‘సలార్ 2’కు ప్రశాంత్ నీల్ కొత్త స్ట్రాటజీ, తక్కువ పెట్టుబడి, నో బాడీ డబుల్..

Published : May 19, 2024, 01:01 PM IST

‘‘సలార్‌2’ (Salaar 2) శౌర్యంగపర్వం పేరుతో సెట్స్‌ పైకి వెళ్లేందుకు సిద్ధంగా ఉంది. ఈనెల చివర్లో షూటింగ్‌ ప్రారంభం కానుంది. ‘

PREV
112
  ‘సలార్ 2’కు ప్రశాంత్ నీల్ కొత్త స్ట్రాటజీ, తక్కువ పెట్టుబడి, నో బాడీ డబుల్..

ప్రభాస్‌ (Prabhas)హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్‌ ‘సలార్‌’. రెండు భాగాలుగా వస్తున్న ఈ సినిమా ‘సలార్‌: పార్ట్‌-1 సీజ్‌ ఫైర్‌’ గతేడాది విడుదలై బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఆ చిత్రానికి కొనసాగింపుగా ‘సలార్‌: శౌర్యంగపర్వం’ ఉంటుందని సినిమా చివరిలో ప్రకటించారు. 
 

212

ఈ క్రమంలో  రెండో భాగం ఎప్పుడు మొదలవుతుందా? అని ఎదురుచూస్తున్నారు  డార్లింగ్‌ అభిమానులు. తాజాగా ఈ చిత్రానికి సంభందించిన అప్డేట్ అందింది.  పార్ట్‌-2కు సంబంధించిన కీలక స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తయిందట.  ఈ నెలాఖరులో  షూటింగ్‌ మొదలుపెడుతున్నట్లు చిత్ర వర్గాల సమాచారం. అయితే అందుకోసం ప్రత్యేకమైన స్ట్రాటజీని వర్కవుట్ చేసారట ప్రశాంత్ నీల్. 

312

సలార్ 2 సినిమా సూపర్ హిట్ అయినా అనుకున్న స్దాయిలో రెవిన్యూ రాలేదని ఆంధ్రాలో చాలా ప్రాంతాల్లో సెటిల్మెంట్స్ చేసారని తెలిసిందే. దాంతో ఈ సారి ఆ సమస్య ఎదురుకాకుండా మొదటనుంచి జాగ్రత్తలు తీసుకోబోతన్నారు. అందరూ అనుకున్నట్లుగా ఈ సినిమాకు భారీ  బడ్జెట్ ని నిర్మాత విజయ్ కిరంగదూర్ పెట్టడం లేదట. మామూలు రెగ్యులర్ యాక్షన్ సినిమాకు పెట్టే బడ్జెట్ తో ఈ సినిమాని నీల్ ముగించనున్నారట.

412

అందుకోసం మొదట స్ట్రిక్ట్ గా ఐదు నెలల్లో మొత్తం ప్రొడక్షన్‌ను పూర్తి చేయాలని ప్రశాంత్ నీల్ లక్ష్యంగా పెట్టుకున్నాడు.  ఏప్రియల్ 2025న ఎట్టిపరిస్దితుల్లో సినిమా రిలీజ్ చేయాలనే టార్గెట్ ఫిక్స్ చేసారు. అలాగే ఈ సారి ఈ సినిమాలో ప్రభాస్, శృతిహాసన్ కు మధ్య రొమాంటిక్ డ్యూయట్ పెట్టబోతున్నారు. అవకాసం ఉంటే సెకండాఫ్ లో ఓ స్పెషల్ సాంగ్ కూడా ఉండవచ్చు. ఎందుకంటే మొదటి పార్ట్ లో రొమాన్స్ పార్ట్ మిస్సైందని ఆ మేరకు తన అభిమానులు చాలా మంది తగ్గారని ప్రభాస్ అభిప్రాయపడ్డారట.
 

512

అలాగే ఈ సినిమాలో ప్రభాస్ మాగ్జిమం బాడీ డబుల్ వాడకుండా చూస్తారట. యాక్షన్ స్టంట్స్ తనే స్వయంగా చేస్తానని ప్రభాస్ చెప్పారట. ఇంతకు ముందు మోకాలి ఆపరేషన్ కాబట్టి చేయలేకపోయాను కానీ ఈ సారి ఆ సమస్య రాదని హామీ ఇచ్చారట. దాంతో చాలా ఉత్సాహంగా ఈ సెకండ్ పార్ట్ లో ప్రభాస్ సీన్స్ ఉండబోతున్నాయని అంటున్నారు.

612
Salaar 2

ఇక ప్లాట్ ట్విస్ట్ లు సైతం గేమ్ ఆఫ్ థ్రోన్స్ స్దాయిలో ఉంటాయట. సెకండ్ పార్ట్ లో మొత్తం కథ ఉండబోతుందని చెప్తున్నారు. అవే హైలెట్ గా ఉంటాయని పృద్వీరాజ్, ప్రభాస్ మధ్య సీన్స్ అసలు ఊహించని చెప్తున్నారు. ఇక పృధ్వీరాజ్ కు ప్రభాస్ కు మధ్య అసలు గొడవ ఎందుకు మొదలైందనేది ఈ సినిమాని నిలబెట్టే ఎలిమెంట్ అంటున్నారు. 
 

712

‘సీజ్‌ ఫైర్‌’ భారీ విజయాన్ని అందుకున్న నేపథ్యంలో ప్రశాంత్‌ నీల్‌, ఆయన టీమ్‌ మొదట అనుకున్న స్క్రిప్ట్‌నకు మరిన్ని మెరుగులు దిద్ది ‘శౌర్యంగపర్వం’ సిద్ధం చేశారు. ఈ షెడ్యూల్‌ కోసం హైదరాబాద్‌లో ప్రత్యేక సెట్‌ను తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. ఈ నెల చివరి వారం నుంచి 10 రోజుల పాటు జరిగే షూట్‌లో ప్రభాస్‌, పృథ్వీరాజ్‌లు పాల్గొంటారని టాలీవుడ్ టాక్‌. ఈ ఏడాది చివరికి మేజర్‌ షెడ్యూల్‌ను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 
 

812

ముఖ్యంగా ప్రభాస్‌కున్న వేరే మూవీ కమిట్‌మెంట్స్‌ నేపథ్యంలో ఆయన పార్ట్‌కు సంబంధించిన సన్నివేశాలను మొదట తీయాలని చిత్ర బృందం భావిస్తోంది. ఆ తర్వాత 2025 మొదటి అర్ధభాగంలో మొత్తం షూట్‌ పూర్తి చేయడంతో పాటు, వీఎఫ్‌ఎక్స్‌ పనులను కూడా పూర్తి చేయనున్నారు. వచ్చే ఏడాది చివరికి మూవీని తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

912

‘హైదరాబాద్‌లో జరిగే షూట్‌లో ప్రశాంత్‌ నీల్‌ కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. అలాగే బెంగళూరు నగర శివార్లలోనూ కొన్ని సీన్లు తీస్తారు. ‘సలార్‌-2’లో ప్రభాస్‌, పృథ్వీరాజ్‌ మధ్య అసలైన సంఘర్షణ మొదలవుతుంది. ఖాన్సార్‌ కుర్చీ కోసం జరిగే రాజకీయాలు, మలుపులు, యాక్షన్‌ మొదటిభాగాన్ని మించి ఉంటాయి. తెరపై మరోసారి సరికొత్త ప్రపంచాన్ని ప్రేక్షకులు ఆస్వాదిస్తారు’ అని చిత్రవర్గాలు తెలిపాయి. శ్రుతిహాసన్‌, జగపతిబాబు, బాబీసింహా, శ్రియారెడ్డి, బ్రహ్మాజీ, షఫీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.   

1012

ఇక సలార్ 2 ముందుకు వచ్చిందనే విషయాన్ని  నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ దీనిపై అప్‌డేట్‌ తో అఫీషియల్ గా బయిటకు వచ్చింది. ‘నేను ప్రభాస్‌ మంచి స్నేహితులం. ఎప్పుడూ ఒకరితో ఒకరం మాట్లాడుకుంటూ టచ్‌లో ఉంటాం. సలార్‌ రెండో భాగం షూటింగ్‌ అతి త్వరలోనే ప్రారభం కానుంది’ అని చెప్పారు. ఇటీవల నటుడు బాబీసింహా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సలార్‌ పార్ట్‌2 కథ సిద్ధంగా ఉందని..  చిత్రీకరణను ప్రారంభించాలని భావిస్తున్నట్లు చెప్పారు. 

1112

  సలార్ కు పనిచేసిన టీమే సలార్ 2 కు కూడా చేయనుంది.  చిత్రాన్ని హెంబాలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరంగదూర్ నిర్మించారు. ఈ మూవీకి రవి బస్రూర్ సంగీతం అందించారు. భువన్ గౌడ సినిమాటోగ్రఫీ చేసిన ఈ చిత్రానికి ఉజ్వల్ కులకర్ణి ఎడిటింగ్ చేశారు.

1212

 మరో ప్రక్క ప్రభాస్ వరస సినిమాలతో బిజీగా ఉన్నారు. 24 గంటలు వర్క్ చేస్తున్నారు.ప్రభాస్‌ ప్రస్తుతం ‘కల్కి 2898 ఏడీ’లో నటిస్తున్నారు.   దీనితో పాటు మారుతి దర్శకత్వంలో ‘రాజా సాబ్‌’ (Raja Saab)లోనూ ప్రభాస్ నటిస్తోన్నారు. రొమాంటిక్‌ హారర్‌ కామెడీ నేపథ్యంలో ఇది తెరకెక్కుతోంది.
   

Read more Photos on
click me!

Recommended Stories