'రాయన్' సినిమా ప్రీ- రిలీజ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దిల్ రాజు ని 'గేమ్ ఛేంజర్' విడుదల ఎప్పుడు అంటూ చరణ్ ఫ్యాన్స్ పట్టుపట్టారు. దీంతో ఆయన చెప్పక తప్పలేదు. 'గేమ్ ఛేంజర్' మూవీని క్రిస్మస్ కానుకగా విడుదల చేస్తామని దిల్ రాజ్ ప్రకటించారు. దీంతో ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషీ అయ్యారు.
‘గేమ్ ఛేంజర్’ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. కియారా అడ్వాణీ కథానాయిక. అంజలి, ఎస్‌జే సూర్య, శ్రీకాంత్, సునీల్, సముద్రఖని తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.