నితిన్ ‘రాబిన్‌హుడ్‌’ : ప్రీ రిలీజ్ బిజినెస్, ఎంతొస్తే ఒడ్డున పడతారు?!

Published : Mar 17, 2025, 05:54 AM IST

Nithin Robinhood:  నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన ‘రాబిన్‌ హుడ్‌’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి, మరియు ఈ సినిమా వరల్డ్ వైడ్ థియేటర్ రైట్స్ 30 కోట్లు పలుకుతున్నట్లు సమాచారం.

PREV
13
నితిన్ ‘రాబిన్‌హుడ్‌’ : ప్రీ రిలీజ్ బిజినెస్, ఎంతొస్తే ఒడ్డున పడతారు?!
Nithin Robinhood theatrical business and breakeven details in telugu


Nithin Robinhood:  నితిన్‌ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాబిన్‌ హుడ్‌’(Robinhood). మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. నితిన్‌ కెరీర్‌లో అత్యంత భారీ బడ్జెట్‌ మూవీగా ఇది రానుంది.  ‘రాబిన్‌హుడ్‌’ ఈ నెల 28న వస్తుంది. ఇప్పటికే  విడుదలైన టీజర్‌, పాటలు మంచి ఆదరణను సొంతం చేసుకున్నాయి.

నితిన్‌ (Nithiin) - వెంకీ కుడుముల కాంబోలో రానున్న రెండో చిత్రమిది. ఈ కాంబోలో భీష్మ వంటి హిట్ ఉండటంతో సినిమాపై మంచి ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. అలాగే ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్.  శ్రీలీలతో కలిసి రెండోసారి నటించడం ఆనందంగా ఉందని.. ఈ సినిమా తర్వాత మాది హిట్ జోడీ అవుతుందని నితిన్‌ తెలిపారు.

ఈ నేపధ్యంలో ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ ఊపందుకుంది. ఈ సినిమా బేరసారాలు జరుగుతున్నాయి. ఈ చిత్రం వరల్డ్ వైడ్  థియేటర్ రైట్స్ 30 కోట్లు వరకూ  పలుకుతున్నట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. 

23
Nithin Robinhood theatrical business and breakeven details in telugu


‘రాబిన్‌ హుడ్‌’ కోస్టర్ ఏపి బిజినెస్ 12 కోట్లు దాకా పలుకుతోందని వినికిడి. ఇక సీడెడ్ రైట్స్  3.6 కోట్లు దాకా చెప్తున్నారు. రేట్లు ఎక్కువ చెప్పటం లేదని, రీజనబుల్ గానే ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తున్నారని అంటున్నారు.

అయితే  నితిన్ కెరీర్ లో లో ఉండటం వల్ల కాస్త తక్కువకే అడుగుతున్నారు. ఓవరాల్ గా వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ 30 కోట్లు దాకా పలుకుతుందని, బ్రేక్ ఈవెన్ రావాలంటే 35 కోట్లు షేర్  కలెక్ట్ చేస్తే సరిపోతుందని లెక్కలు వేస్తున్నారు.  నితిన్ ఈ సినిమాతో 100 కోట్ల క్లబ్ లోకి వెళ్తాడంటున్నారు.
 

33
Nithin Robinhood theatrical business and breakeven details in telugu


అలాగే ఈ సినిమాకి నితిన్ కెరియర్ లోనే అత్యంత హైయెస్ట్ నాన్ దియేట్రికల్ బిజినెస్ జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా ఓటీటీ రైట్స్ జీ ఫైవ్ సంస్థ కొనుగోలు చేయగా శాటిలైట్ రైట్స్ జీ తెలుగు కొనుగోలు చేసింది.

నితిన్ కెరీర్ లోనే అత్యంత భారీ రేటుకు ఈ హక్కులు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. కేవలం ఇవి తెలుగు భాషకు చెందిన హక్కుల మాత్రమే. ఇంకా హిందీ డబ్బింగ్ రైట్స్ తో పాటు ఇతర భాషల డబ్బింగ్ రైట్స్ కూడా నిర్మాత దగ్గరే ఉన్నాయని చెబుతున్నారు. 
 

Read more Photos on
click me!

Recommended Stories