నాని 'కోర్ట్‌', కిరణ్ 'దిల్‌రూబా' OTT స్ట్రీమింగ్ వివరాలు!

Published : Mar 15, 2025, 07:26 AM IST

Court and Dilruba : నాని నిర్మాతగా వచ్చిన కోర్ట్, కిరణ్ అబ్బవరం నటించిన దిల్ రూబా సినిమాలు ఈ వారం విడుదలయ్యాయి. ఈ రెండు సినిమాల OTT స్ట్రీమింగ్ వివరాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.

PREV
13
నాని   'కోర్ట్‌', కిరణ్  'దిల్‌రూబా'  OTT స్ట్రీమింగ్ వివరాలు!
Nani Court and Kiran Dilruba OTT streaming partners in telugu

Court and Dilruba : ఈవారం రెండు ఆస‌క్తిక‌ర‌మైన సినిమాలు ప్రేక్ష‌కుల ముందుకు వచ్చాయి. ఒక‌టి కోర్ట్ అయితే, రెండోది దిల్ రూబా. కోర్ట్ సినిమాకు నాని నిర్మాత‌. వాల్ పోస్ట‌ర్ సినిమా ప‌తాకంపై ఈ చిత్రాన్ని నిర్మించారు.

అలాగే  యంగ్ హీరో కిరణ్‌ అబ్బవరం,   రుక్సార్‌ థిల్లాన్‌ జంటగా నటించిన తాజా చిత్రం ‘దిల్‌ రూబా’. ఫుల్ లెంగ్త్ లవ్‌ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి విశ్వ కరుణ్‌ దర్శకత్వం వహించారు.  

సామ్‌ సీఎస్‌ సంగీతం అందించిన.. ఈ మూవీలో నజియా కీలక పాత్రలో నటించింది. రెండు చిత్రాల్లో నాని సినిమాకు మంచి మార్కులు పడ్డాయి. ఈ నేపధ్యంలో ఈ చిత్రాల ఓటిటి వివరాలు బయిటకు వచ్చాయి. 

23
court movie review


 రీసెంట్ గా  సంచ‌ల‌నం సృష్టించిన ఫోక్సో చట్టం, అందులోని లొసుగుల్ని వాడుకొంటూ, అమాయ‌కుల్ని హింసిస్తున్న వైనం ఈ క‌థ‌లో చూపించారు. ‘ఈ సినిమా న‌చ్చ‌క‌పోతే నా హిట్ 3 చూడొద్దు’ అంటూ నాని కూడా `కోర్ట్`పై విప‌రీత‌మైన న‌మ్మ‌కాన్ని చూపిస్తూ ప్రమోషన్స్ చేసారు.

హీరోగా ప్రియ‌ద‌ర్శిపై కూడా ప్రేక్ష‌కుల‌కు న‌మ్మ‌కం ఉంది. అదే ఈ సినిమాకు మంచి ఓపినింగ్స్ రప్పించింది.  కోర్ట్ రూమ్ డ్రామాలు కూడా కాసులు కురిపిస్తాయ‌ని చాలా సినిమాలు నిరూపించాయి. ఈసారీ అదే ఫ‌లితం ద‌క్కుతుంది.

మార్చి 14న సినిమా విడుద‌ల అయ్యిన ఈ చిత్రం డిజిటల్‌ రైట్స్ ను విడుదలకు ముందే ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ భారీ ధరకు సొంతం చేసుకుంది. అలాగే ఈ సినిమా నాలుగు వారాల థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్నాక ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా మేకర్స్ ఒప్పందం చేసుకున్నారని తెలుస్తోంది.
 

33
court movie review


ఇక  ‘క‌’ త‌ర‌వాత కిర‌ణ్ అబ్బ‌వ‌రం నుంచి వ‌చ్చిన సినిమా ‘దిల్ రూబా’. ఈ సినిమాపై కూడా రిలీజ్ కు  మంచి అంచ‌నాలు ఉన్నాయి. సినిమాకు మిక్సెడ్ టాక్ వచ్చినా  ప్రేమ క‌థ‌ని కొత్త కోణంలో చూపించే ప్ర‌య‌త్నం చేశారని అంటున్నారు.

 ముఖ్యంగా డైలాగులు యూత్ కి న‌చ్చాయి. పాట‌లూ బాగున్నాయి. స‌రిగ‌మ సంస్థ తెలుగులో నిర్మించిన తొలి సినిమా ఇది. ‘క‌’ మంచి విజ‌యాన్ని అందుకోవ‌డంతో కిర‌ణ్ ఊపుమీద ఉన్నాడు. ఈ సినిమా కూడా వీకెండ్ స‌క్సెస్ అయితే ఇంకో మెట్టు ఎక్కిన‌ట్టే.

‘దిల్ రూబా’డిజిటల్‌ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ వేదిక ఆహా మంచి ధరకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా విడుదలైన నాలుగు వారాల తర్వాత దిల్‌రూబా ఆహాలో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.

Read more Photos on
click me!

Recommended Stories