అంబరాన్ని అంటిన మెగా పెళ్లి సందడి.. ఘనంగా మెగా ప్రిన్స్ , అందాల రాక్షసి ఎంగేజ్మెంట్

Published : Jun 10, 2023, 03:38 AM ISTUpdated : Jun 10, 2023, 08:36 AM IST

Varun Tej-Lavanya Tripathi Engagement: ఐదేళ్లుగా ప్రేమలో వరుణ్‌- లావణ్యల ఎంగేజ్మెంట్ వేడుక హైదరాబాద్ లోని నాగబాబు ఇంట్లో  ఘనంగా జరిగింది. మెగాస్టార్ చిరంజీవి దంపతులు, రామ్ చరణ్, ఉపాసనతో పాటు మెగా కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు, ఇరు కుటుంబ సభ్యులందరూ ఈ వేడుకలో పాల్గొననున్నారని సమాచారం. 

PREV
16
అంబరాన్ని అంటిన మెగా పెళ్లి సందడి.. ఘనంగా మెగా ప్రిన్స్ , అందాల రాక్షసి ఎంగేజ్మెంట్
Varun Tej-Lavanya Tripathi Engagement

Varun Tej-Lavanya Tripathi Engagement: మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌, అందాల రాక్షసి లావణ్య త్రిపాఠిల నిశ్చితార్థం శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ లోని నాగబాబు నివాసంలో ఇంట్లో వీరిద్దరి నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి దంపతులు, రామ్ చరణ్, అల్లు అర్జున్, అంజనాదేవి, అల్లు అరవింద్, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ తదితరలు వచ్చినట్లు తెలుస్తోంది. ఇరు కుటుంబాలు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వరుణ్ తేజ్ లావణ్యఉంగరాలు మార్చుకుంటున్నారు .
 

26
Varun Tej-Lavanya Tripathi Engagement

ప్రముఖ డిజైనర్స్ స్టైలీష్ట్స్ వరుణ్‌- లావణ్యల  ప్రత్యేక కాస్ట్యూమ్స్ స్టైలింగ్ పై వర్క్ చేశారట. వరుణ్ తేజ్ దుస్తుల్ని డిజైనర్ తరుణ్ తహిలియా రూపొందించగా.. లావణ్యకు అశ్విన్ మావ్లే  స్టైలింగ్ చేశారు. అలాగే.. డిజైనర్ అనితా డోంగ్రే లావణ్య స్పెషల్ లుక్ డిజైన్ చేశారని సమాచారం. 

 

36
Varun Tej-Lavanya Tripathi Engagement

మిస్టర్ మూవీలో లావణ్య-వరుణ్ లు తొలిసారి జంటగా నటించారు. దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించిన ఈ సినిమా 2017లో విడుదలైంది. ఆ సినిమా షూటింగ్ లోనే వీరికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త స్నేహంగా మారింది. ఇద్దరి అభిప్రాయాలు, అభిరుచులు కావడంతో వారి మనస్సులు కూడా ఒక్కటయ్యాయి.   
 

46
Lavanya Tripathi - Varun Tej Engagement

వీరిద్దరూ 2018లో అంతరిక్షం సినిమాలో కలిసి నటించారు. ఈ క్రమంలో వారిద్దరూ మరింత దగ్గరయ్యారంట. దీంతో వరుణ్ తేజ్ కాస్తా ధైర్యం చేసి.. పెళ్లి చేసుకుందామా? అని అడిగేశాడంట.  వరుణ్ ప్రపోజల్ కు లావణ్య త్రిపాఠి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. అప్పటి నుండి ఇద్దరూ డేటింగ్ చేస్తున్నారు. కానీ.. చాలా కాలం వీరిద్దరూ గోప్యంగా వారి బంధాన్ని కొనసాగించారు. అటూ మీడియాలో గానీ,  చిత్ర వర్గాల్లో కానీ ఏ మాత్రం చర్చకు రాలేదు. 
 

56

2020లో నిహారిక వివాహం రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ప్యాలస్ లో జరిగింది. మెగా వారి పెళ్లికి  లావణ్య త్రిపాఠి ప్రత్యేక ఆహ్వానం వచ్చింది. అప్పట్లో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. లావణ్య త్రిపాఠిని ప్రత్యేకంగా ఆహ్వానించడమేని పలు అనుమానాలు మొదలయ్యాయి. ప్రైవేట్ పార్టీల్లో వీరిద్దరూ సందడి చేయడం చూసి పరిశ్రమ వర్గాలు కూపీలాగినా.. మేము జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అని అబద్దం చెప్పారు. ఎవ్వరూ ఊహించని విధంగా.. ఎంగేజ్మెంట్ డేట్ ప్రకటించి అందరిని షాక్ కు గురి చేశారు. 
 

66

 ఇక ప్రస్తుతం వరుణ్ తేజ్ గాంఢీవధారి అర్జున చిత్రంలో నటిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగస్ట్ 25న విడుదల కానుంది. అలాగే.. నూతన డైరెక్టర్ శక్తి ప్రతాప్ సింగ్ తో మరో మూవీ చేయనున్నారు. మాజీ మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. సోనీ పిక్చర్స్, రినైజాన్స్ పిక్చర్స్ నిర్మిస్తున్నాయి. ఇక ఈ ఏడాది చివర్లో వరుణ్ లావణ్య పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది.

click me!

Recommended Stories