SSMB29:మహేష్ ప్రాజెక్టు నుంచి ప్రియాంక చోప్రా బ్రేక్ తీసుకుందా ?

Published : Feb 03, 2025, 09:45 AM IST

 SSMB 29  షూటింగ్లో ప్రియాంక చోప్రా (Priyanka Chopra)కు చెందిన కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారని తెలుస్తోంది. అయితే ఆ వివరాలు ఏమీ బయిటకు రాకుండా సీక్రెట్ గా ఉంచారు. 

PREV
13
SSMB29:మహేష్ ప్రాజెక్టు నుంచి ప్రియాంక చోప్రా బ్రేక్ తీసుకుందా ?
Priyanka Chopra, mahesh babu, rajamouli,


SSMB 29 Update:ప్రియాంక చోప్రా గత కొద్ది రోజుల్లో తెలుగు మీడియాలో తెగ నానుతోంది. టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న సంగ‌తి తెలిసిందే. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి, మ‌హేష్ బాబు కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న యాక్ష‌న్‌ అడ్వెంచరస్‌ ప్రాజెక్ట్ `ఎస్ఎస్ఎంబీ 29`లో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా ఎంపిక అయింది.

దుర్గా ఆర్ట్స్ బ్యాన‌ర్ పై కె.ఎల్‌. నారాయ‌ణ నిర్మిస్తున్న ఈ చిత్రం రీసెంట్ గా సెట్స్ మీద‌కు వెళ్లింది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో  షూటింగ్ జ‌రుగుతోంది. అయితే ఈ షూట్ నుంచి ప్రియాంక చోప్రా బ్రేక్ తీసుకుందని తెలుస్తోంది.

23


SSMB 29కి సంబంధించిన వర్క్ షాప్స్ ఇప్పటికే నిర్వహించగా, షూటింగ్ కూడా మొదలు పెట్టారు రాజమౌళి. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ శివార్లలో ఉన్న అల్యూమినియం ఫ్యాక్టరీలో షూట్ చేశారు.  

ఈ షూటింగ్లో ప్రియాంక చోప్రా (Priyanka Chopra)కు చెందిన కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారని తెలుస్తోంది. అయితే ఆ వివరాలు ఏమీ బయిటకు రాకుండా సీక్రెట్ గా ఉంచారు.  అయితే తాజా సమాచారం ప్రకారం ప్రియాంక షూట్ కు బ్రేక్ ఇచ్చి ముంబైకి వెళ్ళిపోయింది. అయితే రాజమౌళికి ఈ విషయం ఆమె ముందే చెప్పే షూట్ లో జాయిన్ అయ్యిందని సమాచారం. 
 

33


ప్రియాంక చోప్రా ఇలా SSMB 29 నుంచి బ్రేక్ తీసుకోవటానికి గల కారణం తన సోదరుడు సిద్దార్ద చోప్రా వివాహం  అని తెలుస్తోంది. పిభ్రవరి మూడవ వారంలో ఈ వివాహం జరగనుంది. ఈ మేరకు ఆమె ముంబై వెళ్లిపోయింది. వివాహం తర్వాత ఆమె తిరిగి వచ్చి షూట్ లో పాల్గొంటుంది. ఇక ఫిల్మ్ సిటీలో వేసిన పెద్ద సెట్ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోందని, దాని తర్వాత ఆఫ్రికాకు వెళ్లి కెన్యాలో షూట్ చేస్తారని వినికిడి.

 భారతీయ చిత్ర పరిశ్రమలో ఇప్పటివరకూ చూడని సరికొత్త ప్రపంచాన్ని రాజమౌళి (SS Rajamouli) ఆవిష్కరించబోతున్నారని రచయిత విజయేంద్రప్రసాద్‌ గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. దీంతో దీనిపై అంచనాలు రెట్టింపు అవుతున్నాయి . అమెజాన్‌ అడవుల నేపథ్యంలో సాగే ఈ కథలో పలువురు విదేశీ నటులు కనిపించనున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories