ఎన్టీఆర్ ‘దేవర’ ప్రీ రిలీజ్ డిటేల్స్, డేట్- వెన్యూ

First Published | Sep 14, 2024, 9:46 AM IST

ఎన్టీఆర్ ఇప్పటికే నార్త్ ఇండియాలో ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసి బజ్ క్రియేట్ చేసారు. 
 

Ntr Devara pre-release event details jsp


ఎన్టీఆర్‌- దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ యాక్షన్‌ డ్రామా చిత్రం  ‘దేవర’. ఆర్‌ఆర్‌ఆర్‌  తర్వాత తారక్‌ నుంచి వస్తున్న సినిమా కావడంతో అభిమానులు ఎంతగానో ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. 


ఈ సినిమాపై భారీ ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. ఎలాగైనా పెద్ద హిట్ కొట్టాలనే కసితో కొరటాల శివ ఈ సినిమా చేసినట్లు ట్రైలర్ చూసాక క్లారిటీ వచ్చేసింది. ఎన్టీఆర్ ఇప్పటికే నార్త్ ఇండియాలో ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసి బజ్ క్రియేట్ చేసారు. 
 



ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ సినిమా ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే రిలీజ్ సమయానికి దగ్గరలో ప్రీ రిలీజ్ చేసి ప్రమోషన్స్ మొదలెట్టనున్నట్లు తెలుస్తోంది.  మొదట ఈ చిత్రం ప్రీ రిలీజ్ పంక్షన్ ని ఆంధ్రప్రదేశ్ లో ప్లాన్ చేసారు.

కానీ వరదలు, వర్షాల సమస్యలతో హైదరాబాద్ లోనే నిర్వహించాలని దర్శక,నిర్మాతలు భావిస్తున్నారట.  సెప్టెంబర్ 22న ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారని, ఇప్పటికే పర్మిషన్ కోసం అప్లై చేశారని సమాచారం.
 


ఆ  ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే ఈ సినిమా సెకండ్ ట్రైలర్ విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆ ట్రైలర్ తో సినిమా క్రేజ్ నెక్ట్స్ లెవిల్ కు చేరుతుందని అంచనా వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 120 కోట్లు దాకా బిజినెస్ చేసారు.

'జన‌తా గ్యారేజ్' వంటి సూప‌ర్ హిట్‌ త‌ర్వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న మూవీ కావ‌డంతో దీనిపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఆ అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టే ఇప్ప‌టికే విడుద‌లైన 'దేవ‌ర' సాంగ్స్‌, ట్రైల‌ర్, గ్లింప్స్ అభిమానుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంటున్నాయి. 
 

Junior NTR Devara upcoming film update out


ఇక రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ భారీ పాన్‌ ఇండియా మూవీ మొద‌టి పార్టు సెప్టెంబ‌ర్ 27న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కానుంది.

ఇప్ప‌టికే ఓవ‌ర్సీస్ బుకింగ్స్ మొద‌లు కాగా.. 1 మిలియ‌న్‌కు పైగా టికెట్లు బుక్ కావ‌డం విశేషం. త‌ద్వారా నార్త్‌ అమెరికన్‌ బాక్సాఫీస్‌ వద్ద అత్యంత వేగంగా టికెట్ల ప్రీసేల్‌ ద్వారా వన్‌ మిలియన్‌ మార్క్‌ దాటిన సినిమాగా రికార్డుకెక్కింది. 


ఎన్టీఆర్ ఈ సినిమాపై పూర్తి దృష్టి పెట్టారు. ప్యాన్ ఇండియా స్టార్ గా దేవరతో ఎన్టీఆర్ ఎస్టాబ్లిష్ అవ్వాలని భావిస్తున్నారు.

దీన్ని దృష్టిలో పెట్టుకునే నిర్మాతలు సైతం సినిమాని ఎగ్రిసివ్ గా ప్రమోట్ చేస్తున్నారు. సినిమాలో ఉన్న ఎలిమెంట్స్ ని హైలెట్ చేస్తూ ప్రమోషన్ క్యాంపైన్ నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. 
  
 

దేవర మూవీ  తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజ్ కానుంది. అన్ని భాషల కోసం ప్రమోషన్లను జోరుగా చేసేలా మూవీ టీమ్ పక్కా ప్లాన్ వేస్తోందని తెలుస్తోంది.

దేవర చిత్రంలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‍గా నటించారు. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్, బాబీ డియోల్ విలన్లుగా చేశారు. ఈ మూవీలో ప్రకాశ్ రాజ్, షైన్ టామ్ చాకో, శ్రీకాంత్, తారక పొన్నాడ, శృతి మరాథే, మురళీ శర్మ కీలకపాత్రలు పోషించారు.


 రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారని తెలుస్తోంది. సెప్టెంబరు 27న అభిమానుల కోసం తెల్లవారుజామున 1:08 గంటలకు బెన్ ఫిట్ షోస్ వేసేలా మేకర్స్‌ ప్లాన్ చేస్తున్నారని టాక్‌..

ఓవర్సీస్‌లో కూడా ఇదే సమయంలో షో పడనుంది. ఈమేరకు UKలో ఇప్పటికే  దేవర బుకింగ్స్ ఓపెన్ చేశారు. 

Latest Videos

click me!