ప్రభాస్‌కి ఉన్న పాన్ ఇండియా క్రేజ్ నేపథ్యంలో నెటిజన్స్ ఆయన ఖాతాను భారీ ఎత్తున ఫాలో అవుతూంటారు. అయితే రేర్‌గా మాత్రమే ప్రభాస్ నుంచి పోస్ట్‌లు వస్తూ ఉంటాయి. ఆ పోస్ట్‌లు కూడా ప్రభాస్ కాకుండా ఆయన టీం మెంబర్స్ వేస్తారని నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ చెప్పుకొచ్చారు.
సోషల్ మీడియా అంటే పెద్దగా నచ్చని వ్యక్తి ప్రభాస్ అని, ఆయనకు ఎప్పుడూ మొబైల్‌కి దూరంగా ఉండాలి అనుకుంటారు. ఆయనకు సంతోషాన్ని ఇచ్చేవి చాలా చిన్న చిన్న విషయాలు. వాటిని వెతుక్కుంటూ ఉంటాడని పృథ్వీరాజ్ సుకుమారన్ చెప్పుకొచ్చారు.