స్టడీస్‌లో టాపర్‌, ఆ హీరోయిన్‌తో ఒకే రూమ్‌లో.. రాశీ ఖన్నా గురించి ఎవరికీ తెలియని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్!

First Published | Nov 30, 2022, 3:08 PM IST

గ్లామర్ బ్యూటీ రాశీ ఖన్నా (Raashi Khanna) పుట్టిన రోజు వేడుకలను వినూత్నంగా జరుపుకుంది. ఈ ప్రత్యేకమైన రోజున రాశీ ఖన్నా గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్  తెలుసుకుందాం.  
 

టాలీవుడ్ హీరోయిన్ గా ఢిల్లీ బ్యూటీ రాశీ ఖన్నా తెలుగు ఆడియెన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. హిట్టు.. ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తూ వస్తోంది. విభిన్న కథలతో ఆడియెన్స్ ను ఆకట్టుకుంటున్న ఈ యంగ్ బ్యూటీకి ఈరోజు చాలా ప్రత్యేకం.

ఎందుకంటే.. రాశీ ఖన్నా పుట్టిన 31 ఏండ్లు గడిచిపోయాయి. నేటితో  32వ ఏట అడుగుపెట్టింది. ఈరోజు రాశీ ఖన్నా పుట్టిన రోజు కావడంతో అభిమానులు, స్టార్స్ ఆమెకు బెస్ట్ విషెస్ తెలుపుతున్నారు. మరోవైపు రాశీ ఖన్నా కూడా పుట్టిన రోజు వేడుకలను వినూత్నంగా జరుపుకోవడం ఆసక్తికరంగా మారింది. 


సాధారణంగా.. హీరోహీరోయిన్లు తమ పుట్టిన రోజు సెలబ్రేషన్స్ ను ఫారేన్ లోనూ.. పెద్ద పెద్ద రిస్టార్ట్స్, హోటల్లో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ రాశీ ఖన్నా మాత్రం సింపుల్ గా జరుపుకుంది. తన పుట్టిన రోజు కావడంతో ఇంట్లోని గార్డెన్ లో ఓ మొక్కను నాటి సెలబ్రేట్ చేసుకుంది. అదేవిధంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి విజయవంత చేసింది.
 

రెడ్ చుడీదార్ లో ట్రెడిషనల్ గా కనువిందు చేస్తూ.. మొక్కను నాటి నీరు పోసింది. ఈ సందర్భంగా దిగిన ఫొటోలను తన అభిమానులతో పంచుకుంది. పిక్స్ షేర్ చేస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కూడా చేసింది. ‘పుట్టినరోజును సంప్రదాయంగా జరుపుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది’ అంటూ పేర్కొంది. మొక్కను నాటి పలువురి స్ఫూర్తినివ్వడంతో నెటిజన్లు హర్షిస్తున్నారు. 
 

అయితే,  రాశీ ఖన్నా పుట్టిన రోజు సందర్భంగా ఎవరికీ తెలియని  కొన్నిఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ను తెలుసుకుందాం. రాశీ చదువులో చాలా క్లెవర్.  12 స్టాండెడ్ లో టాపర్ గా నిలిచింది. అప్పటి నుంచే అడ్వర్టైజ్ మెంట్ ఇండస్ట్రీలో రాణించాలని బాగా ప్రయత్నించింది. బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ లో డిగ్రీ పట్టా పొందిన రాశీ ఖన్నా.. ఆ తర్వాత యాడ్ ఫిల్మ్స్ కు కాపీ రైటర్ గా పనిచేసింది. 
 

ఈ క్రమంలో ముంబైకి చేరిన రాశీ చాలా ప్రయత్నాలు చేసింది. ఈ సమయంలో బాలీవుడ్ స్టార్ బ్యూటీ వాణీ కపూర్, రాశీ ఖన్నా ఒకే రూమ్ లో ఉండేవారంట. యాక్ట్రెస్ గా ఎదిగేందుకు వారు చేసిన ప్రయత్నాలతో ఒకే ఏడాది (2013లో) ఇద్దరూ హీరోయిన్లుగా అవకాశాలు అందుకుని బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. రాశీకి నచ్చిన హీరోయిన్లు మధూరి దీక్షిత్ మరియు ప్రియాంక చోప్రా కావడం విశేషం.
 

రాశీ ఖన్నాకు నటనా స్ఫూర్తినిచ్చింది మాత్రం ఇద్దరు స్టార్స్. వారే బాలీవుడ్ స్టార్ హీరోలు షారుఖ్ ఖాన్ మరియు రన్బీర్ కపూర్. నటనలోనే కాకుండా.. వీరిద్దరూ ఆమె ఫెవరేట్ హీరోలు కూడానూ. ఒక ఇంటర్వ్యూలో.. షారుఖ్ ఖాన్ సినిమాలో ఎలాంటి ఛాన్స్ వచ్చిన  చేస్తానని.. అప్పటికే తన చేతిలో ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నా వదులుకునేందుకు సందేహించనని కూడా చెప్పింది. దీంతో షారుఖ్ అంటే ఎంత అభిమానంతో అర్థం అవుతోంది.
 

ప్రస్తుతం రాశీ కేరీర్ గ్రాఫ్ పర్లేదనేలా ఉంది. బాలీవుడ్ ఫిల్మ్ ‘మద్రాస్ కేఫ్’ వెండితెరకు పరిచయం అయినా ఈ బ్యూటీ.. కొన్నేండ్ల పాటు తెలుగులోనే బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటించింది. పెద్దగా సక్సెస్ లేకపోవడంతో.. ప్రస్తుతం మళ్లీ హిందీ సినిమాల వైపు చూస్తోంది. చివరిగా తమిళం చిత్రాలు ‘తిరుచిత్రంబలం’,‘సర్దార్’తో మంచి సక్సెస్ అందుకుంది. హిందీలో రూపొందుతున్న ‘యోదా’ మూవీ, ‘ఫర్జీ’ వెబ్ సిరీస్ లో నటిస్తోంది. 

Latest Videos

click me!