shankar) తెరకెక్కిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు(Dil raju) నిర్మిస్తుండగా.. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారు.  

పాన్ ఇండియా లెవల్లో వస్తున్న ఈ సినిమా లో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు.  అలాగే ఈ సినిమాలో ఫైట్స్ డిఫరెంట్ గా ఉండనున్నాయి. దర్శకుడు శంకర్ ప్రాణం పెట్టి ఈ సినిమా చేస్తున్నారు. ఆయన కెరీర్ కు ఇది లైఫ్ అండ్ డెత్ క్వచ్చిన్ లాంటింది. దాంతో ప్రమోషన్స్ విషయంలోనూ కొత్త దారి ఎంచుకుంటున్నట్లు తెలుస్తోంది.


Game Changer

 
గేమ్ ఛేంజర్ సినిమాలోను హైలెట్ గా ఉండే ఓ యాక్షన్ సీక్వెన్స్ ను ఫుల్ గా రిలీజ్ చేస్తారట. యూట్యూబ్ లో విడుదల చేసి సోషల్ మీడియా ద్వారా ప్రమోట్ చేసి సినిమాకు ఆ ఒక్క వీడియోతో ఓ రేంజి బజ్ క్రియేట్ చేయాలనేది దిల్ రాజు ఆలోచనగా చెప్తున్నారు. ఇప్పటిదాకా అలా మొత్తం యాక్షన్ ఎపిసోడ్ ని రిలీజ్ చేయలేదు.

రామ్ చరణ్ యాక్షన్ ఎపిసోడ్ గ్యారంటీగా వైరల్ అవుతుంది. ఫ్యాన్స్ పండగ చేసేస్తారు. ఒక  ఎపిసోడ్ ..యూట్యూబ్ లో చూస్తేనే ఇలా ఉంది. ఇంక సినిమాలో చూస్తే ఎలా ఉంటుందో అనిపించాలనేది దిల్ రాజు, శంకర్ ఆలోచనగా చెప్తున్నారు. అయితే ఇప్పటిదాకా ఈ విషయమై అఫీషియల్ సమాచారం ఏమి లేదు.


ఇక బాలీవుడ్ లో కూడా రామ్ చరణ్ ని తీసుకెళ్లి మరీ ప్రమోట్ చేయాలనే ఆలోచనలో దిల్ రాజు ఉన్నారట. దీపావళి నుంచి ప్రమోషన్స్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. 
గేమ్ ఛేంజర్ సినిమాలో రామ్ చరణ్ తండ్రీకొడుకులుగా డ్యూయెల్ రోల్ లో కనిపించనున్నాడు.

ముఖ్యంగా కథ బిల్డ్ అయ్యేది  తండ్రి పాత్ర నుంచే.  ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే తండ్రి సీన్స్ ప్రేక్షకులకు బాగా నచ్చేలా ప్లాన్ చేసారట.  ఈ పాత్ర గెటప్, నటన  కొత్త‌గా ఉండ‌బోతున్నాయ‌ని తెలుస్తోంది. ఈ పాత్రతో చరణ్ కు నేషనల్ అవార్డ్ వచ్చినా ఆశ్చర్యం లేదని, ఆ స్దాయిలో పాత్రను డిజైన్ చేసినట్లు చెప్తున్నారు. 
 

actor ram charan movie Game Changer


ఇక తండ్రిగా కనిపించే రామ్ చరణ్ పాత్ర పేరు అప్పన్న అని తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ముప్పై ఏళ్ల క్రితం కనిపించే పంచకట్టుతో కనిపిస్తుందట ఈ పాత్ర. పొలిటికల్ లీడర్ గా కనిపంచే ఈ పాత్రలో రామ్ చరణ్ కు  నత్తి సమస్య ఉంటుందట. అదే ఈ పాత్రకు హైలెట్ కానుందని సమాచారం. ఇక ఎలక్షన్స్  లో  నిలబడ్డ అప్పన్న పాత్ర కొన్ని కుట్రలకు బలైపోతాడు. అదే కొడుకు రామ్ చరణ్ మనస్సులో నాటుకుపోతుందిట. తండ్రి రామ్ చరణ్ కు జంటగా అంజలి కనిపించనుందిట.

Pushpa 2 and Game Changer


ఇక కొడుకు పాత్ర పేరు రామ్ నందన్. అతను ఐ ఏ ఎస్ ఆఫీసర్ అవుతాడు. తన తండ్రి జరిగిన అన్యాయానికి అతను చట్టం పరిధిలోనే ఎలా రివేంజ్ తీర్చుకున్నాడు. తన తండ్రి రాజకీయుకుడుగా జనాలకు చేద్దామనుకున్న పనులును తను ఎలా చేసాడు. చట్టంలో ఉన్న లొసుగులు వలన ఎలా సామాన్యులు ఇబ్బంది పడతారు.

ఎలాంటి మార్పులు చట్టంలో చోటు చేసుకోవాల్సిన అవసరం ఉంది వంటి విషయాలు సినిమాలో చూపిస్తారని అంటున్నారు.  ఈ సినిమా పూర్తిగా తండ్రి ఆశయాన్ని తీరుస్తూ, అన్యాయానికి ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడనే పక్కా రివేంజ్ స్టోరీతో ఈ సినిమా సాగుతుందని తెలుస్తోంది. 

Latest Videos

click me!