తల్లా, పెళ్లామా? రామ్ చరణ్ ఎవరికి భయపడతారు?

First Published | Sep 3, 2024, 1:22 PM IST

తెలుగులో లో మోస్ట్ క్యూటెస్ట్ పెయిర్ ఎవ‌రు అంటే ఠ‌క్కున గుర్తుకు వ‌చ్చే జంట రామ్ చ‌ర‌ణ్‌-ఉపాస‌న‌ అనే చెప్తారు. 

Ram Charan, chiranjeevi, Upasana, Game changer

రామ్ చరణ్ ఎప్పుడూ ఫ్యామిలీ మ్యానే. తన కెరీర్ తో సమానంగా కుటుంబానికి ప్రయారిటీ ఇస్తారు. ఇంకా చెప్పాలంటే కుటుంబానికే ఇంకాస్త ఎక్కువ ప్రయారిటీ ఇస్తారనే విషయం అందరికీ తెలుసు. చక్కటి ప్లానింగ్ తో ముందుకు వెళ్లే రామ్ చరణ్ కు అందుకు సహకరించేందుకు ఆయన భార్య ఉపాసన ఎప్పుడూ సిద్దంగా ఉంటుంది. భార్య మీద ఎప్పుడూ తన ప్రేమను కురిపిస్తూనే ఉంటాడు చరణ్. అది సరే రామ్ చరణ్ తన కుటుంబంలో ఎక్కువ ప్రేమ ఎవరిపై కురిస్తారు...ఎవరంటే ఎక్కువ భయపెడతారు. తల్లి అంటే భయమా... లేక భార్య అంటే ఎక్కువ భయపెడతారా ఆయన్నే అడిగి చూద్దాం.

Ram Charan

తెలుగులో లో మోస్ట్ క్యూటెస్ట్ పెయిర్ ఎవ‌రు అంటే ఠ‌క్కున గుర్తుకు వ‌చ్చే జంట రామ్ చ‌ర‌ణ్‌-ఉపాస‌న‌ అనే చెప్తారు. ఈ జంట పెళ్లైన‌ప్ప‌టి నుండి ఎంతో అన్యోన్యంగా ఉంటూ వ‌స్తున్నారు.దాదాపు ప‌దేళ్ల త‌ర్వాత ఈ జంట పండంటి బిడ్డ‌కు జ‌న్మనిచ్చి ఆ మురిపాలు పంచుకోవటంలో బిజీగా ఉన్నారు.  ప్ర‌స్తుతం ఆ చిన్నారితో చాలా సంతోషంగా జీవితం సాగిస్తున్నారు. 


ఇక ఆర్.ఆర్ ఆర్ తర్వాత  రామ్ చ‌ర‌ణ్ క్రేజ్ నెక్ట్స్ లెవిల్ కి చేరింది. చరణ్ గ్లోబర్ స్టార్ అయ్యాక ఆయనకు దేశ విదేశాల నుండి కూడా ఆహ్వానాలు అందుతున్నాయి. రీసెంట్‌గా రామ్ చ‌ర‌ణ్ చెన్నైలోని వేల్స్ యూనివర్సిటీలో డాక్టరేట్ కూడా తీసుకున్నారు. ఈ ఈవెంట్ కి ఉపాసన కూడా హాజ‌రు కాగా, ఆ స‌మ‌యంలో తీసిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైర‌ల్ అయ్యి ప్యాన్స్ లో ఆనందాన్ని కలిగించాయి.

ఇక తల్లి,భార్యలలో ఎవరికి ఎక్కువ భయపడతారు చరణ్ అనే విషయానికి వస్తే... ఆయనే 2022లో ఒక త్రోబాక్ ఇంటర్వ్యూలో క్లారిటి ఇచ్చారు. ఆ ఇంటర్వూలో , రామ్ చరణ్‌ను ఎవరికి ఎక్కువ భయపడ్డారు, అతని తండ్రి చిరంజీవి లేదా అతని భార్య ఉపాసన కొణిదెల అని అడిగారు. అయితే, కొణిదెల వంశానికి చెందిన మరో సభ్యుడి పేరును రామ్ చరణ్ చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది.  ఆ పేరుని రామ్ చరణ్ చెప్పారు. తాను ఎవరికి ఎక్కువ భయపడతాడో చెప్పారు.
 

ఆచార్య ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ఈ ప్రశ్నకు  స్పందిస్తూ తాను ఎవరికి భయపడతానో గేమ్ ఛేంజర్ నటుడు చెప్పుకొచ్చారు.   రామ్ చరణ్ మాట్లాడుతూ, “మా నాన్న మా అమ్మ సురేఖ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండడం నేను చాలా సార్లు చూశాను. ఆమె కుటుంబానికి బాస్, నాకు, మా నాన్నకి, బాబయ్య (పవన్ కళ్యాణ్)కి కూడా ఆమె బాస్. నేను కూడా అంతే , మా నాన్న ఎలా మా అమ్మ దగ్గర ఎంత జాగ్రత్తగా ఉంటారో నేను కూడా ఉపాసన దగ్గర జాగ్రత్తగా ఉండాలని  నేర్చుకున్నాను." అని నవ్వుతూ తను తన భార్యకే భయపడతానని తేల్చి చెప్పేసారు.
 

ఈ సమయంలో అక్కడ ఉన్న మెగా స్టార్ చిరంజీవి కూడా రామ్ చరణ్ చెప్పినదానికి  నవ్వుతూ, "నువ్వు  నా నుండి అదే నేర్చుకున్నట్లయితే, చాలా సంతోషంగా ఉంటావు" అని అన్నారు.
 

 రామ్ చరణ్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న విష‌యం తెలిసిందే. ఒకవైపు శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ షూటింగ్ చేస్తూనే.. మరోవైపు కొత్త సినిమాల‌కి గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తున్నాడు. 2025 పూర్త‌య్యే లోపు మూడు సినిమాల‌ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌నేది రామ్ చ‌ర‌ణ్ ప్లాన్.  ఇక బుచ్చిబాబుతో సినిమాను ఆల్రెడీ మొదలు పెట్టారు. వీలైనంత త్వ‌ర‌గా మూవీని మొద‌లు పెట్టి పూర్తి చేయాల‌నేది రామ్ చ‌ర‌ణ్ ప్లాన్‌గా చెబుతున్నారు.

upasana kamineni and ram charan

గ్లోబల్ స్టార్ రామ్​చరణ్- శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా 'గేమ్ ఛేంజర్'. భారీ బడ్జెట్​తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రం రూపొందుతోంది. తాజాగా సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇప్పటికే ఆలస్యం అవుతూ వస్తున్న ఈ సినిమాను 2024 క్రిస్మస్​కు రిలీజ్ చేస్తామని నిర్మాత దిల్​రాజు గతంలో చెప్పారు. అయితే మళ్లీ ఈ సినిమా విడుదల పోస్ట్​పోన్ అయ్యిందని, 2025లో చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందని ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో రిలీజ్ విషయంపై నిర్మాత దిల్​రాజ్ క్లారిటీ ఇచ్చారు.

'గేమ్ ఛేంజర్​ రిలీజ్ మళ్లీ వాయిదా అని వస్తున్న వార్తలు రూమర్లు. ఈ సినిమా క్రిస్మస్​కే థియేటర్లలోకి వస్తుంది. మూవీ షూటింగ్‌ పూర్తయింది. రామ్‌చరణ్‌, శంకర్‌ ఇమేజ్‌ను ఈ సినిమా మారుస్తుంది. ఈ చిత్రం మంచి విజయం అందుకుంటుంది. పొలికల్‌, యాక్షన్‌ నేపథ్యంలో సాగే పవర్‌ఫుల్‌ కథాంశంతో ఇది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శంకర్‌ గతంలో ఇలాంటి సినిమాలు చాలా చేశారు. 'రోబో'తో ఆయన పంథా మార్చుకున్నారు' అని తాజాగా 'మాస్కో ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ వీక్‌' ఈవెంట్​లో పాల్గొన్న దిల్​రాజు స్పష్టం చేశారు.

Latest Videos

click me!