పంచకులలోని గురుద్వారా శ్రీ కుహ్ని సాహిబ్ నిర్వాహకులు దీనిపై తీవ్రంగా స్పందించారు. గురుద్వారా మేనేజర్ సత్బీర్ సింగ్, సెక్రటరీ శివ కన్వర్ సింగ్ సంధు మాట్లాడుతూ.. అమీషా పటేల్, సన్నీడియోల్ పై కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తామని చిత్ర బృందం కోరిందని తెలిపారు.ఈ షూటింగ్ చేసేటప్పుడు ఎలాంటి దురుద్దేశపూర్వక సన్నివేశాలు తీయడం లేదని చెప్పారన్నారు. భైసాఖి పండుగ ప్రాముఖ్యత దృష్టా కొన్ని సన్నివేశాలు తెరకెక్కిస్తామన్నారు