రానా చిత్రం కాన్సిల్, క్రియేటివ్ డిఫరెన్స్ లు కారణం

గతంలో ఒప్పుకున్న సినిమాలు సైతం తిరిగి సమీక్షించుకుని మళ్లీ ఓకే చేస్తున్నారు. 

Rana Dagubbati


రానా ప్యానిండియా స్టార్ అయ్యాక తను చేసే సినిమాల విషయంలో ఆచి,తూచి ముందుకు వెళ్తున్నారు. ఖాళీగా ఉన్నా ఫర్వాలేదు కానీ, ఫ్లాఫ్ సినిమా తీయదలుచుకోలేదు.

ఈ మేరకు ఆయన స్క్రిప్టు విషయంలోనూ ఆచి,తూచి ముందుకు వెళ్తున్నారు. గతంలో ఒప్పుకున్న సినిమాలు సైతం తిరిగి సమీక్షించుకుని మళ్లీ ఓకే చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ ప్రాజెక్టు కాన్సిల్ చేసినట్లు సమాచారం.  ఆ సినిమా ఏంటి


 ఆ సినిమా మరేదో కాదు తేజ, రానా కాంబినేషన్ లో మొదలైన చిత్రం. రానా (Rana) హీరోగా తేజ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్‌బస్టర్‌ చిత్రం ‘నేనే రాజు నేనే మంత్రి’ (Nene Raju Nene Mantri). సమకాలీన రాజకీయాలపై తేజ టేకింగ్‌, రానా నటన సినిమాను విజయ పథంలో నడిపాయి. 
 



దాంతో రానా, తేజ  కాంబినేషన్‌లో మరో సినిమా ఉంటుందని ఇప్పటికే తేజ ప్రకటించారు. అన్నట్లుగానే ఇందుకు సంబంధించిన సినిమాను మొదలు పెట్టారు. ‘రాక్షస రాజా’ (Rakshasa Raja) టైటిల్ తో కొత్త చిత్రాన్ని పట్టాలెక్కించినట్లు రానా తెలిపారు. పోస్టర్ కూడా వదిలారు. అయితే అనేక నెగిటివ్ కామెంట్స్ ని ఎదుర్కొంది.

Rana Daggubati

రానా దగ్గుబాటి పుట్టినరోజు సందర్భంగా  ఈ సినిమాని అధికారికంగా ప్రకటించారు. పూజా కార్యక్రమాల్ని కూడా నిర్వహించినట్టు తెలుస్తోంది.  

అయితే‘‘గ్యాంగ్‌స్టర్‌ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతోంది. ఇదివరకు ఎప్పుడూ చూడని ఓ నేర ప్రపంచాన్ని తెరపై ఆవిష్కరిస్తున్నాం. కుటుంబ నేపథ్యంలో సాగే డ్రామా కూడా ఈ కథలో కీలకం. అంచనాలకి దీటుగా, రానా ఓ శక్తిమంతమైన పాత్రలో నటిస్తారు’’ అని చెప్పారు.
 


ఇందులో రానా గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నారని పోస్టర్ చూస్తే అర్థమవుతోంది. అంతేకాదు, బలమైన భావోద్వేగాలతో కూడిన కథగా దీన్ని తీర్చిదిద్దనున్నట్లు తేజ ప్లాన్ చేసినట్లు టాక్‌.  

అయితే దర్శకుడుగా తేజ వరస పెట్టి ఫెయిల్యూర్స్ ని ఎదుర్కోవటం , రానా తమ్ముడు అబిరామ్ తొలి చిత్రం అహింస డిజాస్టర్ అవటం వంటివి ఈ ప్రాజెక్టుని డైలమోలో పడేసాయి. అంతేకాకుండా స్క్రిప్ట్ విషయంలో రానా, తేజ మధ్య క్రియేటివ్ డిఫరెన్స్ లు వచ్చాయని ఫిల్మ్ నగర్ టాక్.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 అప్ డేట్స్ కోేసం ఇక్కడ క్లిక్ చేయండి.
 

Latest Videos

click me!