ఒకే స్టేజిపై ప్రభాస్, రజనీ.. ఫ్యాన్స్ కు పండగే

First Published | Oct 18, 2024, 2:17 PM IST

 ప్రభాస్, రజనీకాంత్ కలిసి ఇద్దరూ ఒకే స్టేజిపై కనపడితే ఫ్యాన్స్ హంగామా ఏ రేంజ్‌లో ఉంటుందో చెప్పతరం కాదు. దానికి తోడు అదే స్టేజిపై హీరో సూర్య కూడా ఉంటే, ఇక ఫ్యాన్స్ కి పూనకాలే. 
 

Prabhas, rajinikanth, kanguva

ప్రభాస్, రజనీకాంత్ ఇద్దరూ ప్రస్తుతం  సిని పరిశ్రమను ఏలుతున్న సూపర్ స్టార్సే. వీళ్లిద్దరూ తెరపై కనపడటం అంటే చాలా చాలా కష్టం. అందుకు తగ్గ కథ దొరకదు. బడ్జట్ లు సహకరించవు. కానీ ఒకే స్టోజిపై కనపడే అవకాసం ఉంది. అది ఇప్పుడు జరగబోతోందని తెలుస్తోంది.

అయితే వీళ్లద్దరూ ఒకే సారి స్టేజిపై కనపడినప్పుడు ఫ్యాన్స్ ని కంట్రోలు చేయటం కష్టం. దానికోసం ప్రత్యేకమైన ప్లాన్ చేసుకుని అప్పుడు వీళ్లని ఒకే స్టేజిపై తీసుకొచ్చేందుకు ఓ సంస్ద ప్లాన్ చేస్తోంది. అది త్వరలోనే ఆ ఈవెంట్ జరగనుందని సమాచారం. ఇంతకీ ఏమిటా ఏవెంట్ అనే వివరాల్లోకి వెళితే..

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Prabhas, rajinikanth, kanguva


చెన్నై మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు  ఈ స్టార్ ఇద్దరూ కంగువా చిత్రం ఆడియో ఫంక్షన్ కు రప్పించటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. తమిళ స్టార్ హీరో సూర్య హీరోగా.. డైరెక్టర్ శివ తెరకెక్కించిన సినిమా ‘కంగువా’. స్టూడియో గ్రీన్‌, యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా విడుదల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

వాస్తవానికి దసరా కానుకగా అక్టోబర్‌ 10న విడుదల కావాల్సిన కంగువా.. సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ ‘వేట్టయన్‌’ కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. కంగువా చిత్రాన్ని నవంబర్‌ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ఇటీవల ప్రకటించింది.


Prabhas, rajinikanth, kanguva


కంగువా చిత్రం ఎనిమిది భాషల్లో రిలీజ్ కానుంది.  స్టూడియో గ్రీన్‌ పాటు యూవీ క్రియేషన్స్ బ్యానర్‌ వారు ఈ చిత్రం కలిపి చేయటంతో ఈ స్టార్స్ ని ఒకేసారి స్టేజిపై తెచ్చే అవకాశం కలుగుతోంది. యువి క్రియేషన్స్ అంటే ప్రభాస్ కు సొంత సంస్ద లాంటిది. దాంతో యువి క్రియేషన్స్ పిలిస్తే ఖచ్చితంగా ప్రబాస్ వస్తాడు. అందులోనూ ఈ భారీ బడ్జెట్ చిత్రానికి తెలుగు నుంచి ప్రమోషన్స్ పెద్దగా కనపడటం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ బూస్టింగ్ లాంటిది ఇవ్వాలంటే ప్రభాస్ లాంటి బాహుబలి అవసరం. 

Prabhas, rajinikanth, kanguva


మరో ప్రక్క దర్శకుడు శివ కు రజనీకాంత్ తో అనుబంధం ఉంది.  వీరిద్దరి కాంబినేషన్  లో అన్నాత్తే చిత్రం వచ్చింది. ఆ చనువుతోనే శివ తాను రజనీని ఈ ఆడియో ఫంక్షన్ కు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం రజనీకాంత్ హెల్త్ ఇష్యూలతో రెస్ట్ లో ఉన్నారు. కాబట్టి రజనీ వస్తారా రారా అనేది సందేహమే. ఇక ప్రభాస్, రజనీకాంత్ కలిసి ఇద్దరూ ఒకే స్టేజిపై కనపడితే ఫ్యాన్స్ హంగామా చెప్పలేము. దానికి తోడు అదే స్టేజిపై హీరో సూర్య కూడా ఉంటారు. 

Prabhas, rajinikanth, kanguva


కంగువా ద్వారా బాలీవుడ్ స్టార్స్ బాబీ డియోల్, దిశా పటానీలు కోలీవుడ్ అరంగేట్రం చేస్తున్నారు. కిచ్చా సుదీప్‌, యోగిబాబు, జగపతిబాబు, నటరాజన్ సుబ్రమణ్యంలు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇందులో సూర్య మూడు భిన్నమైన లుక్స్‌లో కనిపించనున్నారని సమాచారం. దేవిశ్రీ ప్రసాద్‌ ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు. ఇప్పటికే విడుదల అయిన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. తెలుగు నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ మొదటిసారి తమిళంలో నిర్మిస్తున్న మూవీ కావడంతో మన దగ్గర కూడా భారీ అంచనాలు ఉన్నాయి.

Prabhas, rajinikanth, kanguva


 తమిళంలో రూ.1000కోట్లు కలెక్ట్ చేయగల సత్తా ఉన్న సినిమాగా కంగువాని అంచనా వేస్తున్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో డైరెక్టర్ శివ సినిమా రన్ టైం బయటపెట్టేశాడు. ఈ సినిమాలో ఓల్డ్ పోర్షన్ రెండు గంటలు ఉంటుందట. అంటే కంగువ పాత్రలో సూర్య రెండు గంటల పాటు కనిపించనున్నాడు. ఇక న్యూ పోర్షన్ దాదాపు 25 నిమిషాల పాటు ఉంటుంది. టైటిల్స్ నిడివి పక్కన పెడితే ఈ సినిమా దాదాపు రెండు గంటల 25 నిమిషాల పాటు ఉండబోతుందని తెలుస్తుంది. 

Read more: `లవ్‌ రెడ్డి` మూవీ రివ్యూ, రేటింగ్‌

Latest Videos

click me!