అఫీషియల్ : ‘హరి హరవీరమల్లు’ కొత్త రిలీజ్ డేట్
Harihara Veeramallu : పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా విడుదల తేదీని నిర్మాణ సంస్థ ప్రకటించింది. పవన్, నిధి అగర్వాల్ గుర్రపు స్వారీ చేస్తున్న పోస్టర్‌ను విడుదల చేశారు.
Harihara Veeramallu : పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా విడుదల తేదీని నిర్మాణ సంస్థ ప్రకటించింది. పవన్, నిధి అగర్వాల్ గుర్రపు స్వారీ చేస్తున్న పోస్టర్‌ను విడుదల చేశారు.
Harihara Veeramallu : పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరో గా రూపొందుతున్న పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu). ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు. ఫస్ట్ పార్ట్ కి సంబంధించి షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది.
ఏడాదిగా పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో ఈ సినిమా మిగిలిన చిత్రీకరణ వాయిదా పడుతూ వస్తోంది. పవన్ పాత్రకు సంబంధించి 20 రోజుల షూట్ మాత్రమే మిగిలిఉంది. దీంతో తన సన్నివేశాలను పూర్తి చేసేందుకు పవన్‌కల్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం రిలీజ్ డేట్ ప్రకటన వచ్చి అభిమానులను ఆనందపరుస్తోంది.
‘హరి హరవీరమల్లు’ కొత్త విడుదల తేదీ వచ్చేసింది. పవన్ అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఎదురుచూస్తున్న ఈ చిత్రం మే 9న రానున్నట్లు నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ.. ఓ కొత్త పోస్టర్ పంచుకుంది.
ఇందులో పవన్, నిధి అగర్వాల్ ఇద్దరూ గుర్రపుస్వారీ చేస్తూ కనిపిస్తున్నారు. ఈ పోస్టర్‌తో టీమ్ ప్రేక్షకులకు హోలీ శుభాకాంక్షలు చెప్పింది. 17వ శతాబ్దం నేపథ్యంలో సాగే ఈ కథలో, పవన్‌కల్యాణ్ చారిత్రాత్మక యోధుడిగా నటిస్తున్నారు.
రెండు భాగాలుగా రానున్న ఈ మూవీ తొలిభాగం ‘హరి హర వీరమల్లు పార్ట్ 1: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ పేరుతో విడుదల కానుంది. ఈ సినిమా షూటింగ్ మొదలైన కొన్ని నెలలకే ప్రచారం అంటూ పవన్ వెళ్లిపోయారు. ప్రచారం వలన కొన్ని నెలలు పోయాయి.
ఆ తరువాత ఇంకొన్ని నెలలు డైరెక్టర్ క్రిష్ ప్రాజెక్ట్ నుంచి తప్పిపోవడంతో ఈ షూటింగ్ ఆగింది. ఇక క్రిష్ స్థానంలోకి ఏఎం రత్నం కొడుకు జ్యోతికృష్ణ ఎంటర్ అయ్యాడు.
అప్పటికే సగంకు పైగా షూటింగ్ ఫినిష్ అవ్వడంతో క్లైమాక్స్ మాత్రం జ్యోతికృష్ణ డైరెక్ట్ చేసి ఎలాగోలా సినిమాను ఫినిష్ చేశాడు. అనుపమ్‌ఖేర్, బాబీ దేవోల్, నిధి అగర్వాల్, నోరాహి ఫతేహి, విక్రమ్ జీత్, జిషుసేన్ గుప్త తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎం.కీరవాణి, నిర్మాత: ఎ.దయాకర్ రావు, సమర్పణ: ఏ.ఎం.రత్నం.