Vidaamuyarchi: అజిత్‌ ‘పట్టుదల’OTT రిలీజ్ డేట్

Published : Feb 25, 2025, 06:17 AM IST

  Vidaamuyarchi: అజిత్ కుమార్, త్రిష నటించిన విదాముయార్చి చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు సిద్ధంగా ఉంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం  ఓటిటిలో  తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి తీసుకురాబోతున్నారు.

PREV
13
  Vidaamuyarchi: అజిత్‌  ‘పట్టుదల’OTT రిలీజ్ డేట్
Ajith Vidaamuyarchi locks its OTT release date in telugu


అజిత్‌ కుమార్, త్రిష ప్రధాన పాత్రల్లో నటించిన  యాక్షన్‌ థ్రిల్లర్‌ ఫిల్మ్‌ ‘విదాముయార్చి’ (Vidaamuyarchi). తెలుగులో ‘పట్టుదల’ (Pattudala Movie) పేరుతో  బాక్సాఫీసు ముందుకొచ్చిన సంగతి తెలిసిందే.  యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో  తమిళ దర్శకుడు మగిళ్‌ తిరుమేని తెరకెక్కించిన ఈ సినిమా ఈ నెల 6న విడుదలైంది

 

23
Ajith Vidaamuyarchi locks its OTT release date in telugu

 

. తమిళ  బాక్సాఫీసు వద్ద ఓకే అనిపించుకున్న ఈ చిత్రం తెలుగులో మాత్రం అసలు వర్కవుట్ కాలేదు.  తాజాగా ఈ చిత్రం ఓటీటీ వేదికగా విడుదలకి రెడీ అయ్యింది. ఈ విషయాన్ని   తెలుపుతూ సోషల్ మీడియాలో షేర్ చేసింది చిత్రం టీమ్.  ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా మార్చి 3నుంచి తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్‌ కానుందని తెలిపింది చిత్ర టీమ్.  

థియేటర్ లో నెగిటివ్ టాక్ రావటంతో చాలా మంది ఈ సినిమాని ఓటిటిలో చూద్దమనుకుంటున్నారు. దాంతో ఈ సినిమా అక్కడ మంచి సక్సెస్ అవుతుందని టీమ్ భావిస్తోంది. ఈ మధ్యకాలంలో ఇదో కొత్త ట్రెండ్ గా మారింది. ఓటిటిలోనో లేదా థియేటర్ లోనే ఒక చోటే పెద్ద హిట్ అవుతున్నాయి సినిమాలు. 

33
Ajith Vidaamuyarchi locks its OTT release date in telugu


ఇక ఈ చిత్రం కథ విషయానికి వస్తే..  అజర్‌బైజాన్‌లోని ఓ అమెరికన్ కంపెనీలో ఉన్నతోద్యోగిగా ప‌నిచేస్తుంటాడు అర్జున్ (అజిత్‌). ఆయ‌న భార్య కాయ‌ల్ (త్రిష). ప్రేమించి పెళ్లి చేసుకున్న వారు ప‌న్నెండేళ్లు అన్యోన్యంగా జీవిస్తారు. ఆ త‌ర్వాత వారి వైవాహిక బంధంలో మనస్పర్థలు చోటుచేసుకుంటాయి. దాంతో, అర్జున్ నుంచి విడిపోవాల‌నే నిర్ణయానికొస్తుంది కాయ‌ల్‌. త‌న త‌ల్లిదండ్రుల ఇంటికి వెళ్లే ప్రయ‌త్నంలో ఉన్న ఆమెని...  తానే కారులో తీసుకువెళతానని, అది ఇద్దరికీ గుర్తుండిపోయే ఆఖ‌రి ప్ర‌యాణంలా ఉంటుంద‌ని చెబుతాడు అర్జున్‌. 

అందుకు కాయ‌ల్ ఓకే చెబుతుంది. అలా మొద‌లైన ఆ ఇద్దరి ప్రయాణంలో అనుకోని అవాంత‌రాలు ఎదుర‌వుతాయి. ఆ త‌ర్వాత కాయ‌ల్ క‌నిపించ‌కుండా పోతుంది. ఇంత‌కీ కాయ‌ల్ ఏమైంది? ఆమెని వెదుక్కుంటూ వెళ్లిన అర్జున్‌ ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నాడు? దారి మ‌ధ్య‌లో తెలుగువారిగా ప‌రిచయ‌మైన ర‌క్షిత్ (అర్జున్‌), దీపిక (రెజీనా)కీ - అర్జున్‌, కాయ‌ల్‌కీ  సంబంధం ఏమిట‌న్నది మిగతా కథ.

Read more Photos on
click me!

Recommended Stories