Dragon: ప్రదీప్ రంగనాథన్ నటించిన డ్రాగన్స్ మూవీ కలెక్షన్స్ వివరాలను నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. మొదటి వారాంతంలో సినిమా సాధించిన వసూళ్లను నిర్మాత అర్చన కలపతి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
Dragon: సినిమా రిలీజ్ అయ్యిన తర్వాత కలెక్షన్స్ రివీల్ చేస్తూ పోస్టర్స్ రెగ్యులర్ గా నిర్మాతలు వేస్తూంటారు. అయితే ఆ పోస్టర్స్ లో తప్పుడు కలెక్షన్స్ ఉంటున్నాయంటూ , కావాలని ఎక్కువ కలెక్షన్స్ వేసి చూపిస్తున్నారని వివాదాలు నడుస్తున్నాయి. దిల్ రాజు వంటి నిర్మాత కూడా అది నిజమే అని ఒప్పుకున్నారు.
అది సినిమా ప్రమోషన్స్ లో భాగమే సీరియస్ గా పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. ఈ నేపధ్యంలో ఓ డబ్బింగ్ చిత్రంగా ఈ వారం రిలీజైన ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’కలెక్షన్స్ ని నిర్మాత స్వయంగా ప్రకటించటం మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ మేరకు #Dragon opening weekend కలెక్షన్స్ అని ట్విట్టర్ లో కలెక్షన్స్ ప్రకటిస్తూ పోస్టర్స్ షేర్ చేసారు నిర్మాత అర్చన కలపతి.
‘లవ్ టుడే’తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటుడు ప్రదీప్ రంగనాథన్. ఇప్పుడు ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) పక్కింటి కుర్రాడిని గుర్తు చేస్తాడు. అతనికి తగ్గ పాత్ర డ్రాగన్.
అల్లరి కుర్రాడిగా తనదైన శైలిలో సందడి చేస్తూనే, క్లైమాక్స్ సీన్ లో ఎమోషన్స్ ని పంచాడు.అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ కు మార్నింగ్ షో నుంచే మంచి టాక్ వచ్చింది. (Return of the dragon) యూత్ కి బాగా కనెక్ట్ అయ్యే కథ ఇది. ఫస్టాఫ్ లో అల్లరి కుర్రాడిగా హీరో చేసిన సందడితో సాగుతుంది.అవి కొత్త సీన్స్ కాకపోయినా ప్రదీప్ వాటిని తనదైన శైలిలో చేసి మెప్పించాడు. సెకండాఫ్ లో వచ్చే మలుపులు ఆకట్టుకున్నా, కొన్ని సన్నివేశాలు అతిశయోక్తిగా అనిపించినా సినిమా పాసైపోయింది.