
సినిమా పరిశ్రమలో నిలదొక్కుకోవటం అనుకున్నంత ఈజీకాదు. ముఖ్యంగా నటులు గా అయితే ఎంతో పోటీ ఉంటుంది. సిని పరిశ్రమలో మన వాళ్లు ఎవరు లేనప్పుడు వేషాలు దొరకవు. అలా సినిమా ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి నిలబడాలంటే చాలా కష్టం. ఎన్నో కష్టాలు పడాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వేరే దారి లేక రకరకాల పనలుు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత తాము ఎంచుకున్న రంగంలో ఎదిగినా ఆ పాత నీడలు వెంటాడుతూనే ఉంటాయి. అలా పంచాయిత్ నటుడు కెరీర్ ప్రారంభంలో కొన్ని కష్టాలు పడ్డాను అని చెప్తున్నారు.
పంచాయత్ వెబ్ సిరీస్‍లో తొలి రెండు సీజన్లు చాలా సక్సెస్ అయ్యాయి. దాంతో మూడో సిరీస్‍కు అదిరిపోయే క్రేజ్ వచ్చింది. దాంతో రెండేళ్ల గ్యాప్ తర్వాత పంచాయత్ మూడో సీజన్ కు ఓ రేంజి రెస్పాన్స్ వస్తోంది. భారీ వ్యూస్ సాధిస్తూ దూసుకుపోతోంది. అంచాలను నిలబెట్టుకుంటూ అనుకున్నట్టే పంచాయత్ సీజన్ 3 కూడా సక్సెస్ అయింది. ఈ మూడో సీజన్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో టాప్‍లో ట్రెండ్ అవుతోంది. ఈ క్రమంలో పంచాయిత్ వెబ్ సీరిస్ ఫేమ్ దుర్గేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ తన కెరీర్ మొదటి రోజులు గుర్తు చేసుకున్నారు.
'పంచాయత్' వెబ్ సిరీస్‌తో బోలెడంత ఫేమ్ సొంతం చేసుకున్న దుర్గేశ్ కుమార్‌ది కూడా ఇలాంటి కథే. నటుడిగా నిలదొక్కుకునే క్రమంలోనే అడల్ట్ ఫిల్మ్స్‌లోనూ నటించానని చెప్పుకొచ్చారు. తనది బీహార్ అని , ఇంజినీరింగ్ చదివానని అన్నారు. అయితే ఇంజినీరింగ్ పూర్తి చేయలేదని, ఎగ్జామ్స్ కష్టం అనిపించి నటన వైపు వచ్చానని అన్నారు.
దుర్గేష్ ఓవైపు నాటకాల్లో నటిస్తూనే డిగ్రీ పూర్తి చేశాడు. 'నేషనల్ డ్రామా స్కూల్'లో యాక్టింగ్ కోర్సు చేశాడు. ఆ తర్వాత 'హైవే' సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చాడు. 'సుల్తాన్', 'ఫ్రీకీ అలీ' లాంటి చిత్రాల్లో నటించాడు కానీ ఇబ్బందులు తప్పలేదు. దీంతో తప్పని పరిస్థితుల్లో డబ్బుల కోసం అడల్ట్ మూవీస్ చేశానని చెప్పుకొచ్చారు.
వరస పెట్టి ఆడిషన్స్ కు వెళ్తూనే ఉండేవాడిని.2016లో నేను ముంబయికి వచ్చాను. కొందరు ఫ్రెండ్స్ అయ్యారు. మేమందరం ఎలాగైనా సరే ఇండస్ట్రీలోకి నిలబడాలనుకున్నాం. కానీ ఛాన్సుల కోసం ప్రతి క్యాస్టింగ్ డైరెక్టర్‌కి దగ్గరకెళ్లి, వాళ్ల కాళ్ల మీద పడ్డాం. చేతులో డబ్బులు ఉండేవి కాదు. చేసేదేమీ కనపడలేదు.
'నటన చేయకపోతే నేను బతకలేదు. దీంతో నాకొచ్చిన ప్రతిదీ చేసుకుంటూ పోయాను. అలానే కొన్ని అడల్ట్ మూవీస్‌లోనూ చేయాల్సి వచ్చింది. ఇదంతా కూడా 'హైవే', 'ఫ్రీకీ అలీ', 'సుల్తాన్' లాంటి సినిమాల్లో నేను నటించిన తర్వాతే జరిగిందంటే మీరు నమ్ముతారా.
కొన్ని సక్సెస్ ఫుల్ సినిమాల్లో యాక్ట్ చేసిన తర్వాత కూడా ఆడిషన్స్‌కి వెళ్లాలంటే ఏదోలా ఉంటుంది. అలా పంచాయత్ మొదటి సీజన్‌లో చిన్న రోల్ చేశాను. రెండున్నర గంటల్లో దీని షూట్ చేశారు' అని దుర్గేశ్ చెప్పుకొచ్చాడు.
అలాగే ఈ నటనా కెరీర్ 11 ఏళ్లలో తాను రెండు సార్లు పూర్తి డిప్రెషన్ లోకి వెళ్లానని అన్నారు. నటుగా నిలబడాలంటే ఫిజికల్ గా, సైక్లాజికల్ గా, మెంటల్ గా,ఎమోషనల్ గా, ఎకనామికల్ గా అన్నిటికి పూర్తి స్దాయి ప్రిపేర్ అయ్యి ఇండస్ట్రీకి రావాలి. అవేమీ లేకుండా కేవలం నటన చేస్తాను అంటే ఇండస్ట్రీకి రావద్దు అని ఆయన అన్నారు.
ఇక్కడ ఇండస్ట్రీ అంతా క్రేజీ పీపుల్ తో నిండిపోయి ఉందని అన్నారు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా లో తన సీనియర్స్ మనోజ్ వాజిపేయి, పంకజ్ త్రిపాఠి ,నవాజుద్దీన్ సిద్దిఖి వీళ్లంతా కూడా క్రేజీ పర్శన్స్ అని , ఎవరూ ఈ విషయాలు చెప్పరని అన్నారు.