స్టార్ హీరోల సినిమాలకు ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగితే సుమ ఉండాల్సిందే, స్టార్ హీరోల ఇంటర్వ్యూలు జరగాలన్నా సుమ ఉండాల్సిందే. సుమ యాంకర్ల లో సెలబ్రిటీ.. స్టార్ హోదాతో లెలుగు వెలుగుతుంది సుమ. ఏజ్ బార్ అవుతుంటే యాంకర్ గా అవకాశాలు కోల్పోతుంటారు. కొత్త యాంకర్లు వస్తుంటే పాత యాంకర్లు మరుగున పడిపోతుంటారు. ఇప్పటికి చాలా మంది పరిస్థితి అదే. అటువంటిది.. ఎంత మంది కొత్త వారు వచ్చినా.. సుమ ఇమేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు.