బాలయ్య, రాజశేఖర్ తో మొదలైంది.. పవన్, రవితేజ అన్నారు.. చిరు, నాగ్ వద్ద ఆగిందా ?

First Published Sep 24, 2021, 2:02 PM IST

ప్రేక్షకుల ఆసక్తి మరింత పెంచేలా మరో క్రేజీ మల్టీస్టారర్ చిత్రానికి చర్చలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

రాను రాను టాలీవుడ్ లో మల్టీస్టారర్ చిత్రాలకు డిమాండ్ పెరుగుతోంది. టాలీవుడ్ లో ప్రస్తుతం ఆర్ఆర్ఆర్(RRR) లాంటి భారీ మల్టీస్టారర్ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రేక్షకుల ఆసక్తి మరింత పెంచేలా మరో క్రేజీ మల్టీస్టారర్ చిత్రానికి చర్చలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

అన్నీ కుదిరితే మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున కలసి నటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 2017లో తమిళంలో విడుదలైన విక్రమ్ వేద చిత్రం సంచలనం సృష్టించింది. విజయ్ సేతుపతి, మాధవన్ నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. 

ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ కాంబినేషన్ సెట్ కావడం లేదు. మల్టీస్టారర్ కాంబినేషన్ సెట్ చేయడం అంత సులభమైన విషయం కాదు. విక్రమ్ వేద చిత్రం విక్రమార్కుడు, బేతాళుడు తరహాలో సాగుతూ క్రైమ్ అంశాలతో ఉంటుంది. 

ఈ చిత్రంలో మాధవన్ విక్రమ్ గా పోలీస్ అధికారిగా కనిపిస్తాడు. విజయ్ సేతుపతి వేదగా క్రైమ్స్ చేస్తుంటాడు. వీరిద్దరి మధ్య ఉత్కంఠ కలిగించే కథనమే ఈ చిత్రం. మాధవన్, విజయ్ సేతుపతి ఇద్దరి పాత్రలు పవర్ ఫుల్ గా ఉంటాయి. 

ఈ చిత్రాన్ని తెలుగులో ఇద్దరు స్టార్స్ తో రీమేక్ చేస్తే అద్భుతంగా ఉంటుందనే ఆలోచన ఉంది. కానీ ప్రాజెక్టు పట్టాలెక్కడం లేదు. మొదట ఈ చిత్రం కోసం బాలయ్య - రాజశేఖర్ కాంబినేషన్ పేరు వినిపించింది. ఆ తర్వాత నాగార్జున - వెంకటేష్ పేర్లు వినిపించాయి. ఒక దశలో పవన్ కళ్యాణ్ - రవి తేజ లని సంప్రదిస్తున్నట్లు కూడా ప్రచారం జరిగింది. 

కానీ ఎంతవరకు విక్రమ్ వేద తెలుగు రీమేక్ విషయంలో అడుగు ముందుకు పడడం లేదు. ఈ చిత్ర హిందీ రీమేక్ కు అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. హృతిక్ రోషన్, సైఫ్ అలీ ఖాన్ హిందీ రీమేక్ లో నటించబోతున్నారు. తమిళ వర్షన్ ని డైరెక్ట్ చేసిన పుష్కర్ - గాయత్రి ద్వయమే హిందీ వర్షన్ ని కూడా డైరెక్ట్ చేయనున్నారు. 

ఈ నేపథ్యంలో తెలుగు రీమేక్ కి సంబంధించి క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. తెలుగు రీమేక్ లో నటింపజేసేందుకు మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జునతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించే ప్రయత్నాల్లో ఉన్నారట. వేణు శ్రీరామ్ ని డైరెక్టర్ గా అనుకుంటున్నట్లు తెలుస్తోంది. నాగ్, చిరు వైపు నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే ఈ చిత్రం పట్టాలెక్కడం ఖాయం అని అంటున్నారు. అక్కినేని మెగా మల్టి స్టారర్ అంటే క్రేజ్ ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు. 

click me!