Meera Jasmine : రామ్ పోతినేని మూవీతోనే ‘మీరా జాస్మిన్’తెలుగులో రీఎంట్రీనా..? ఎలాంటి పాత్రలో కనిపించబోతోంది..

Published : Feb 17, 2022, 12:24 PM IST

‘మీరా జాస్మిన్’ ( Meera Jasmine) టాలీవుడ్ రీ ఎంట్రీ త్వరలో ఇవ్వనుంది. ఇటీవల సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ  అభిమానులను పలకరిస్తున్న మీరా జాస్మిన్ రీ ఎంట్రీపై ఆసక్తి నెలకొంది.  రామ్ పోతినేని మూవీతోనే ప్రేక్షకులను పలకరించనున్నట్టు తెలుస్తోంది.    

PREV
16
Meera Jasmine : రామ్ పోతినేని మూవీతోనే ‘మీరా జాస్మిన్’తెలుగులో రీఎంట్రీనా..? ఎలాంటి పాత్రలో కనిపించబోతోంది..

తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఒకప్పుడు రాణించిన హీరోయిన్స్ లలో మీరా జాస్మిన్ (Meera Jasmine) ఒకరు. తెలుగులో ఆమె బాలకృష్ణ .. జగపతిబాబు .. రవితేజ .. పవన్ కల్యాణ్ లతో సినిమాలు చేసింది. ముఖ్యంగా  'గుడుంబా శంకర్' సినిమా  మీరా జాస్మిన్ కు మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది. ఆమెకు గ్లామర్ పరంగా నే కాకుండా నటనాపరంగా ఆమెకి మంచి మార్కులే పడ్డాయి. 
 

26

కానీ   సరైన సినిమాలు పడలేదు. దాంతో ఆశించిన స్థాయిలో సక్సెస్  లభించలేదు. అయినా అరాకొరా తమిళ .. మలయాళ భాషల్లో ఆమె వరుస సినిమాలు చేస్తూ వెళ్లింది. అక్కడ ఆమె ఖాతాలో కొన్ని హిట్స్ ఉన్నాయి. 

36

తెలుగుతో పాటు మలయాళం, త‌మిళ భాషల్లో న‌టించిన జాతీయ ఉత్త‌మ న‌టిగా గుర్తింపు పొందింది. 2014లో దుబాయ్ కి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనిల్ ని పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరం అయింది.అయితే వివాహం తర్వాత తలెత్తిన విబేధాల కారణంగా మీరా.. తన భర్తతో విడిపోయింది. ఇప్పుడు మీరా జాస్మీన్ మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తోంది.
 

46

ఈ మేరకే మీరా జాస్మిన్ రీసెంట్ గా ఇన్ స్టా లో అడుగుపెట్టింది. ఇలా ఇన్ స్టాలో ఎకౌంట్ ఓపెన్ చేసిందో లేదో, అలా ఫాలోవర్స్ సంఖ్య  కుప్పలు తెప్పలుగా  పెరిగిపోతోంది. మాస్ మహారాజా రవితేజ (Ravi Teja)కూడా మీరా జాస్మిన్ కి వెల్కమ్ చెబుతూ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో పోస్ట్ పెట్టాడు.  సినిమాలకు .. నా  ఫ్యాన్స్ కు మరింత దగ్గర కావడం కోసమే ఇన్ స్టాలో అడుగుపెట్టినట్టుగా ఆమె చెప్పింది. మలయాళంలో రీ ఎంట్రీ ఇచ్చిన ఆమె, తెలుగులోను రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు  కనిపిస్తున్నాయి.
 

56

ఈ క్రమంలో ఆమెకు రీఎంట్రీ ఎనర్జిటిక్  స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni) మూవీతోనే ఉండనుందంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు. మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి (Boyapati Srinu) తన సినిమాలో మీరాకు బంపర్‌ ఆఫర్‌ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. యంగ్‌ హీరో రామ్‌ పోతినేని బోయపాటి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రామ్ కు అక్క పాత్రలో నటించిందుకు మీరా జాస్మిన్ ను ఎంపిక చేసినట్టు సినీ వర్గాల  సమాచారం.  
 

66

గతంలోనూ ఆమె బోయపాటి తెరకెక్కించిన మొదటి సినిమా భద్రలో మీరా జాస్మిన్ హీరోయిన్‌‌గా నటించి విషయం తెలిసిందే. ఈ సినిమా అప్పట్లో  హిట్ గా నిలవడంతోపాటు.. మీరా జాస్మిన్ కు కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది. తాజాగా మీరా జాస్మిన్ నటించిన మలయాళ మూవీ ‘మకల్’ టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.  

click me!

Recommended Stories