Alia Bhatt : పూలచీరతో మెస్మరైజ్ చేస్తున్న అలియా భట్.. ‘గంగూబాయి కతియావాడి’ప్రమోషన్ కోసం లేటెస్ట్ ఫొటోషూట్

Sreeharsha Gopagani   | Asianet News
Published : Feb 12, 2022, 01:37 PM IST

‘ఆర్ఆర్ఆర్’ (RRR) హీరోయిన్, బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ (Alia Bhatt) నెక్ట్స్ మూవీ ‘గంగూబాయి కతియావాడి’. ఈ మూవీ రిలీజ్ కు సిధ్దంగా ఉంది. ఈ సందర్భంగా అలియా మూవీ ప్రమోషన్ లో భాగంగా చీరకట్టుతో నెటిజన్లను మైస్మరైజ్ చేస్తోంది.   

PREV
16
Alia Bhatt : పూలచీరతో మెస్మరైజ్ చేస్తున్న అలియా భట్.. ‘గంగూబాయి కతియావాడి’ప్రమోషన్ కోసం లేటెస్ట్ ఫొటోషూట్

గంగూబాయి కతియావాడి ప్రమోషన్ కోసం తెల్లటి పూల చీరలో అలియా భట్ అందరినీ ఆకట్టుకుంటోంది. తలలోనూ లిల్లీ ఫ్లవర్ ను ధరించి చక్కటి ఆహార్యాన్ని సొంతం చేసుకుంది. 
 

26

సంజయ్ లీలా బన్సాలీ తెరకెక్కించిన ‘గంగూబాయి కతియావాడి’ మూవీకి సంబంధించిన ప్రమోషన్ పనులు జోరందుకున్నాయి. ఇటు హీరోయిన్ అలియా భట్ కూడా పూర్తిగా ఈ మూవీ ప్రమోషన్ కే టైం కేటాయిస్తోంది. ఈ మూవీలో అలియాతో పాటు, అజయ్ దేవగన్ కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. 
 

36

ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ట్రైలర్ అన్ని బాషల్లోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. గంగూబాయి పాత్రలో అలియా చక్కగా ఒదిగిపోయింది. ఫీల్మ్  టేకింగ్, ఫ్రేమ్స్, సీన్స్ ఆడియెన్స్ కు తెగనచ్చుతున్నాయి. మాస్ ఓరియెంటెడ్ లో రూపొందిన ఈ సినిమా ఫిబ్రవరి 25న రిలీజ్ కానుంది. 
 

46

కాగా, ఈ మూవీ కోసం అలియా భట్ తెగ ఫొటోషూట్లు చేస్తోంది. చీరకట్టుతోనే అందరినీ మైమరిపిస్తోంది. అప్పటికే అందం అలియా సొంత కావడం.. ఆకర్షించే చీరను ధరించడంతో మరింత అందంగా కనిపిస్తోంది. ఈ ఫొటోషూట్ ఆమె అభిమానులను మంత్రముగ్దులను చేస్తోంది. 
 

56

తెల్లటి చీరలో పూల అంచు మరియు మ్యాచింగ్ బ్లౌజ్‌తో ఇన్ స్టాలో అందరినీ ఆకట్టుకుంటోంది. ఒక జత వెండి జుమ్కీలను కూడా చెవులకు పెట్టుకుంది. కురులలోనూ తెల్లని గులాబీలను పెట్టుకోవడంతో బ్యూటీఫుల్ లుక్ ను సొంతం చేసుకుంది.  
 
 

66

నిన్న గంగూబాయి కతియావాడి నుంచి రిలీజైన ‘దోలిడా’ సాంగ్ కూడా అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ వీడియో ట్రాక్ లో అలియా అభినయం అందదరినీ కట్టిపడేసేలా ఉంది. దోలిడా సాంగ్ ను చూసిన బాలీవుడ్ గ్రీక్ వీరుడు హృతిక్ రోషన్ స్పందిస్తూ ‘ఇక ప్రారంభం’అంటూ కామెంట్ కూడా చేశారు. 

click me!

Recommended Stories