#Thandel ‘తండేల్’ థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరిగినట్లు తెలుస్తోంది. గీతా ఆర్ట్స్ కాంపౌండ్ నుంచి వస్తున్న సినిమా కావడం, అలాగే బన్నీ వాస్ నిర్మిస్తున్నారు కాబట్టి మార్కెట్ లో సినిమాకు మంచి డిమాండ్ ఉంది.
నాగ చైతన్య సాయి పల్లవి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన తండేల్ సినిమా మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సినిమాలోని సాంగ్స్ హిట్ కాగా ట్రైలర్ కూడా ఎక్సపెక్టేషన్స్ పెంచేసింది.
నాగ చైతన్య కెరీర్ బెస్ట్ మూవీగా చెప్పుకుంటున్న తండేల్ బిజినెస్ విషయంలో కూడా అదరగొట్టేసిందనే వినికిడి. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో అల్లు అరవింద్ సమర్పించిన ఈ సినిమాను బన్నీ వాసు నిర్మించారు. ఈ చిత్రం ప్రి రిలీజ్ బిజినెస్ ఎంత జరిగింది, ఎంత వస్తే బ్రేక్ ఈవెన్ ..లెక్కలు చూద్దాం.
23
‘తండేల్’పై భారీ అంచనాలు ఉండటంతో నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో ఈ సినిమా పెద్ద మొత్తంలో ఆదాయం రాబట్టింది. సినిమా నెట్‌ఫ్లిక్స్ నుంచి రూ.35 కోట్లు, ఆడియో రైట్స్ రూపంలో రూ.7 కోట్లు, హిందీ డబ్బింగ్ హక్కుల ద్వారా రూ.8 కోట్లు, శాటిలైట్ హక్కుల ద్వారా రూ.10 కోట్లు రాబట్టినట్లు వినికిడి. మొత్తంగా నాన్-థియేట్రికల్ డీల్ రూ.60 కోట్లకు పైగా జరిగింది.
33
Naga Cahitanya starrer Thandel film song out
మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, ‘తండేల్’ థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరిగినట్లు తెలుస్తోంది. తెలుగు రెండు రాష్ట్రాలు కలిపి మొత్తం తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ బిజినెస్ రూ.27.5 కోట్లు బిజినెస జరిగిందని చెప్తున్నరు. దాంతో ప్రపంచవ్యాప్తంగా సినిమా థియేట్రికల్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ దాదాపు రూ.40 కోట్లుగా ఫిక్సైంది. ఫిబ్రవరి 7న సినిమా గ్రాండ్ రిలీజ్ కానుంది.