దేవర మూవీ తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజ్ కానుంది. అన్ని భాషల కోసం ప్రమోషన్లను జోరుగా చేసేలా మూవీ టీమ్ పక్కా ప్లాన్ వేస్తోందని తెలుస్తోంది. దేవర చిత్రంలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‍గా నటించారు.
బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్, బాబీ డియోల్ విలన్లుగా చేశారు. ఈ మూవీలో ప్రకాశ్ రాజ్, షైన్ టామ్ చాకో, శ్రీకాంత్, తారక పొన్నాడ, శృతి మరాథే, మురళీ శర్మ కీలకపాత్రలు పోషించారు.