మా బిల్డింగ్ వలన ఎవడికి ఉపయోగం... చిరంజీవి,కృష్ణ,పవన్ దగ్గర డబ్బుల్లేవా, మంచు విష్ణు కట్టాల్సిన అవసరం ఏంటి?

Published : Aug 26, 2021, 03:59 PM IST

గత రెండు నెలలుగా ఎన్నికల విషయంలో నటుల మధ్య వాడివేడి ఆరోపణలు, వాగ్వాదాలు నడుస్తున్నాయి. కాగా గతంలో మా ట్రెజరర్ గా వ్యవహరించిన సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు ఈ విషయంపై స్పందించారు. 

PREV
16
మా బిల్డింగ్ వలన ఎవడికి ఉపయోగం... చిరంజీవి,కృష్ణ,పవన్ దగ్గర డబ్బుల్లేవా, మంచు విష్ణు కట్టాల్సిన అవసరం ఏంటి?

ఇక గత రెండు నెలలుగా ఎన్నికల విషయంలో నటుల మధ్య వాడివేడి ఆరోపణలు, వాగ్వాదాలు నడుస్తున్నాయి. కాగా గతంలో మా ట్రెజరర్ గా వ్యవహరించిన సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు ఈ విషయంపై స్పందించారు. 
 

26

మా లో తొమ్మిది వందలకు పైగా సభ్యులు ఉన్నారు. ఎన్నికలు జరిగితే ఒక నాలుగు వందల మంది ఓటు వేస్తారు. ఇది సాధారణ ప్రజలకు సంబంధించిన విషయం కాదు. కాబట్టి పబ్లిక్ గా కామెంట్స్ చేయడం అనవసరం అన్నారు. 
 

36


ఇక మా సభ్యుల మధ్య బిల్డింగ్ అనేదే అతిపెద్ద టాపిక్ గా నడుస్తుంది. మంచు విష్ణు సొంత డబ్బులతో మా బిల్డింగ్ కట్టిస్తాను అని అంటున్నారు. దీనిపై మీ స్పందన ఏమిటని అడుగగా.. కోటా ఒకింత అసహనం వ్యక్తం చేశారు. 
 

46


డబ్బులు ఎవరి దగ్గరలేవు చెప్పండి. మంచు విష్ణు దగ్గర ఉన్నట్లే... చిరంజీవి, కృష్ణ, కృష్ణంరాజు, పవన్ కళ్యాణ్ దగ్గర కూడా ఉన్నాయి. ఇక్కడ డబ్బులు ముఖ్యం కాదు. అసలు మా బిల్డింగ్ వలన ఎవరికి ఉపయోగం చెప్పండి. కష్టాల్లో ఉన్న కార్మికుడు వెళ్లి ఆ బిల్డింగ్ లో ఉండడు కదా. బిల్డింగ్ అనేది అసలు అవసరం లేదు. 

56


కమిటీ చేయాల్సింది నటులు, కార్మికులకు ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలి. నెలలో కనీసం 10రోజులు షూటింగ్ ఉండేలా ప్రతి ఒక్కరికి పని కలిపిస్తే... ఆ సంపాదనతో హాయిగా బ్రతుకుతారు. అలాగే బయటివారికి కాకుండా కాంట్రాక్టులు స్థానికులకే ఇవ్వాలి. 

66


ఇలాంటి చర్యల వలన పేద కళాకారులు, కార్మికులకు మేలు జరుగుతుంది. అంతే కానీ మా బిల్డింగ్ వలన సినీ కార్మికులకు చేకూరే ప్రయోజనం ఏమీ లేదని కోటా శ్రీనివాసరావు అభిప్రాయం పడ్డారు.  

click me!

Recommended Stories