Pooja Hegde: షాకింగ్, అలాంటి పాత్రలో పూజ హెగ్డే !?

Published : Feb 26, 2025, 03:48 PM IST

 Pooja Hegde: ఈ పాత్ర ఆమెకి ఛాలెంజ్ అని కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది.ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్స్‌ జరుగుతున్నాయి. నవంబరులో చిత్రీకరణ ప్రారంభించి, వచ్చే ఏడాది వేసవిలో సినిమాని రిలీజ్‌ చేయాలను కుంటున్నారు. 

PREV
13
 Pooja Hegde: షాకింగ్, అలాంటి  పాత్రలో  పూజ హెగ్డే !?
Pooja Hegde Playing A Challenging Deaf Character in telugu


Pooja Hegde టాలీవుడ్‌ బుట్టబొమ్మ పూజా హెగ్డే ఆ మధ్యన వరస ఫ్లాఫ్ లతో గ్యాప్ వచ్చింది కానీ ఇప్పుడు మళ్లీ బిజీ అవుతోంది. ప్రస్తుతం తమిళ, హిందీ సినిమాలతో బిజీగా ఉంది. ఇటీవలే దేవా మూవీలో షాహిద్ కపూర్ సరసన కనిపించిన ఆమెకు మంచి మార్కులే పడ్డాయి.  

ఇప్పుడు ఆమె  సూర్య సరసన “రెట్రో” చిత్రంలో డిగ్లామ్ రోల్ చేస్తోంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ ని బట్టి ఆమె ఆ చిత్రంలో  సగటు మిడిల్ క్లాస్ అమ్మాయి పాత్రలో మెప్పించబోతోందని అర్దమవుతోంది. ఇక ఒక కొత్త సినిమాలో ఆమె మూగమ్మాయిగా కనిపించనుందని సమాచారం. ఆ సినిమా ఏమిటి

23
Pooja Hegde Playing A Challenging Deaf Character in telugu


ఆ సినిమా మరేదో కాదు  “కాంచన 4′. రాఘవ లారెన్స్ వరసపెట్టి  కాంచన సినిమాలు తీస్తూ వస్తున్నారు. మళ్ళీ అదే సిరీస్ లో నాలుగో సినిమా తీస్తున్నాడు. ఈ “కాంచన 4′ పూజా హెగ్డేకి ప్రధాన పాత్ర దక్కింది.

ఇందులోనే ఆమె మూగ, చెవిటి యువతిగా కనిపిస్తుందట. ఈ పాత్ర ఆమెకి ఛాలెంజ్ అని కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది.ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్స్‌ జరుగుతున్నాయి. నవంబరులో చిత్రీకరణ ప్రారంభించి, వచ్చే ఏడాది వేసవిలో సినిమాని రిలీజ్‌ చేయాలను కుంటున్నారు. 
 

33
Pooja Hegde Playing A Challenging Deaf Character in telugu


రాఘవా లారెన్స్‌ హీరోగా రమేశ్‌ వర్మ దర్శకత్వంలో ఓ యాక్షన్‌ అడ్వెంచరస్‌ మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ఎ స్టూడియోస్‌ ఎల్‌ఎల్‌పీ, నీలాద్రి  ప్రొడక్షన్స్, హవీష్‌ ప్రొడక్షన్స్‌పై కోనేరు సత్యానారాయణ నిర్మించనున్నారు.

ఈ సినిమాలోని హీరోయిన్‌ పాత్రకు కీర్తీ సురేష్, పూజా హెగ్డే, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ వంటి వార్ల పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే పూజా హెగ్డే కన్ఫార్మ్‌ అయ్యింది.  ప్రస్తుతం పూజ హెగ్డే తమిళంలో “రెట్రో” (మే 1న విడుదల), విజయ్ సరసన “జన నాయగన్”, “కాంచన 4” చిత్రాలు చేస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories