‘ఆహా’కు బన్ని వివాదం దెబ్బ , పవన్ ఫ్యాన్స్ స‌భ్య‌త్వాలు ర‌ద్దు?

Published : May 20, 2024, 03:29 PM IST

ప‌వ‌న్ ఫ్యాన్స్ చాలామంది ఇప్పుడు ‘ఆహా’ స‌భ్య‌త్వాన్ని ర‌ద్దు చేసుకొంటున్నట్లు చెప్తున్నారు. 

PREV
111
‘ఆహా’కు బన్ని వివాదం దెబ్బ ,  పవన్ ఫ్యాన్స్ స‌భ్య‌త్వాలు  ర‌ద్దు?

 
ఎక్కడో అంటుకున్న నిప్పు అటు తిరిగి ఇటు తిరిగి మన ఇంటిదాకా వచ్చేస్తే అన్నట్లు తయారైంది ఆహా పరిస్దితి అంటున్నారు.  అల్లు అర్జున్ గురించి ఇండైరక్ట్ గా  నాగబాబు చేసిన ట్వీట్ వల్ల రచ్చ రచ్చ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో  తన అకౌంట్‌ని కొన్నిరోజులు డీయాక్టివేట్ చేసిన నాగబాబు మళ్లీ.. ఆ ట్వీట్ డిలీట్ చేసిన తర్వాతే ట్విట్టర్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు. అయితే ఈ వివాదం  ఇ‍క్కడితో ముగియలేదు అంటున్నారు. ఇప్పుడు ఆ వివాదం ప్రభావం ఆహాపై పడిందని చెప్తున్నారు.
 

211
aLLU ARJUN


 ఎలక్షన్స్ అయ్యిన తర్వాత  నాగబాబు,  బన్నీ గురించి చేసిన ట్వీట్ పెద్ద దూమారమే రేపింది. ఏపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరిరోజు అల్లు అర్జున్ నంద్యాల వెళ్లాడు. వైఎస్సార్‌సీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న తన స్నేహితుడు శిల్పా రవిచంద్రా రెడ్డి కోసం అక్కడికి వెళ్లాడు. దీని గురించి నేరుగా చెప్పకుండా.. 'మనవాడు, పరాయివాడు' అని నాగబాబు ట్వీట్ చేశాడు. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ రెచ్చిపోయారు. సోషల్ మీడియాలో నాగబాబుని ట్రోల్ చేశారు.  ఇప్పుడు ఆ ఎఫెక్ట్ ఆహా దాకా వచ్చిందని తెలుస్తోంది.

311
aLLU ARJUN


ఈ వివాదం లో అల్లు అర్జున్ ముందుకు వచ్చి  వివ‌ర‌ణ ఇచ్చినా , ప‌వ‌న్ అభిమానుల ఆగ్ర‌హం చ‌ల్లార‌లేదు. ఈ  ప్రభావం వచ్చి ‘ఆహా’పై ప‌డుతోంది. ‘ఆహా’ స‌బ్‌స్క్రిప్ష‌న్లు ర‌ద్దు చేసుకోమ‌ని ప‌వ‌న్ అభిమానులు ట్విట్ట‌ర్‌, ఫేస్‌బుక్‌ల‌లో ముమ్మ‌రంగా ప్ర‌చారం చేస్తూండటం మనం గమనించవచ్చు. ఆ పోస్ట్ లు వైరల్ అవుతున్నాయి. 

411


ఇప్పటికే ప‌వ‌న్ ఫ్యాన్స్ చాలామంది ఇప్పుడు ‘ఆహా’ స‌భ్య‌త్వాన్ని ర‌ద్దు చేసుకొంటున్నట్లు చెప్తున్నారు. గత కొద్దిరోజులుగా ‘ఆహా’ చెప్పుకోదగిన స్దితిలో లేదు. మరో ప్రక్క ఆహాని అమ్మేస్తున్నారని,  యాజ‌మాన్యం చేతులు మార‌బోతోంద‌న్న ప్రచారం జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో ఇలా సభ్యత్వాలు రద్దు చేసుకుంటే  మ‌రింత న‌ష్టాన్ని క‌లిగించినట్లు అవుతోంది. 
 

511


ప్రస్తుతం ఓటీటీ హావా నడుస్తోంది. తెలుగు మంచి గుర్తింపు తెచ్చుకున్న ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల్లో ఆహా ఒకటి. 2020లో అర్హా మీడియా, బ్రాడ్‌కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (అల్లు అరవింద్ నేతృత్వంలోని) మై హోమ్ గ్రూప్‌ల మధ్య ఉమ్మడి యాజమాన్యంలోని వెంచర్ ఆహా. తెలుగు సక్సెస్ తర్వాత 2022లో ఆహా తమిళ్ లాంచ్ చేశారు. ప్రస్తుతం డిజిట్‌ ప్లాట్‌ఫారమ్‌లు ఆర్థికంగా కఠినమైన సమయాలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.

611


పెద్ద సంఖ్యలో వీక్షకులు ఉన్నప్పటికీ, కంటెంట్ అధిక ధరల కారణంగా OTT ప్లాట్‌ఫారమ్‌లు పెద్దగా లాభాలను ఆర్జించలేకపోతున్నాయి. ఇందులో సినిమాలు, వెబ్ సిరీస్‌లు, కొన్ని ఇతర షోలు ప్రచారం అవుతున్నాయి. ఆహా టీమ్ భారీ వ్యూయర్‌షిప్‌ని పొందడానికి చాలా పెట్టుబడి పెట్టింది. బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షో, అనేక ఇతర షోలను సొంత ప్రొడక్షన్స్‌లో రూపొందించింది.

711

అందులో భాగంగా ఆహాలో ‘అన్ స్టాప‌బుల్’ అనే షో  కోసం ప‌వ‌న్ సైతం వ‌చ్చాడు. సినిమా ఇంట‌ర్వ్యూల‌కూ, ఇలాంటి టాక్ షోల‌కూ దూరంగా ఉండే ప‌వ‌న్‌, కేవ‌లం అల్లు అర‌వింద్ మాట‌పై గౌర‌వంతో ఈ షోలో పాల్గొన్నాడనేది నిజం.  ఆ సమయంలో ‘ఆహా’ స‌భ్య‌త్వాలు బాగా  పెరిగాయి. ఇవన్నీ ఇప్పుడు  బ‌న్నీ అభిమానులు గుర్తు చేస్తున్నారు. అల్లు అర్జున్  ఆ సంగ‌తి కూడా మ‌ర్చిపోయాడ‌న్న‌ది వారి కంప్లైంట్.   

811


నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, డిస్నీ + హాట్‌స్టార్ , జీ5 వంటి పెద్ద ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఇతర మీడియం-బడ్జెట్ చిత్రాలు, భారీ-బడ్జెట్ చిత్రాలను ప్రసారం చేస్తున్నాయి. ఆహా కేవలం చిన్న చిత్రాలకు మాత్రమే పరిమితం చేస్తుంది. ఇది కాకుండా ఇతర OTT ప్లాట్‌ఫారమ్‌లతో పోలిస్తే Aha సబ్‌స్క్రిప్షన్ ధర చాలా తక్కువగా ఉంటుంది. పెద్దగా రిస్క్ తీసుకోలేక, లాభాలు ఆర్జించలేకపోతున్నారని సమాచారం. ఈ పరిమితుల కారణంగా, టీమ్ ఇప్పుడు ఓటిటి‌ను విక్రయించాలనే ఆలోచిస్తున్నరట. సోనీ నెట్‌వర్క్, సన్ నెట్‌వర్క్ , కొంతమంది దిగ్గజ విక్రేతలతో చర్చలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.  
 

911

అప్పటికీ  ఆహా.. సరికొత్త కాన్సెప్ట్ ను తీసుకొచ్చింది. సెలబ్రిటీ టాక్ షో లు, సెలబ్రిటీ వంటలు, వెబ్ సిరీస్ లతో దూసుకుపోతున్న ఆహా.. సినిమాపురంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది.  ఆమధ్యన  ఆహా.. తెలుగువారి కొత్త అలవాటు ఇందుకు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు ఆహా మేకర్స్. ఆ వీడియోలో స్వయంగా బన్నీనే సినిమాపురాన్ని ప్రమోట్ చేస్తూ కనిపించాడు. ఓవైపు సినిమాల షూటింగులతో బిజీగా ఉన్న బన్నీ.. మరోవైపు ఆహా ఓటీటీ ప్రమోషన్స్ పనులను కూడా తన భుజాలమీద వేసుకున్నాడు. 
 

1011
Allu Arjun Pawan Kalyan Ram charan


సినీ అభిమానులందరూ ఎంతగానో ఎదురుచూసే సినిమాలను ప్రతి శుక్రవారం ఆహా అందిస్తుందని బన్నీ చెప్పుకొచ్చాడు. ఆహాపురంలో ప్రతి శుక్రవారం .. కొత్త సినిమా..అంటూ బన్నీ ప్రోమోలో కనిపిస్తాడు. ఆహా.. తెలుగువారి కొత్త అలవాటు అంటూ సాగే ఈ ప్రోమో నెట్టింట్లో వైరల్ అయ్యింది. అయితే ఇప్పుడు ఆ క్రెడిబులిటీ మొత్తాన్ని ఎలక్షన్స్ దెబ్బ తీసాయి. 
 

1111
Allu Arjun


త్వరలో పుప్ప 2 చిత్రం రిలీజ్ కాబోతోంది. పవన్ అభిమానులు కొందరు అత్యుత్సాహంతో ఈ సినిమాని   బాయ్ కాట్ చేస్తామని సోషల్ మీడియాలో అంటున్నారు. అయితే విషయం అంత దాకా వెళ్లకపోవచ్చు కానీ కోపం చల్లారకపోతే ఏదైనా జరగచ్చు అనేది నిజం. 

Read more Photos on
click me!

Recommended Stories